Demon Pavan - Rithu Chowdary: డీమాన్ తో లవ్ ట్రాక్? తొలిసారి అసలు విషయం చెప్పేసిన రీతూ!
Demon Pavan - Rithu Chowdary: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో రీతూ చౌదరి - డిమాన్ పవన్ జంట హౌస్‌లోనే కాదు, బయట కూడా హాట్ టాపిక్‌గా మారింది. షోలో కనిపించిన వీళ్ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, బయటకు వచ్చాక కూడా కలిసి కనిపిస్తూ అదే బాండింగ్‌ను కొనసాగిస్తున్నారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇద్దరూ కలిసి ఓ డ్యాన్స్ షోలో పాల్గొనడం మరింత ఆసక్తిని పెంచింది. మొత్తానికి రీతూ-డిమాన్ జంట సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంది. 'ఇది నిజమైన బంధమా?'అన్న ప్రశ్న సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది.
ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన రీతూ
ఈ నేపథ్యంలో తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న రీతూ చౌదరి తన బిగ్‌బాస్ జర్నీ, డీమాన్ పవన్‌తో ఉన్న బంధం, అలాగే తనపై జరిగిన ట్రోలింగ్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది. బిగ్‌బాస్ ప్రయాణం గురించి ప్రశ్నించగా, రీతూ ఎలాంటి మొహమాటం లేకుండా "డీమాన్ పవన్ నా ఫేవరెట్ కంటెస్టెంట్" అని చెప్పింది. ఈ ఫన్ మోమెంట్స్ మధ్యే రీతూ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా నిజాయితీగా మాట్లాడింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు బయట తనపై జరుగుతున్న విమర్శలు తనకు తెలియవని చెప్పింది.

అయితే బయట ఫైర్ స్ట్రోమ్ టీమ్ డీమాన్ పవన్‌కు తనతో మాట్లాడొద్దని చెప్పిన విషయం తెలిసినప్పుడు తీవ్రంగా కలత చెందినట్టు వెల్లడించింది. "రీతూ బ్యాడ్... ఆమె నిన్ను వాడుకుంటుంది" అనే మాటలు విని తన తల్లి ఎంతగా బాధపడిందో చెప్పుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఓటింగ్ కోసం ఫోన్ చేసినప్పుడు కూడా 'మీ అమ్మాయి క్యారెక్టర్ బాగోలేదు' అని అన్న సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. "బయట స్ట్రాంగ్‌గా కనిపించినా, లోపల మాత్రం వాష్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చిన రోజులు ఉన్నాయి" అన్న ఆమె మాటలు చాలా మందిని కదిలించాయి.
లవ్ ట్రాక్‌పై క్లారిటీ
డీమాన్ పవన్‌తో రిలేషన్‌పై వస్తున్న రూమర్లకు రీతూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. 'మా మధ్య ఉన్నది నిజాయితీ. ఇది ముందే ప్లాన్ చేసి చూపించిన బంధం కాదు. పరిస్థితులు, షో ప్రెజెంటేషన్ వల్ల అది వేరేలా కనిపించింది' అని చెప్పింది. ప్రస్తుతం తమ బాండింగ్‌ను స్నేహంగా ఎంజాయ్ చేస్తున్నామని, భవిష్యత్తు ఏం తీసుకువస్తుందో కాలమే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.
రీతూ చౌదరి - డీమాన్ పవన్ జంట బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నది వాస్తవం. ఇది ప్రేమా? స్నేహమా? అన్నది ఇప్పటికీ స్పష్టత రాకపోయినా, ఈ బాండింగ్ వల్లే సీజన్ మరింత హిట్ అయిందని చెప్పొచ్చు. రీతూ ఓపెన్‌గా మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా, ఆమెపై ఉన్న అనుమానాలు కొంతమేర తగ్గుతాయేమో చూడాలి. తాజాగా బీబీ జోడిలో ఈ జంటకూడా తన డ్యాన్స్ తో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ జంటను కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. జడ్జ్స్ కూడా వీరి పర్మామెన్స్ కు ఫిదా అవుతున్నారు.


Click it and Unblock the Notifications











