Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌజ్ లోకి రీతూ చౌదరి ఎంట్రీ.. షాక్ ఇచ్చిన నాగార్జున
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. బిగ్ బాస్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న 2025 సీజన్ కు సంబంధించి ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. గ్రాండ్ హౌస్ సెట్టింగ్ తో పాటు కంటెస్టెంట్ల ఎంపిక కూడా రసవతంగా జరిగింది. బిగ్ బాస్ హౌస్ లోకి రెండు రకాలుగా కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇందులో సెలబ్రిటీ కంటెస్టెంట్లు, కామనర్స్ ఉన్నారు. ఇక వీరిలో బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీ కంటెస్టెంట్ విభాగంలో బుల్లితెర బ్యూటీ రీతు చౌదరి ఎంట్రీ ఇవ్వడం విశేషం. రీతు వర్మ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇలా ఉన్నాయి.
రీతు చౌదరి హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. 1995 డిసెంబర్ 25న జన్మించింది. 29 ఏళ్ల ఈ బ్యూటీ టీవీ రంగంలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. 2018లో పెళ్లిచూపులు అనే టీవీ షోలో తొలిసారిగా మెరిసింది. ఆ తర్వాత మౌనమే ఇష్టం అనే తెలుగు చిత్రంలో హీరోయిన్ గా నటించింది. అలాగే గోరింటాకు అనే టీవీ సిరీస్ లో కూడా నటించింది. ఆమె తండ్రి మరణించారు. తల్లి హోం మేకర్ గా ఉండింది. అడిగితే చౌదరికి సోదరుడు జతిన్ చౌదరి ఉన్నారు.

అలాగే రీతు చౌదరి తెలుగు కామెడీ రియాలిటీ షో శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ కామెడీ షోలలో మెరిసి తనదైన శైలిలో అలరించింది. అలాగే 2024 లో తెలుగు రియాలిటీ గేమ్ షో కిర్రాక్ బాయ్స్ ఖిలాడి లేడీస్ కంటెస్టెంట్ గా అలరించింది. ఇక దావత్ అనే సెలబ్రిటీ టాక్స్ షోకు యాంకర్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. ప్రస్తుతం పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.
బుల్లితెర బ్యూటీ రీతూ వర్మ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటారు. అదే జోష్ లో పవర్ ఫుల్ డ్యాన్స్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన పెర్ఫామెన్స్ తర్వాత నాగార్జునతో కలిసి మాట్లాడింది. ఇక నాగార్జున రీతూ చౌదరికి షాక్ ఇచ్చాడు. ఆమె అసలు పేరుతో దివ్య అంటూ పిలిచాడు. దాంతో రీతూ చౌదరి ఇరిటేట్ అయ్యింది. సార్ నన్ను దయచేసి ఆ పేరుతో పిలవకండి అని చెప్పింది. నాుకు ఆ పేరు అంటే అస్సలు నచ్చదని, అందుకే పేరు మార్చుకున్న అని చెప్పింది. చిన్నప్పుడు స్కూల్లో దివ్య పేరుతో చాలా మంది ఉండే వాళ్లని అందుకేనా నా పేరును మార్చుకున్నానని చెప్పింది.
ఇక తనకు తన తండ్రి అంటే చాలా ఇష్టమని చెప్పింది. తను లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడను. నాకు నోటి దూల ఎక్కువ. ఎవరైనా ఎక్కువ మాట్లాడే అస్సలు నాకు నచ్చదు. ఎవరైనా జెన్యూన్ గా లేకపోతే అస్సలు సహించను. ఇక బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన తర్వాత నోటి దూలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇక నాతో పాటు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎవరైనా కామనర్ ను తీసుకు వెళ్లాలంటే నాగాను తీసుకు వెళ్తాను. ఆయనలో నాకు మంచి జెన్యూన్ పర్సన్ కనిపించారు. మంచి ఫన్ కూడా ఆయనలో ఉంది. ఆయన నాతో పాటు ఆయన వస్తే బాగుంటుందని చెప్పింది.


Click it and Unblock the Notifications











