ఆరేళ్ల సహజీవనానికి గుడ్‌బై.. విడిపోయిన టెలివిజన్ తారలు
హిందీ టెలివిజన్ సీరియల్స్‌లో పాపులర్ జంట రిత్విక్ ధన్‌జానీ, ఆషా నేగి తమ సహజీవనానికి గుడ్‌బై చెప్పారు. వారిద్దరి విడాకులు తీసుకోవడంపై టెలివిజన్ రంగంలో కలకలం రేపింది. పెళ్లివైపు అడుగులు వేస్తున్న ఈ జంట గత ఆరేళ్లకుపైగా ఉన్న జీవితానికి ముగింపు పలుకుతూ తీసుకొన్న నిర్ణయం తమ సన్నిహితులు, స్నేహితులకు షాక్ కలిగించింది.
రిత్విక్, ఆషా ఇద్దరు చాలా సుదీర్ఘకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఒకరిని మరోకరు ఇష్టంగా ప్రేమిస్తారు. అలాంటి జంట విడిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని పలువురు అభిప్రాయపడ్డారు. గత కొద్దికాలంగా వారిద్దరి మధ్య కలతలు చోటుచేసుకొన్నాయి. వాటిని పరిష్కరించుకొంటామని అనుకొన్నాం. కానీ ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకొంటారని అనుకోలేదు అనే భావన వ్యక్తమవుతున్నది.

పవిత్ర రిస్తా అనే సీరియల్ షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య పరిచయం జరిగింది. వారి పరిచయం ప్రేమగా మారింది. చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇక ఆషా అనురాగ్ బసు దర్శకత్వం వహించే లుడో అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఫాతీమా సనా షేక్, రాజ్‌కుమార్ రావు, సన్యా మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్, అభిషేక్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











