‘శ్రీముఖితో నా రిలేషన్‌షిప్ అదే.. ఆమె కనెక్ట్ అయింది అక్కడే’
రేడియో జాకీగా పరిచయమైన చైతూ ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా మారి మరింత పాపులర్ అయ్యాడు. రేడియో జాకీగా, యూట్యూబర్‌గా రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా తన ప్రతిభను చాటుకొంటున్నాడు. అయితే తాజాగా ఐడ్రీమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లైఫ్‌లోని విషయాలను వెల్లడించారు. శ్రీముఖి, జబర్దస్త్ అవినాష్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్ రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆర్జే చైతూ అలియాస్ చైతన్య పంచుకొన్న విషయాల్లోకి వెళితే..
రేడియో జాకీగా పనిచేస్తున్న సమయంలో నా షోకు చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. నా షోలో పాల్గొన్న తర్వాత నాతో చాలా మంది స్నేహంగా ఉండటం మొదలుపెట్టారు. వారిలో చాలా మంది మిత్రులు ఉన్నారు. అందులో ఒకరే శ్రీముఖి, జబర్దస్త్ అవినాష్, వారితో ప్రయాణం ప్రత్యేకమైనది అని చైతూ తెలిపారు. ఆర్జేగా చైతూ పనిచేస్తున్న సమయంలో చోట స్క్రీన్ బడా స్టార్ అనే రేడియో షా ద్వారా శ్రీముఖితో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆమె సూపర్ సింగర్ కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సమయంలోనే తన స్టూడియోస్‌కు ఆహ్వానించాను. ఆ తర్వాత పటాస్ తర్వాత మా మధ్య పరిచయం బాగా పెరిగింది. ఆ పరిచయంతో సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకోవడం ద్వారా మరింత దగ్గరయ్యాం అని చైతూ చెప్పారు.

శ్రీముఖితో ఉన్న స్నేహం గురించి రకరకాల రూమర్లు, ఊహాగానాలు వచ్చాయి. అవి నాకు బాధను కలిగించాయి. సినిమా, టీవీ రంగంలో పనిచేస్తున్నాం కాబట్టి వారే నాకు స్నేహితులు ఉంటారు. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే వాళ్లే నాకు స్నేహితులు అవుతారు. ప్రొఫెషనల్‌గా నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి వారితోనే నాకు ఫ్రెండ్‌షిప్ ఉంది. అందరితోను కనెక్ట్ అంతా ఈజీగా కాలేం. నిజమైన బంధంపైనే స్నేహం ఆధారపడి ఉంటుంది అని చైతూ అన్నాడు.
స్నేహం విషయంలో ఎదుటి వాళ్ల రియాక్షన్‌ను బట్టి మన రియాక్షన్ ఉంటుంది. ఎదుటి వాళ్లు గౌరవం ఇస్తే.. నేను గౌరవం ఇస్తాను. మనకు ఇచ్చే ప్రయారిటీని బట్టినే నా ప్రాధాన్యత ఉంటుంది. జెమినీ టెలివిజన్‌లో కెవ్వు కబడ్డీ షోకు శ్రీముఖి యాంకర్‌గా, నేను కామెంటేటర్‌గా పనిచేశాం. ఆ సమయంలో కలిసి భోజనం చేయడం, షూటింగ్ సమయంలో మా మధ్య అభిప్రాయాలు ఒకేలా ఉండటంతో ఫ్రెండ్‌షిప్ జర్నీ మొదలైంది. మా ఫ్రెండ్‌షిప్ బలపడి ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నది అని చైతూ చెప్పారు.
చైతు మాట్లాడుతూ, తాను ఇండస్ట్రీలో ఉన్నందున సహజంగానే తన మిత్రులు సెలబ్రిటీలవుతారని వివరించారు. తన షోలకు అతిథులుగా వచ్చిన వారే ఆ తర్వాత కార్యాలయానికి వచ్చి, ప్రతిరోజు కాల్ చేస్తూ స్నేహాన్ని పెంచుకునేవారని ఆయన అన్నారు. తన ఖ్యాతి హైదరాబాద్‌కే పరిమితమైనా, వారి బంధం కేవలం స్నేహం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.శ్రీముఖితో తన పరిచయం 'సూపర్ సింగర్' షో సమయంలో మొదలైందని, 'ఛోటా స్క్రీన్ బడా స్టార్' సెగ్మెంట్‌కి ఆమెను పిలిపించడంతో తొలిసారి స్టూడియోలో కలిశానని చైతు గుర్తుచేసుకున్నారు.
రేడియోలో నిర్వహించిన టాలెంట్ షో ద్వారా అవినాష్ పరిచయం అయింది. ఆ సమయంలో ఆయన జబర్దస్త్‌లో లేడు. ఆ పోటీలో అవినాష్ విజయం సాధించాడు. జబర్దస్త్ ద్వారా మంచి పేరు వచ్చింది. ఆ సమయంలో నా షోకు అవినాష్‌ను ఆహ్వానించాను. అప్పటికే శ్రీముఖితో ఆయనకు ఫ్రెండ్‌షిప్ ఉంది. దాంతో మా మధ్య స్నేహం మరింత బలపడింది అని చైతూ చెప్పారు.


Click it and Unblock the Notifications











