Bigg Boss NonStop: అడుగు పెడుతూనే లవ్ ఫెయిల్యూర్ బయట పెట్టిన ఆర్జే చైతూ.. బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ నాన్‌స్టాప్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే రెండు టీములు గా బిగ్ బాస్ కంటెస్టెంట్ లు ఉంటారు అని నాగార్జున ప్రకటించారు. గత సీజన్లకి సంబంధించిన కంటెస్టెంట్ లు వారియర్స్ గా, కొత్తగా వచ్చే వారు చాలెంజర్స్ గా పిలవబడతారు అంటూ నాగార్జున ప్రకటించారు. అషు రెడ్డి, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్ కతుర్వార్, యాంకర్ స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇవ్వగా వారి తరువాత ఆర్జే చైతు ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఆయన ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

తండ్రి చనిపోవడంతో
గత సీజన్లో ఆర్జే కాజల్ ను కంటెస్టెంట్ గా తీసుకువచ్చిన విధంగానే ఈ సీజన్లో రెడ్ ఎఫ్ఎంలో రేడియో జాకీగా పనిచేస్తున్న చైతూని తీసుకువచ్చారు. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వక ముందు గానే రేడియో జాకీ చైతూ ఏవి ఒకటి ప్రసారం చేయగా అందులో తాను విజయవాడలో పుట్టి పెరిగానని తన చిన్ననాటి సమయంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీద పడ్డాయి అని చెప్పుకొచ్చాడు.

తిరస్కరణలకు గురై
తన చిన్నప్పుడు తాను కూడా తల్లి చేసే వ్యాపారంలో చిన్న చిన్న సాయాలు చేస్తూ ఉండేవాడిని అని అలా కష్టపడడం ఎలా ? ఏమిటి? అని నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. రేడియోలో మాట్లాడే వారిని గురించి విని విని తాను కూడా రేడియోలో మాట్లాడాలి అనుకున్నాను అని అయితే చాలా తిరస్కరణలకు గురైన తరువాత తాను ఎట్టకేలకు రేడియో జాకీగా పని మొదలు పెట్టాను అని పేర్కొన్నారు.

విషాదంలో కూరుకుపోతూ
తన స్నేహితుల సహాయంతో నేను ఆ ఉద్యోగం తెచ్చుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.. అదే సమయంలో ఒక అమ్మాయితో ప్రేమలో పడటంతో పాటు కొన్ని రోజులకే ఆ ప్రేమ విఫలమైందని ఇక ఆ ప్రేమ విఫలమై విషాదంలో కూరుకుపోతున్న తనకు ఎట్టకేలకు జీవితం అంటే ఏమిటి అనే విషయం తెలిసి వచ్చింది అని చెప్పుకొచ్చారు.

ఫుడ్ వ్యాపారం మొదలు పెట్టి
పార్ట్ టైం రేడియో జాకీగా మొదలుపెట్టిన తాను తర్వాత ఫుల్ టైం రేడియో జాకీగా మారాను అని ఆయన చెప్పుకొచ్చారు. తాను హైదరాబాద్ లో కష్టపడుతున్నాను అని భావించిన తల్లి విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఫుడ్ వ్యాపారం మొదలు పెట్టింది అని అలా తనకు అండగా నిలబడింది అని చెప్పుకొచ్చారు. ఆమెకు ఇల్లు కట్టి ఇవ్వడం తన కల అని ఆయన చెప్పుకొచ్చాడు.

తల్లిని స్టేజి మీదకు
ఇక స్టేజి మీదకు వచ్చిన తర్వాత నాగార్జున. ఆయనకు ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను అని చెబుతూ ఆయన తల్లిని స్టేజి మీదకు తీసుకువచ్చారు. ఆమె వచ్చి రావడంతో తన కుమారుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అయితే ఆమె మీకు పెద్ద అభిమాని అని చైతూ నాగార్జునకు చెప్పారు. అంతేకాక హౌస్ లోకి వెళ్లబోయే ముందు ఆమె తీసుకువచ్చిన తినుబండారాలు కూడా తింటూ తాను ఎలా అయినా హౌస్ లో కప్ గెలుస్తాను అని ధైర్యంతో లోపలికి వెళ్ళాడు చైతూ.


Click it and Unblock the Notifications











