బిగ్‌బాస్ నిజస్వరూపం ఇదే.. ఫేమ్ మాత్రమే, కెరీర్ కాదు!

తెలుగు టెలివిజన్‌లో సంచలనంగా మారిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) ద్వారా ఒక్కసారిగా సెలబ్రిటీలు అవుతున్నారు చాలామంది. షోలో అడుగుపెట్టిన వెంటనే ఫేమ్, గుర్తింపు, సోషల్ మీడియా ఫాలోయింగ్ హైలెవల్ లో పెరుగుతాయి. కానీ ఆ ఫేమ్ నిజంగా కెరీర్‌కు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అన్న ప్రశ్నకు తాజాగా బిగ్‌బాస్ సీజన్-5 కంటెస్టెంట్ ఆర్జే కాజల్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.

ఇటీవల కాజల్ ఓ వీడియో షేర్ చేస్తూ, బిగ్‌బాస్ తర్వాత కంటెస్టెంట్ల జీవితాల్లో ఏమి జరుగుతుందో చాలా ఓపెన్‌గా మాట్లాడారు. 'బిగ్‌బాస్‌లో పాల్గొన్న వారందరినీ జనాలు సెలబ్రిటీలనే పిలుస్తారు. కానీ బిగ్‌బాస్ తర్వాత నిజంగా ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు' అంటూ ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. కొంతమందికి బిగ్‌బాస్ తర్వాత కూడా రెగ్యులర్ వర్క్, సినిమాలు, షోస్, అవార్డ్స్, రివార్డ్స్ వస్తాయని, కానీ చాలామంది విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పారు.

RJ Kajal s Shocking Comment on Bigg Boss Reveals the Bitter Truth Behind Reality Show Fame

'బిగ్‌బాస్ తర్వాత అందరూ అడిగే ఒకే ప్రశ్న- 'నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?'... దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే చాలా సార్లు ఆ సమాధానం 'నథింగ్... ఏమీ లేదు' అనే అవుతుంది' అని కాజల్ తెలిపారు. ఇది టాలెంట్ లేకపోవడం వల్ల కాదు, బద్ధకం వల్ల కూడా కాదు... అసలు అవకాశాలే లేకపోవడమే అసలు సమస్య అని ఆమె స్పష్టం చేశారు.

బిగ్‌బాస్ తర్వాత ఫుల్ బిజీ, ఫుల్ వర్క్ ఉంటుందని చాలామంది అనుకుంటారని, కానీ అది ఎక్కువలోపు రెండు మూడు నెలల వరకే పరిమితమవుతుందని కాజల్ అన్నారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు సమస్య. 'బిగ్‌బాస్ ట్రామా, డిప్రెషన్... ఈ రెండింటి వల్ల మనం ఇంతకు ముందు చేసిన పనినీ మనస్ఫూర్తిగా చేయలేని పరిస్థితి వస్తుంది. కెరీర్‌లో గ్రోత్ లేక ముందుకు వెళ్లలేక, వెనక్కి తగ్గలేక ఇరుక్కుపోతాం' అంటూ ఆమె ఎమోషనల్‌గా చెప్పారు.

నటుల విషయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని కాజల్ అభిప్రాయపడ్డారు. 'బిగ్‌బాస్ సీజన్‌లో ఒక క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అదే ఇమేజ్‌ని చూసి ఇండస్ట్రీలో కొత్తవాళ్లను తీసుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలామంది బిగ్‌బాస్ కంటెస్టెంట్లు అవకాశాల కోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటారు' అని అన్నారు.

కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతే, మరికొందరు సోషల్ మీడియా, యూట్యూబ్‌లతో సరిపెట్టుకుంటారని చెప్పారు. 'రోడ్డుమీదికి వెళ్తే అందరూ గుర్తుపడతారు, సెల్ఫీలు అడుగుతారు. కానీ వర్క్ విషయానికి వస్తే మాత్రం ఫాలోవర్స్, బ్రాండ్ వ్యాల్యూ అంటూ బేరాలు మొదలవుతాయి. జీతం కొనసాగించాలంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక చేసుకుంటూ పోవాల్సి వస్తుంది' అని కాజల్ వివరించారు.

ఇంకొందరు పూర్తిగా వేరే కెరీర్‌లోకి వెళ్లిపోతారని, మరికొందరు ఒక్కసారిగా మాయమైపోతారని కూడా ఆమె అన్నారు. చివరగా ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 'బిగ్‌బాస్ వల్ల రాత్రికి రాత్రే ఫేమ్ సంపాదించవచ్చు. కానీ కెరీర్ మాత్రం బిల్డ్ అవదు. బిగ్‌బాస్ అనేది కెరీర్‌ను చేంజ్ చేసే ప్లాట్‌ఫామ్ కాదు... అది కేవలం ఒక ఫేమస్ రియాలిటీ గేమ్ షో మాత్రమే' అంటూ బిగ్‌బాస్ అసలు నిజస్వరూపాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పారు ఆర్జే కాజల్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, ప్రేక్షకుల మధ్య పెద్ద చర్చకు దారితీస్తూ, షో తర్వాతి జీవితం ఎంత కఠినంగా ఉంటుందో గుర్తు చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X