For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏడిపించేసిన రీతూ చౌదరి.. వాళ్లకి ఇష్టం లేకుండానే ఇన్ని రోజులు ఇలా చేసిందా?

  |

  జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె అంతకంటే కొన్ని ముందే కొన్ని సీరియల్స్ లో నటించింది కానీ ఆమెకు జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ కంటే అప్పటి క్రేజ్ తక్కువ అనే చెప్పాలి అయితే తాజాగా ఈటీవీ ప్రసారం చేస్తున్న ఒక స్పెషల్ ప్రోగ్రాంలో రీతూ చౌదరి ఎమోషనల్ అయింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

  యశస్వి కొండేపూడికి

  యశస్వి కొండేపూడికి


  ఇంటిగుట్టు అనే సీరియల్ ద్వారా రీతు చౌదరి మంచి పేరు సంపాదించింది. జీ తెలుగులో ప్రసారమైన ఈ సీరియల్ కు మంచి పేరు రాకపోయినా అందులో రీతు చౌదరి పాత్రకు మాత్రం మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమవుతున్న సింగింగ్ కాంపిటీషన్లో యశస్వి కొండేపూడికి హగ్ చేసుకోవడమే గాక అవసరమైతే గర్ల్ ఫ్రెండ్ గా కూడా మారతానంటూ ఆమె కామెంట్లు చేసింది.

  పొలిటికల్ లీడర్ అని

  పొలిటికల్ లీడర్ అని


  అలా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఆమెకు జబర్దస్త్ ద్వారా అవకాశాలు దక్కాయి. ఈ మధ్యకాలంలో కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్న ఆమె తన బాయ్ ఫ్రెండ్ ని కూడా పరిచయం చేసింది. ఆయన పేరు శ్రీకాంత్ అని, పొలిటికల్ లీడర్ అని కూడా ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరోసారి రీతు చౌదరి వార్తల్లోకి ఎక్కింది.

  Recommended Video

  సీతా రాముల ప్రేమ కావ్యం, ఓ అద్భుతం *Reviews | Telugu FilmiBeat
  హలో బ్రదర్

  హలో బ్రదర్


  దానికి కారణం ఈ టీవీ ప్రసారం ఈటీవీలో ప్రసారం కాబోతున్న హలో బ్రదర్ అనే ఒక రాఖీ స్పెషల్ ఈవెంట్. ఈ ఈవెంట్ లో భాగంగా కంటెస్టెంట్ల అన్నలను, చెల్లెళ్లను తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేశారు ఈటీవీ నిర్వహకులు. అందులో భాగంగానే రీతూ చౌదరి వంతు రాగా తనకు ఒక అన్నయ్య ఉన్నాడని కానీ ఆయనకు రాఖీ కట్టే అవకాశం లేదని చెప్పి బాధపడుతుంది.

  భావోద్వేగానికి గురయ్యి

  భావోద్వేగానికి గురయ్యి


  ఎందుకు ఏమైంది అంటే నేను ఇక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదు అని రీతు చౌదరి పేర్కొంటుంది. అయితే అంతలోనే శ్రీముఖి నీకు ఒక సర్ప్రైజ్ అని చెబుతూ రీతూ చౌదరి ఎవరి గురించే అయితే బాధపడుతుందో సోదరుడిని తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.ముందుగా అమ్ములూ అంటూ వాళ్ళ బ్రదర్ గొంతువినిపించింది. అంతేకాదు ఆయన స్టేజ్‌పైకి వచ్చి రీతూని హగ్ చేసుకోవడంతో ఆమె ఎమోషనల్ అవుతుంది. ఇక అన్నయ్యని ఇలా చూసిన రీతూ కన్నీళ్లు ఆపుకోలేకపో స్టేజ్‌పైనే భావోద్వేగానికి గురయ్యి ఏడ్చేసింది.

   భానుతో కలిసి

  భానుతో కలిసి


  ఈ సన్నివేశాలు అన్ని కూడా మిగిలిన ఆర్టిస్టులను సైతం గుండె బరువెక్కేలా చేశాయి. ఇక ఈ ప్రోగ్రాములో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు, కొందరు టీవీ ఆర్టిస్టులు కూడా పాల్గొన్నారు. ఇక రాంప్రసాద్‌, భానుతో కలిసి చేసిన అన్నా చెల్లి స్కిట్‌ అయితే షో మొత్తానికి హైలైట్ హా నిలిచింది అని చెప్పక తప్పదు. చెల్లి కోసం చివర్లో చనిపోయిన తండ్రి మైనపు విగ్రహాన్ని చూపించడం అయితే ఆకట్టుకుంది. ఇక ఈ హల్‌ బ్రదర్‌ షో ఆదివారం సాయంత్రం ఏడుగుంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతుంది.

  English summary
  rithu chowdary becomes emotional in hello brothers etv special event which gone viral in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X