Ritu Chowdary: లగ్జరీ కారు కొన్న జబర్దస్త్ రీతూ చౌదరి..ఖరీదు ఎన్ని లక్షలో తెలుసా?
రీతూ చౌదరి.. ఈ పేరు తెలియని ప్రేక్షకుడు ఉండడు. అంటే అది కూడా సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అయ్యేవారికి గట్టి పరిచయం ఉంటుంది. అమ్మడి గురించి చెప్పాలంటే.. సీరియల్స్ తో కెరీర్ ను ప్రారంభించిన ఈ చిన్నది అనుకోకుండా జబర్దస్త్ లో మెరిసింది. అంతే అమ్మడి రేంజ్ మారిపోయింది. జబర్దస్త్ లో స్కిట్స్ కంటే లవ్ ట్రాక్ లు నడిపి బాగా ఫేమస్ అయిన వారు ఎక్కువ.
ఇక రీతూ కూడా అలానే ట్రై చేసింది. జబర్దస్త్ కమెడియన్ అజర్ తో లోబ్ ట్రాక్ నడిపించారు. సుధీర్, రష్మీ.. వర్ష, ఇమ్మానుయేల్ ను ఇమిటేట్ చేస్తూ వీరు కూడా ఫేమస్ అవ్వాలని చూశారు. కానీ, అది వర్క్ అవుట్ కాకపోవడంతో ఆపేశారు. ఇక ఆ తరువాత రీతూ వరుసగా షోస్ లలో కనిపిస్తూ ఒకపక్క.. సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ మరోపక్క బిజీగా మారింది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే రీతూ ఫేమస్ అవ్వడానికి మరో రీజన్.. ఆమె ప్రైవేట్ వీడియోలు లీక్ అవ్వడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెప్పుకొచ్చినా నెటిజన్స్ నమ్మలేదు. ఇది జరిగినకొన్నిరోజులు ఆమె తండ్రి చనిపోవడం.. తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ షేర్ చేసి మరో వివాదం కొనితెచ్చుకుంది. ఇలా రీతూ వివాదాల ద్వారా కూడా ఫేమస్ అయ్యింది.
ఇన్ని వివాదాలు, విమర్శలు వస్తున్నా కూడా అవేమి పట్టించుకోకుండా కెరీర్ మీద ఫోకస్ చేస్తోంది. తాజాగా ఈ చిన్నది లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఖరీదైన టొయోటో హైక్రాస్ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపింది. దాని విలువ అక్షరాలా.. రూ.30 లక్షలు పైనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సెలబ్రిటీలందరూ ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తున్నారు. తల్లితో కలిసి షోరూం కు వెళ్లిన రీతూ.. తన కొత్త కారుకు పూజ చేసి డెలివరీ తీసుకుంటున్న వీడియోను అభిమానులతో షేర్ చేసింది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. ఇంత లగ్జరీ గా బతకడానికి అంత డబ్బు ఎక్కడినుంచి వస్తుంది.
నెల మొత్తం ఆఫీస్ లో కష్టపడినా కూడా ఖర్చులకు కూడా రావడం లేదు. వీళ్లు ఎలారా ఇంత లగ్జరీగా కార్లు కొంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రీతూ.. దావత్ అనే టాక్ షో చేస్తుంది. ఈ కార్యక్రమానికి వచ్చే గెస్టులను బోల్డ్ ప్రశ్నలు వేస్తూ నిత్యం ఫుల్ ట్రెండింగ్ లో ఉంటోంది. మరి ముందు ముందు ఈ చిన్నది సినిమాల్లో ఏమైనా కనిపిస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











