రీతూ చౌదరి పెళ్లి.. ఆరు నెలలకే విడాకులు.. పూర్తిగా బయట పెట్టిన నటి

బుల్లితెర నటి రీతు చౌదరి తెలుగు ప్రేక్షకుల్లో కాస్త గుర్తింపు దక్కించుకుంది. సీరియల్ నటిగా కెరియర్ ను ప్రారంభించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంటిగుట్టు అనే సీరియల్ లో రీతు చౌదరి లో మెరిసింది. ఆ సీరియల్ తో కాస్త గుర్తింపును సొంతం చేసుకుంది. కోవిడ్ తర్వాత నుంచి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్ గా కనిపిస్తూ నెటిజనులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన విషయాలను కూడా రీతూ చౌదరి అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే తాజాగా రీతు చౌదరి తన పెళ్లి గురించి కొన్నాళ్లుగా వస్తున్న రూమర్ పై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. తనకు పెళ్లయి విడిపోయిందన్న వార్తలకు సమాధానం ఇచ్చింది. 2022 లో రీతు చౌదరి శ్రీకాంత్ అనే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. అదే సమయంలో ఆమె అతనిని పెళ్లి చేసుకున్నట్లుగా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇప్పటికీ ఇంటర్నెట్లో ఆ ఫోటోలు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. కానీ రీతు చౌదరి మాత్రం తన పెళ్లిపై ఎప్పుడు అధికారిక ప్రకటన చేయలేదు.

Rithu Chowdary Reacted on her Marriage

కానీ ఆ ఫోటోలతో రీతు చౌదరి రహస్యంగా పెళ్లి చేసుకుంది అంటూ వార్తలు వచ్చాయి. దానిపై తాజాగా రీతు చౌదరి ఇలా స్పందించి క్లారిటీ ఇచ్చింది. తాజా ఇంటర్వ్యూలో రీతు చౌదరి మాట్లాడుతూ తనకు అసలు పెళ్లి కాలేదని చెప్పుకొచ్చింది. అతనితో కేవలం ఒక ఆరు నెలలు మాత్రమే కలిసి ఉన్నాను అని మాత్రం చెప్పింది. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఏవి లేవని, అవన్నీ అవాస్తవాలనీ కూడా వెల్లడించింది. ప్రస్తుతం తను ఎవరితోనూ రిలేషన్షిప్ లో కూడా లేనని చెప్పుకొచ్చింది. ఇక దీంతో రీతూ చౌదరి పెళ్లి వార్తలపై స్పష్టమైన క్లారిటీ వచ్చింది.

ఇదిలా ఉంటే రీతూ చౌదరి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ విషయంలో నమోదైన పలుకేసుల్లో ఆరోపణలను కూడా ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ మధ్యలో 700 కోట్ల స్కామ్ లో కూడా రీతు చౌదరి ఆరోపణలను ఎదుర్కొంది. ఇలా వరుస ఘటనలతో రీతు చౌదరి పేరు తరచుగా వార్తలు వినిపిస్తూనే ఉంది. ఈ రీతు చౌదరి ప్రస్తుతం తన కెరియర్ పై ఫోకస్ పెట్టినట్లు చెప్పింది.

సీరియల్స్ లో అవకాశాలు అందుకున్న తర్వాత రీతు చౌదరి పలు టీవీ షోల్లోనూ మెరిసింది. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ కామెడీ షో లో ఆయా స్కిట్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన ఫ్యాషన్ సెన్స్ తో కూడా బుల్లితెర ఆడియన్స్ ను ఫిదా చేసింది. ఆ తర్వాత దావత్ అనే టాక్ షోలో యాంకర్ గా కనిపించింది. బుల్లితెర సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X