Bigg Boss: ఆర్జే కాజల్ రెమ్యూనరేషన్ లీక్.. 14 వారాలకు అన్ని లక్షలు.. గెలవకున్నా కోరిక తీరిందిగా!

ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానులను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఐదేళ్లుగా ఇది బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ భారీ స్థాయిలో రేటింగ్‌ను రాబడుతోంది. దీంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇక, ఇప్పుడు జరుగుతోన్న ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఫినాలేకు ముందే ఈ షో నుంచి ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయిపోయింది. దీంతో ఆమె కల నెరవేరకుండానే ప్రయాణాన్ని ముగించింది. ఈ నేపథ్యంలో అసలు ఆర్జే కాజల్ పద్నాలుగు వారాలకు ఎంత రెమ్యూనరేషన్ అందుకుందన్న దానిపై తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కాజల్

టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన కాజల్

బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టారు. అలాంటి వారిలో ఆర్జే కాజల్ ఒకరు. రేడియో జాకీగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపును అందుకున్న ఆమె.. బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని కలలు కనేది. ఇందులో భాగంగానే ఐదో సీజన్‌లో ఛాన్స్ పట్టేసింది. ఇలా ప్రయాణం మొదలెట్టింది.

స్ట్రాటజీ మాస్టర్‌గా... లేడీ నారదగా పేరు

స్ట్రాటజీ మాస్టర్‌గా... లేడీ నారదగా పేరు

అన్ని భాషల్లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోలు చూస్తూ వచ్చిన కాజల్.. దీన్ని పూర్తిగా చదివేసినట్లు స్ట్రాటజీలు ప్లే చేస్తుండేది. దీంతో ఆమెకు ఆరంభంలో స్ట్రాటజీ మాస్టర్ అనే పేరు వచ్చింది. అదే సమయంలో అందరితో మాట్లాడుతూ పర్సనల్ విషయాలు చెప్పించుకునేది. దీంతో ఆమెకు లేడీ నారదా అనే పేరు కూడా వచ్చింది. ఇవి ఆమెను చాలా బాధ పెట్టాయని చెప్పుకోవచ్చు.

అందరితో గొడవలే.. హైలైట్ అవ్వాలనే

అందరితో గొడవలే.. హైలైట్ అవ్వాలనే

బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన రోజు నుంచే కాజల్ హైలైట్ అవుతూ వచ్చింది. ఇందులో తన ఆటతీరుతోనేమో కానీ.. తరచూ ఎవరో ఒకరితో గొడవలు పడడం వల్ల హాట్ టాపిక్ అయ్యేది. షోలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరితోనూ ఆమె ఎప్పుడో అప్పుడు గొడవలు పడుతూనే ఉంది. స్క్రీన్ స్పేస్ దక్కించుకోవడం కోసమే ఆమె ఇలా వ్యవహరించేదని విమర్శలను ఎదుర్కొంది.

ఫ్రెండ్స్‌ కోసం గేమ్స్.. వాళ్లను గెలిచేసి

ఫ్రెండ్స్‌ కోసం గేమ్స్.. వాళ్లను గెలిచేసి

బిగ్ బాస్ హౌస్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన కాజల్.. తనపై ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోకుండా ఉండేది. ఎలాగైనా ఫినాలేలో అడుగు పెట్టాలన్న పట్టుదలతో గేమ్స్ ఆడేది. ఒక్కసారి కెప్టెన్ కాకున్నా.. తన స్నేహితుల కోసం గట్టిగానే కష్టపడేది. దీంతో సన్నీ, మానస్‌లకు చాలా హెల్ప్ చేసింది. ఇలా హౌస్‌లో వాళ్లిద్దరి స్నేహాన్ని మాత్రం కాజల్ గెలుచుకుంది.

ఫినాలేలో అడుగు పెట్టాలని.. చివరికిలా

ఫినాలేలో అడుగు పెట్టాలని.. చివరికిలా

బిగ్ బాస్ షో అంటే పడి చచ్చిపోయే కాజల్.. అందులోకి అడుగు పెట్టడమే తన డ్రీమ్ అని ఎన్నోసార్లు చెప్పుకుంది. అలాగే, ఫినాలేలో అడుగు పెట్టాలని.. టైటిల్ గెలుచుకుని రికార్డు క్రియేట్ చేయాలని కలలు కన్నది. అందుకు అనుగుణంగానే చివరి వరకూ పోరాడింది. కానీ, ఊహించని విధంగా ఆమె 14వ వారంలోనే ఎలిమినేట్ అయింది. దీంతో ఫినాలేకు చేరలేకపోయింది.

ఆర్జే కాజల్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్

ఆర్జే కాజల్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్

14 వారాల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కాజల్‌కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా, షో వివరాలు తెలిసిన ప్లేయర్‌గా కొనసాగిన ఆమెకు బాగానే ముట్టజెప్పి ఉంటారని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆర్జే కాజల్ రెమ్యూనరేషన్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.

Recommended Video

Jeethu Joseph About Screen Writing | Drushyam 2
వారానికి ఎంత.? మొత్తం ఎంత అంటే

వారానికి ఎంత.? మొత్తం ఎంత అంటే


బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్జే కాజల్ వారానికి రెండున్నర నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుందట. అంటే ఆమె 14 వారాలు వారాల పాటు హౌస్‌లో కొనసాగింది. కాబట్టి మొత్తం మీద ఆమెకు రూ. 30 లక్షలకు పైగానే రెమ్యూనరేషన్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో తనకు ముప్పై లక్షలు అప్పు ఉందని చెప్పింది. ఇప్పుడు దాన్ని తీర్చబోతుందన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X