Elimination: ఈ వారం ఆ ఇద్దరే అవుట్.. ఎలిమినేట్ అయ్యే సెలబ్రిటీలు వారే? లీక్ చేసిన సెలబ్రిటీ
తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్‌గా మొదలైంది. హోస్ట్ నాగార్జున అక్కినేని చేతుల మీదుగా కంటెస్టెంట్ల పరిచయంతో ఇంటిలోకి రకరకాల ట్విస్టులు, టాస్కుల మధ్య కంటెస్టెంట్స్ ఇంటి సభ్యులు అయ్యారు. అయితే ఇంటిలోకి వెళ్లిన తర్వాత తొలి రోజు నుంచి సభ్యుల మధ్య రచ్చ మొదలైంది. రకరకాల భావోద్వేగాలు కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య మూడో రోజే నామినేషన్ల ప్రక్రియను ముగించారు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ల గురించి బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్, ఆర్జే శేఖర్ భాషా లీక్ ఇచ్చారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..
బిగ్ బాస్ తెలుగు 9 ఇంటిలోకి సీరియల్ నటి తనూజ గౌడ, సోల్జర్ కల్యాణ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, మాస్క్ మ్యాన్ హరిత హరీష్, జబర్దస్త్ రీతూ చౌదరీ, టీవీ సీరియల్ యాక్టర్ భరణి శంకర్, కామన్ మ్యాన్ డీమాన్ పవన్, హీరోయిన్ సంజన గల్రానీ, సింగర్ రాము యాదవ్, కామన్ మ్యాన్ శ్రీజ దమ్ము, కమెడియన్ సుమన్ శెట్టి, కామన్ మ్యాన్ ప్రియా శెట్ట, మర్యాద మనీష్ వచ్చారు.

అయితే బిగ్ బాస్ గురించి శేఖర్ భాషా మాట్లాడుతూ.. ఈ సీజన్‌లో ఓడలు బళ్లు.. బండ్లు ఓడు అవుతాయి. కామన్ మ్యాన్స్ ఇంటికి ఓనర్లుగా చేసి వారికి లగ్జరీ హౌస్ ఇచ్చారు. సెలబ్రిటీలను తీసుకెళ్లి అవుట్ హౌస్‌లో పెట్టడం బిగ్‌బాస్ మంచి స్ట్రాటజీని అనుసరించాడు. ఈ వ్యవహారం వల్ల సెలబ్రిటీలకు కామన్ మ్యాన్స్‌పై ఈర్ష్య పెరుగుతుంది. వాళ్ల ఇగో హర్ట్ అయితే గేమ్ రంజుగా మారుతుంది అని ఆయన అన్నారు.
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన పల్లవి ప్రశాంత్‌కు వచ్చిన ఆదరణ చూసిన నిర్వాహకులు ఈసారి భారీగా కామన్ మ్యాన్స్‌ను ప్రవేశపెట్టారు. సాధారణ జనాలకు ఈ షోపై ఆసక్తి పెరిగేలా చేశారు. ఈసారి అనుసరించిన స్ట్రాటజీ పర్‌ఫెక్ట్. కామన్ మ్యాన్స్, సెలబ్రిటీల మధ్య గేమ్ బాగుంటుంది అని శేఖర్ భాషా అన్నారు.
ఈ వారం నామినేట్ అయిన వారిలో ఇద్దరు సెలబ్రిటీలు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముప్పు ఉంది. కామన్ మ్యాన్ కాకుండా సెలబ్రిటీలను ఎలిమినేట్ చేస్తారేమో అనే అనుమానం కలుగుతున్నది. సంజన గల్రానీ ఇంటి నుంచి వచ్చినప్పటి నుంచి ఆమె ధ్యాస అంతా తన ఇద్దరు పిల్లలపైనే ఉంది. ఇక సుమన్ శెట్టి గేమ్‌పై ఫోకస్ లేకుండా ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు ఈ సారి ఎలిమినేట్ అవుతారమో. కామన్ మ్యాన్ పంపించాలనుకొంటే.. ప్రియ శెట్టి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది అని అన్నారు.
గత రెండు రోజులుగా ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదాలు, గొడవల తర్వాత నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఈ వారం నామినేషన్‌లో ఉన్న సెలబ్రిటీలు వీరే.. బిగ్‌బాస్ ఇంటిలో తొలివారం నామినేషన్‌కు గురైన వారిలో తనూజ గౌడ, ఫ్లోరా సైనీ,ఇమ్మాన్యుయేల్, శ్రష్టి వర్మ, రీతూ చౌదరీ, డెమాన్ పవన్, సంజన గల్రానీ, రాము రాథోడ్, సుమన్ శెట్టి ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











