హైపర్ ఆదికి ప్రముఖ నటి లవ్ ప్రపోజ్: ఆమెకు నో చెప్పగానే ఏడుస్తూ.. చెంప పగలగొట్టిన యాంకర్

తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుంటూ తిరుగులేని షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. దీని ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. అందులో చాలా మంది సెలెబ్రిటీలుగానూ మారిపోయారు. అలాంటి వారిలో పంచ్‌ల స్పెషలిస్టుగా పేరొందిన హైపర్ ఆది ఒకడు. సాదాసీదా ఆర్టిస్టుగా షోలోకి వచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిపోయాడు. దీంతో వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇలా జెట్ స్పీడుతో వెళ్లిపోతోన్న హైపర్ ఆదికి తాజాగా ఓ నటి లవ్ ప్రపోజ్ చేసింది. అసలేం జరిగింది? దాని వెనుక పూర్తి వివరాలు మీకోసం!

టాప్ కమెడియన్‌గా హైపర్ ఆది

టాప్ కమెడియన్‌గా హైపర్ ఆది

జబర్ధస్త్‌లోకి వచ్చిన తక్కువ సమయంలోనే తనదైన పంచులు, ప్రాసలతో హైపర్ ఆది ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా ఎదుటి వాళ్లపై తన డైలాగులతో దండయాత్ర చేస్తూ పేరు సంపాదించుకున్నాడు. దీంతో జబర్ధస్త్ అంటే హైపర్ ఆది అనేంతగా ఎదిగిపోయాడు. అలాగే, ఎన్నో స్కిట్లు కొట్టా షోలోనే టాప్ కమెడియన్‌ అనిపించుకున్నాడు.

టీవీలోనే కాదు.. వెండితెరపైనా

టీవీలోనే కాదు.. వెండితెరపైనా

బుల్లితెరపై వరుస షోలతో సత్తా చాటుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా అడుగు పెట్టేశాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో కీలకమైన పాత్రలు కూడా చేశాడు. అలాగే, 'ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ 'మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్ రైటర్‌గానూ పని చేశాడు. ఇలా ఇప్పటికీ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు.

జబర్ధస్త్‌కు టాటా.. అవి మాత్రం

జబర్ధస్త్‌కు టాటా.. అవి మాత్రం


సుదీర్ఘ కాలంగా హైపర్ ఆది బుల్లితెరపై తనదైన మార్కుతో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఇందులో భాగంగానే జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగం అయ్యాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ ఇస్తున్నాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, 'ఢీ14', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలు చేస్తున్నాడు.

హైపర్ ఆదికి నటి లవ్ ప్రపోజ్

హైపర్ ఆదికి నటి లవ్ ప్రపోజ్

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది తనదైన శైలి కామెడీతో సత్తా చాటుతున్నాడు. మరీ ముఖ్యంగా దీని నుంచి సుధీర్ తప్పుకోవడంతో ఒంటి చేత్తో షోను నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ యంగ్ కమెడియన్‌కు ప్రముఖ నటి రీతూ చౌదరి లవ్ ప్రపోజ్ చేసింది. దీంతో అతడితో పాటు అక్కడున్న వాళ్లందరూ నోరెళ్లబెట్టేసి మరీ షాక్‌కు గురయ్యారు.

నూకరాజు ప్రశ్నించగానే ఇలా

నూకరాజు ప్రశ్నించగానే ఇలా

తాజాగా జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో భాగంగా నూకరాజు.. రీతూ చౌదరితో 'నువ్వు ఓ ఛానెల్‌లో ఒకరిని హగ్ చేసుకుని ప్రేమిస్తున్నా అన్నావు. ఈ మధ్య అజార్‌ను లవ్ చేస్తున్నా అన్నావ్. ఇంతకీ నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో తెలుసుకోవచ్చా' అని సూటిగా ప్రశ్నించాడు. దీంత రీతూ చౌదరి తన మనసులో ఆది ఉన్నాడని చెబుతూ అతడి చేతిని పట్టుకుని ప్రపోజ్ చేసింది.

ఐలవ్యూ అనగానే ఆది రిజెక్ట్

ఐలవ్యూ అనగానే ఆది రిజెక్ట్


ఆ తర్వాత రీతూ చౌదరి మాట్లాడుతూ.. 'మీరు స్కిట్లలో నా మీద పంచులు వేసినా నాకిష్టమే. ఎందుకంటే ఆ కొద్దిసేపైనా మీతో టైమ్ స్పెండ్ చేయడం ఇష్టం. అందుకే ఐలవ్యూ' అని చెప్పేసింది. దీనికి హైపర్ ఆది 'నాకు నిజంగా ఈ విషయం తెలీదు. తను ఇప్పుడు చెబితేనే తెలిసింది. నాకు నిజంగా అలాంటి ఉద్దేశం లేదు' అని చెప్పగానే ఆమె ఏడుస్తూ వెళ్లిపోయింది.

చెంపపై కొట్టిన రష్మీ.. క్లారిటీగా

చెంపపై కొట్టిన రష్మీ.. క్లారిటీగా


రీతూ చౌదరి అక్కడి నుంచి వెళ్లిపోగానే యాంకర్ రష్మీ గౌతమ్ వచ్చి హైపర్ ఆది చెంప పగలగొట్టేసింది. ఆ తర్వాత నూకరాజు వెళ్లి రీతూ చౌదరిని తీసుకుని వచ్చాడు. అప్పుడామె 'ఇదంతా టీఆర్పీ స్టంట్‌లో భాగంగానే చేశాం. కానీ, ఆది మాత్రం అమ్మాయిలంటే ఎంతో గౌరవిస్తాడు. స్కిట్‌లో పంచ్‌లు వేసినా.. నిజంగా చాలా మంచోడు' అంటూ క్లారిటీ ఇచ్చి అందరికీ షాకిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X