twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షణ్ముఖ్ నాతోనే ఉండాలన్నాడు..అందుకే అలా.. అసలు విషయం ఓపెన్ అయిన కాజల్

    |

    బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న షణ్ముఖ్ జస్వంత్ విన్నర్ గా నిలుస్తాడని చాలా మంది భావించారు కానీ అనూహ్య పరిస్థితుల్లో అతను రన్నరప్ గానే నిలిచి పోవాల్సి వచ్చింది. ఇక సన్నీ విన్నర్ గా నిలిచి అందరి హృదయాలలో నిలిచాడు. ముందు నుంచి కూడా సన్నీతో మంచి స్నేహ సంబంధం ఏర్పరచుకున్న కాజల్ ఇప్పుడు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

     కాజల్ మీద నెగిటివ్ కామెంట్స్

    కాజల్ మీద నెగిటివ్ కామెంట్స్

    రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన కాజల్ బిగ్బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న 19 మంది కంటెస్టెంట్ లలో ఒకరిగా అడుగుపెట్టిన టాప్ ఫైవ్ లోకి వెళ్లడమే ధ్యేయంగా ఆడింది, కానీ టాప్ సిక్స్ లో నిలిచింది. అయితే ఆమె హౌస్ లో ఉన్నంత సేపు ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెట్టడమే ధ్యేయంగా ఉండేది అని చెబుతూ హౌస్ సభ్యులు చాలా మంది ఆమె మీద ఆరోపణలు చేసే వారు. లేడీ నారద అని, నాగిని అని ఇలా రకరకాలుగా కాజల్ మీద నెగిటివ్ కామెంట్స్ ఇంటాబయటా వినిపించేవి.

    నాగిని డాన్స్ లు కూడా

    నాగిని డాన్స్ లు కూడా

    అయితే మొదట్లో యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్ తులతో కాస్త క్లోజ్ గా ఉన్నట్లు అనిపించినా చివరికి మాత్రం సన్నీ గ్రూప్ లో చేరింది. తాజాగా ఇప్పుడు షణ్ముఖ్ నుంచి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది అనే విషయం మీద ఆమె నోరు విప్పింది. ఈ విషయం మీద కాజల్ మాట్లాడుతూ హౌస్ లో ఉన్న సమయంలో నా చుట్టూ నెగిటివిటీ ఎక్కువగా ఉండేదని నన్ను టార్గెట్ చేస్తూ నాగిని డాన్స్ లు కూడా చేశారని ఆమె చెప్పుకొచ్చింది.

    అది రాదు

    అది రాదు

    నేను హౌస్ లో నుంచి వెళ్ళిపోతే బావుంటుందని హౌస్ లో వాళ్ళు అనుకున్నారని కానీ వారి మాటలు విన్నాక నాకు అర్థమైంది ఏమిటంటే నేను ఏ విషయాన్నైనా ఓపెన్ గా మాట్లాడుతున్నాను లోపల ఏది పెట్టుకోవడం లేదు కాబట్టి వాళ్ళు నన్ను అలా భావిస్తూ ఉండి ఉండవచ్చు అని చెప్పుకొచ్చారు. బిగ్ బాస్ షో ని ఫాలో అయినంత మాత్రాన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ రాదు అని కేవలం మన వ్యక్తిత్వం మనం ప్రవర్తించే తీరును బట్టి వస్తుంది కానీ బిగ్ బాస్ షో ఎన్ని సీజన్లను చూసినా అది రాదు అని చెప్పుకొచ్చింది.

    కనెక్ట్ కాలేదు కదా

    కనెక్ట్ కాలేదు కదా

    ఇక తన గేమ్ విషయంలో స్ట్రాటజీ అప్లై చేశాను కానీ గేమ్ ఆడుతున్న మనుషుల విషయంలో అప్లై చేయలేదని అలా అనుకుని ఉంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న వాళ్లతోనే ఉండే దానిని కదా అని ఆమె చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ జస్వంత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది కానీ నేను అతనితో కనెక్ట్ కాలేదు కదా అని ఆమె ప్రశ్నించింది.

    ఇరుక్కోవాలి అనుకోలేదు

    ఇరుక్కోవాలి అనుకోలేదు

    నిజానికి షణ్ముఖ్ జస్వంత్ కి తనకు మొదట కనెక్షన్ ఏర్పడింది కానీ షణ్ముఖ్ మాత్రం నువ్వు ఉంటే నాతో మాత్రమే ఉండాలి వేరేవాళ్లతో ఉంటే నాకు ఇష్టం ఉండదు, నేను దాన్ని తీసుకోలేను నువ్వు నాతోనే ఉండాలి అని చెప్పుకొచ్చాడు. ఈ విషయం నాకు నచ్చలేదు నాకంటూ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి అతనికి దూరం జరిగాను, ఒకవేళ షణ్ముక్ ఫ్రెండ్ జోన్ లోకి వెళితే అది దాటి బయటికి రావడానికి అతనికి ఇష్టం ఉండదు, అందుకే నేను అక్కడికి వెళ్లి ఇరుక్కోవాలి అనుకోలేదు అని చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ ఎక్కువ పొసెసివ్ గా ఉంటాడు నాతో మాత్రమే ఉండాలి అనుకొంటాడు అని ఆమె చెప్పుకొచ్చింది.

    English summary
    Rj Kajal Reveals her connection with Shanmukh Jaswanth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X