Bigg Boss 9 Telugu: రీతూ చౌదరి షాకింగ్ ఎలిమినేషన్.. 13 వారాల్లో ఎంత రెమ్యునరేషన్ అందుకుందంటే?
Rithu Chowdary: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం 13వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం జరిగిన ఎలిమినేషన్ ప్రేక్షకులతో పాటు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ను కూడా ఆశ్యర్చానికి గురించి చేసింది. నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఎవరు బయటకు వెళతారనే దానిపై సోషల్ మీడియాలో వేర్వేరు ఊహాగానాలు వినిపించినప్పటికీ, చివరికి ఎవరూ ఊహించని విధంగా రీతూ చౌదరి వెళ్లిపోవడం పెద్ద ట్విస్ట్‌గా మారింది. ఈ నేపథ్యంలో రీతూ చౌదరి ఎలిమినేషన్ కారణాలేంటీ? రీతూ రెమ్యూనరేషన్ చర్చనీయంగా మారింది.
బిగ్ బాస్ 13వ వారంలో నామినేషన్స్‌లో రీతూ, భరణి, సుమన్, సంజన లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్ పోల్స్ ప్రకారం కూడా సుమన్ ఎలిమినేట్ అవుతాడని ప్రచారం జరిగింది. ఒకనొక సమయంలో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చనే టాక్ వినిపించింది. అంతేకాదు, బిగ్ బాస్ బజ్ ప్రశ్నలు కూడా సుమన్ కోసం సిద్ధమై ఉన్నాయనే టాక్ కూడా వచ్చింది. కానీ, చివరి నిమిషంలో నిర్ణయం మారి, ఎవరు ఊహించని విధంగా రీతూనే ఎలిమినేట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ మేనేజ్‌మెంట్ మరోసారి విమర్శలు వెల్లువెత్తున్నాయి.

ఇటీవల సంజన ఎపిసోడ్, అలాగే భరణిని చీట్ చేస్తూ రింగ్ దాచిన సందర్భంతో రీతూ ప్రేక్షకులను ఆగ్రహాన్ని ఎదుర్కొవల్సి వచ్చింది. చాలా కన్నింగ్‌గా ఆడుతోందని అనేక రీల్స్, వేల కామెంట్లు సోషల్ మీడియా ద్వారా వచ్చాయి. ఇది రియల్ టైంలో ఓటింగ్ డిసిజన్‌పై ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. రీతూ టాప్ 5 కంటెస్టెంట్‌గా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ, చివరి నిమిషం ట్విస్ట్‌తో హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశం అవుతున్న మరో విషయం రీతూ పారితోషికం. సోషల్ మీడియా ఇన్ పుట్స్ ప్రకారం.. రీతూ రోజుకు రెమ్యూనరేషన్ గా రూ. 40,000 అందుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వారానికి రూ. 2.75 లక్షల నుండి రూ. 3.5 లక్షల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది. ఇలా 13 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు సుమారు రూ.35.75 లక్షల నుండి రూ.45.50 లక్షల వరకు సంపాదించినట్లు అంచనా. ఇది నిజమైతే ఈ సీజన్‌లోనే అత్యధిక పారితోషికం పొందిన కంటెస్టెంట్ ఆమెగానే భావిస్తున్నారు.
రీతూ హౌస్‌లోకి అడుగుపెట్టే వరకు ప్రేక్షకుల్లో పెద్దగా నెగెటివిటీ లేకపోయినా, బిగ్ బాస్ జర్నీలో అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే వాటిని తట్టుకొని 13 వారాల జర్నీని సక్సెస్ గా పూర్తి చేసిన ఆమెకు ప్యూచర్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. ఇక ఆమె బిగ్ బాస్ తర్వాత ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తుంది? అండ్ ఈ ఇమేజ్ ని ఎలా యూటిలైజ్ చేస్తుంది? అన్నది చూడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రీతూ ఎలిమినేషన్‌తో హౌస్ గేమ్ డైరక్షన్ మారే అవకాశం ఉందని, రాబోయే టాస్కుల్లో కొత్త అలజడి కనిపించవచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.


Click it and Unblock the Notifications











