డిమాన్‌ పవన్‌తో రిలేషన్‌పై రీతూ చౌదరి ఓపెన్.. గట్టిగానే ప్లాన్ చేశారుగా..

ఇటీవల ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రేక్షకుల్లో భారీ చర్చలకు దారి తీసింది. ఈ సీజన్ విజేతగా కళ్యాణ్ పడాల నిలవగా, షో మొత్తాన్ని హైలైట్ చేసిన అంశంగా మాత్రం రీతూ చౌదరి - డిమాన్ పవన్ జంట నిలిచింది. హౌస్‌లో వీరిద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ, పరస్పర సహకారం, ఎమోషనల్ మూమెంట్స్ కారణంగా బయట ప్రపంచంలో కూడా ఈ జంటపై ఆసక్తి తారాస్థాయికి చేరింది. 'ఇది నిజమైన బంధమా? లేక గేమ్‌లో భాగంగా ప్లాన్ చేసిన రిలేషన్‌నా?' అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ చౌదరి తన బిగ్‌బాస్ ప్రయాణం, డిమాన్‌తో ఉన్న బంధం, అలాగే తనపై జరిగిన ట్రోలింగ్ గురించి ఓపెన్‌గా మాట్లాడింది.

ఇటీవల రీతూ చౌదరి కిసిక్ టాక్ షోలో పాల్గొంది. షో ప్రారంభంలోనే యాంకర్ ఆమెను "స్వీటీ, హాటీ" అంటూ గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. ఇక 'బిగ్‌బాస్ క్వీన్ రీతూ చౌదరి' అంటూ సరదాగా పరిచయం చేశారు. అక్కడే డిమాన్ పవన్ పేరు రావడంతో రీతూ ఫన్నీగా రియాక్ట్ అవుతూ ప్రేక్షకులను నవ్వించింది.'రీతూ అనేది నా పేరు... డీమాన్ అని పిలిచినా పరవాలేదు. కానీ దివ్య అని మాత్రం పిలవద్దు'అంటూ ఆమె ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

Ritu Choudary Opens Up on Demon Pawan Relationship

బిగ్‌బాస్ జర్నీ గురించి ప్రశ్నించగా, 'డిమాన్ పవన్ నా ఫేవరెట్ కంటెస్టెంట్' అని రీతూ ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పింది. హౌస్‌లో తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. అంతేకాదు, యాంకర్ వర్ష సరదాగా డిమాన్ పవన్‌కు కాల్ చేయమని అడగగా, రీతూ నిజంగానే డిమాన్‌కు ఫోన్ చేయడం, ' పండుగకు ఎక్కడికైనా వెళ్దామా?' అని అడగడం హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కూడా వెంటనే 'సరే, ప్లాన్ చేద్దాం' అని చెప్పడంతో, రీతూ ఎమోషనల్ అయింది. ఆ సన్నివేశంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అయిన రొమాంటిక్ సాంగ్ ఈ బాండింగ్‌ను మరింత హైలైట్ చేసింది.

అయితే.. ఈ ఫన్నీ సంభాషణల మధ్యే రీతూ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగా బయట ప్రపంచంలో తనపై ఏ రకమైన విమర్శలు జరుగుతున్నాయో తనకు తెలియదని చెప్పింది. కానీ ఫైర్ స్ట్రోమ్ టీమ్ డిమాన్ పవన్‌కు తనతో మాట్లాడొద్దని చెప్పిన విషయం తెలిసినప్పుడు తాను తీవ్రంగా ఆందోళనకు గురయ్యానని వెల్లడించింది. "రీతూ బ్యాడ్, ఆమె నిన్ను వాడుకుంటుంది" అనే మాటలు విని తన తల్లి ఎంతగా బాధపడిందో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

బయట తన తల్లికి ఎదురైన అవమానాలు, ఓటింగ్ కోసం ఫోన్ చేసినప్పుడు కూడా 'మీ అమ్మాయి క్యారెక్టర్ బాగోలేదు'అని చెప్పిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ రీతూ తీవ్రంగా ఎమోషనల్ అయింది. 'బయట నేను స్ట్రాంగ్‌గా కనిపించినా, లోపల మాత్రం వాష్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చిన రోజులు ఉన్నాయి'అని చెప్పడం చాలా మందిని కదిలించింది. ఆ సమయంలో తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై స్పందిస్తూ,'ఇష్టం వచ్చినట్టు మీమ్స్ చేయడం, బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఒకవైపు... అదే వాళ్లు బయట కలిస్తే 'రీతక్కా, నేను మీ పెద్ద ఫ్యాన్' అని అంటారు' అంటూ ద్వంద్వ వైఖరిని ఎండగట్టింది. ప్రేమ పేరుతో మోసం చేసే వారి గురించి మాట్లాడుతూ, 'అమ్మాయి కన్నీళ్లు కార్చినవాడు ఎప్పటికైనా అదే అనుభవిస్తాడు. నేను కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతాను'అని చెప్పింది.

ఇక డిమాన్ పవన్‌తో తన రిలేషన్ విషయానికి వస్తే, రీతూ పూర్తిగా క్లారిటీ ఇచ్చింది. 'మా మధ్య ఉన్నది నిజాయితీ. ఇది ముందే ప్లాన్ చేసి చూపించిన బంధం కాదు. పరిస్థితులు, షో ప్రెజెంటేషన్ వల్ల అది వేరేలా కనిపించింది' అని స్పష్టం చేసింది. ప్రస్తుతం తమ బాండింగ్‌ను స్నేహంగా ఎంజాయ్ చేస్తున్నామని, భవిష్యత్తు ఏం తీసుకువస్తుందో కాలమే నిర్ణయిస్తుందని చెప్పింది.

మొత్తంగా చూస్తే.. రీతూ చౌదరి - డిమాన్ పవన్ జంట బిగ్‌బాస్ 9 సీజన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచిందన్నది వాస్తవం. వీరిద్దరి బాండింగ్‌కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇది నిజమైన ప్రేమా? లేక బలమైన స్నేహమా? అన్నది ఇప్పటికీ పూర్తిగా క్లారిటీ కాకపోయినా, ఈ జంట వల్లే సీజన్ మరింత హిట్ అయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రీతూ ఓపెన్‌గా మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ తర్వాత అయినా, ఆమెపై ఉన్న అనుమానాలు కొంతమేర తగ్గుతాయేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X