Bigg Boss Telugu 5 Week 14 Elimination: బిగ్‌బాస్ నుంచి లేడీ నారద అవుట్.. ఆ ఆశలు అడియాశలే!
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తుది అంకానికి చేరింది. మరి కొద్ది రోజుల్లో అంటే మరో వారంలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ పూర్తికానుంది ప్రస్తుతానికి హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉండగా అందులో ఒకరు సేఫ్ అయ్యారు. మరో ఐదుగురిలో ఒకరు ఈ ఆదివారం నాడు ఎలిమినేట్ కానున్నారు అయితే ఆదివారం నాడు ఎలిమినేట్ కావడానికి ముందే శనివారమే లింకులు బయటకు వచ్చేస్తుంది సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రకారం ఆ కంటెస్టెంట్ ఎవరు తేలిపోయింది. వివరాల్లోకి వెళితే

19 మంది కంటెస్టెంట్లు
గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్‌కు ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వారిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకు 13 వారాలకు 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. వీరిలో మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేత, ఏడో వారం ప్రియ, ఎనిమిదో వారం లోబో, తొమ్మిదో వారం విశ్వ, పదకొండో వారం ఆనీ, పన్నెండో వారం రవి, పదమూడో వారంలో ప్రియాంక సింగ్‌లు ఎలిమినేట్ అయ్యారు.

కరోనా జాగ్రత్తల నేపథ్యంలో
అయితే పైన చెప్పిన అందరూ వోటింగ్స్ ప్రకారం బయటకు వెళ్లిపోగా జెస్సీ మాత్రం పదో వారంలో అనారోగ్యంతో హౌస్ ను వీడి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే గత సీజన్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ లాంటివి ఉండేవి కానీ ఈ సీజన్ లో అలాంటివి ఏమీ లేకుండా చూసుకున్నారు. కరోనా జాగ్రత్తల నేపథ్యంలో చాలా కట్టుదిట్టమైన ప్లానింగ్ చేసారు.

టాప్ 5గా నిలిచి
ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ సీజన్ ఫినాలేకు టైం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ఆరుగురు కంటెస్టెంట్లలో టాప్ 5గా నిలిచి ఫినాలేకు చేరుకునే వాళ్లు ఎవరన్న దానిపై అనేక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరికి నచ్చిన వారి పేర్లను వాళ్ళు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు కూడా పోటాపోటీగా టాస్కులు ఆడుతూ ఎవరూ ఎవరికీ తక్కువ కాదనే అభిప్రయాన్ని కలిగిస్తున్నారు.

అంచనా వేయలేక
నిజానికి ఇప్పటికే హౌస్ లో ఉన్న ఆరుగురిలో శ్రీరామ్ ఇప్పటికే చేరుకున్నారు. మిగిలిన మానస్, ఆర్జే కాజల్, సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీలు ఈ వారం ఎలిమినేషన్స్ కోసం నామినేట్ అయ్యారు. వీరంతా కూడా బలమైన కంటెస్టెంట్స్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఎవరూ సరి అయిన అంచనా వేయలేకపోతున్నారు.

కాజల్ వెనకబడి
14వ వారానికి సంబంధించి నామినేషన్స్‌లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండడంతో గత వారాలతో పోలిస్తే ఈ వారం ఓటింగ్ ప్రక్రియ ఇంట్రెస్టింగ్ గా సాగింది..షో చివరి వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే చివరి వరకు టాప్ 5లో చోటు సంపాదించడానికి సిరి, కాజల్ లు పోటాపోటీగా ఓట్లు సాధించగా చివరిగా ఓటింగ్ ముగిసే సమయానికి కాజల్ వెనకబడింది.

ఆర్జే కాజల్ ఎలిమినేట్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ వారం ఆర్జే కాజల్ ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిలో కాజల్ కి తక్కువ ఓట్లు వచ్చినట్లు చెబుతున్నారు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి 17 వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన కాజల్.. మొదటి రెండు మూడు వారాల్లోనే ఎలిమినేట్ అవుతుంది అని అనుకున్నారు. కానీ గట్టి వారు బయటకు వెళ్లినా ఆమె తనదైన ఆటతో అందరిని ఆకట్టుకుని ఇక్కడి దాకా వచ్చింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











