నా క్యారెక్టర్‌పై నిందలు... వాళ్లకు ఉసురు తగులుతుంది!
తెలుగు బుల్లితెరపై ఇటీవలకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రీతూ చౌదరి (Ritu Chowdary). సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించి, జబర్దస్త్ ద్వారా విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొని మరింత ఫేమ్ సంపాదించింది రీతూ చౌదరి. అయితే అదే సమయంలో ఆమెపై వచ్చిన విమర్శలు, క్యారెక్టర్‌పై నిందలు తనను ఎంతగా బాధపెట్టాయో తాజాగా మరోసారి భావోద్వేగంగా వెల్లడించింది.
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో డిమాన్ పవన్ తో ఆమెకు ఉన్న స్నేహం పెద్ద చర్చకు దారి తీసింది. తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పినా, బయట ప్రపంచంలో మాత్రం ఈ ఇద్దరి మధ్య 'సంథింగ్ సంథింగ్'అంటూ వార్తలు, మీమ్స్, ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. టీవీ షోల్లోనూ వీరి మధ్య ప్రేమ ఉన్నట్టుగా చూపించడంతో, చాలామంది అదే నిజమని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో రీతూ ఎదుర్కొన్న మానసిక వేదన గురించి తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది.

ఇటీవల యాంకర్ వర్ష హోస్టుగా వ్యవహరిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)అనే టాక్ షోలో రీతూ గెస్టుగా హాజరైంది.దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షోలో తన బిగ్‌బాస్ ప్రయాణం, బయట ప్రపంచంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది.'బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ, ఫైర్ స్ట్రోమ్ టీమ్ డెమోన్ పవన్‌ను నాకీ దూరంగా ఉండమని, నేను చెడ్డదాన్నని, అతడిని వాడుకుంటున్నానని చెప్పారు. వాళ్లు అలా చెప్పడం వల్ల నా తల్లి చాలా బాధపడ్డారు'అంటూ రీతూ ఎమోషనల్ అయ్యింది.
తండ్రి మరణం తర్వాత తమ కుటుంబానికి ఎవరూ లేరని, బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మిగతా కంటెస్టెంట్లకు బంధువుల నుంచి కాల్స్ వస్తే, తమకు మాత్రం ఎవరూ లేరన్న బాధను వెల్లడించింది.అలాగే.. ఓట్ల కోసం తన తల్లి బంధువులకు ఫోన్ చేసినప్పుడు ఎదురైన అనుభవాన్ని రీతూ వివరించింది. 'ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్... మేము ఓటు వేయం'అని కొందరు అన్నారని చెప్పింది. ఆ మాటలు విన్న తల్లి బాధపడుతుంటే, బయట ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం వాష్‌రూమ్‌లో కూర్చుని వెక్కివెక్కి ఏడ్చేదాన్నని తెలిపింది. "అలాంటి బాధ ఏ ఆడపిల్లకూ రాకూడదు" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇక తన క్యారెక్టర్‌పై నిందలు వేసిన వారిపై రీతూ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. 'నేను ఎవరి వల్లైనా ఏడ్చానంటే, వాళ్లకు ఏదో ఒకటి అవ్వకుండా లేదు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది'అంటూ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు కొందరు తన పేరు వాడుకుని అటెన్షన్ పొందిన వారిని ఉద్దేశించిందేనని నెటిజన్లు భావిస్తున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్‌పై కూడా రీతూ ఘాటుగా స్పందించింది. 'ఇష్టమొచ్చినట్టు మీమ్స్ వేస్తారు, బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అదే వాళ్లు బయట కనిపిస్తే 'రీతూ అక్కా... నేను మీకు పెద్ద ఫ్యాన్' అంటారు' అంటూ నవ్వుతూ చెప్పినప్పటికీ, ఆ మాటల్లో బాధ స్పష్టంగా కనిపించింది.
ప్రస్తుతం రీతూ బిగ్ బాస్ జోడీ సీజన్ 2 లో డెమాన్ పవన్‌తో జోడీగా పాల్గొంటూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. అయినప్పటికీ, తన జీవితంలో ఎదురైన విమర్శలు, కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు ఇప్పటికీ తనను వెంటాడుతున్నాయని ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా వెల్లడించింది. 'నా క్యారెక్టర్‌పై నిందలు వేసిన వాళ్లకు కర్మ తప్పక తిరిగి వస్తుంది'అన్న ఆమె మాటలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











