‘నా కాబోయే భర్త మూడుసార్లు చీటింగ్.. అందుకే ఆ క్రికెటర్‌తో డేటింగ్’
సోషల్ మీడియాలోనే కాకుండా ఇండియన్ మీడియాలో భారీ చర్చకు తెర లేపిన ముద్దుగుమ్మ ఆర్జే మహ్‌వష్. ఈ కుర్ర అందాల సుందరి క్రికెటర్ యజువేంద్ర చహల్‌తో కలిసి ఏ క్షణాన కెమెరాకు చిక్కిందో.. అప్పటి నుంచి ఈ బ్యూటీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ అందాల భామ ఎవరు? అంటూ మీడియా ఆరా తీసింది. చివరకు తాజాగా చహల్‌తో డేటింగ్ చేస్తున్న భామ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి చెందని వ్యక్తిగా గుర్తించారు. అయితే ఆ తర్వాత ఆమె ప్రొఫెల్, అఫైర్ల గురించి వెతకగా ఆసక్తికరమైన అంశాలే వెలుగులోకి వచ్చాయి. ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
ఇండియన్ క్రికెటర్ యజువేంద్ర చహల్ జాతీయ మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించాడు. తన భార్య, సినీ నటి ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకోవడం మీడియాలో చర్చనీయాంశమైంది. అత్యధిక మొత్తంలో విడాకుల కోసం డబ్బు చెల్లించి భార్య నుంచి వేరుపడ్డాడు. అలా విడాకులు తీసుకొన్నాడో లేదో.. కొత్త భామతో డేటింగ్ చేస్తూ ఏకంగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మీడియా కంటికి చిక్కాడు.

అయితే చహాల్ కొత్త గర్ల్‌ఫ్రెండ్ ఎవరా? అని ఆరా తీస్తే.. యూట్యూబర్‌గా, ఆర్జేగా, కంటెంట్ క్రియేటర్‌గా తన సత్తా చాటుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఈ బ్యూటీ ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ అయిపోయారు. ప్రస్తుతం మీడియాలోను, సోషల్ మీడియాలోను టాప్ ట్రెండింగ్‌గా నిలుస్తున్నారు. అయితే తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను ఆమె మీడియాకు వెల్లడించారు.
నా జీవితంలో కొన్ని మరిచిపోలేని సంఘటనలు చోటు చేసుకొన్నాయి. నాకు ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయింది. అయితే నన్ను నమ్మించి మోసం చేయడంతో తట్టుకోలేకపోయాను. ఒక్కసారి కాకుండా మూడుసార్లు నన్ను చీట్ చేశాడు. అలా చీటింగ్ గురి కావడం నా లైఫ్‌ను భారీగా ప్రభావితం చేసింది. మానసికంగా కుంగిపోయాను అని మహ్ వంశ్ తెలిపింది.
నా కాబోయే భర్త చేసిన మోసానికి నేను పానిక్ ఎటాక్‌కు గురి అయ్యాను. దాంతో హాస్పిటల్‌లో చేరి చికిత్స చేయించకొన్నాను. చాలా కాలం ఆ షాక్ నుంచి బయటపడటానికి నేను వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. పలు మార్లు హాస్పిటల్‌లోనే ఉండాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. దాంతో చాలా కాలం నా సొంత ఊరు ఆలీఘడ్‌లో ఉండాల్సి రావడం నా ప్రొఫెషనల్ లైఫ్‌ను కూడా దెబ్బ తీసింది అని తెలిపింది.

అయితే చహల్‌తో నాకు ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. కేవలం అతడితో నాకు ఉంది స్నేహమే. ఈ విషయంలో ఎవరు ఏమైనా అనుకొన్నా.. నా గురించి అనుమానపడినా.. నాపై నిందలు వేసినా నేను పట్టించుకోను. అనే వాళ్లు అంటూనే ఉంటారు. పట్టించుకొంటే అన్ని సమస్యలే అవుతాయి అని ఆర్జే మహ్‌వంశ్ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఆమెకు చేరువైన చహల్ కూడా తన భాగస్వామి నుంచి వేరుపడి మానసికంగా బలహీనంగా ఉండటం తెలిసిందే.


Click it and Unblock the Notifications











