Bigg Boss 8 Telugu : ఆదిత్య నిజస్వరూపం ఇదే.. గుడ్డిగా నమ్మేశా, శేఖర్ భాషా షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ తెలుగు 8లో అందరూ అనుకున్నట్లుగానే ఆర్జే శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యాడు. తొలి వారం బెజవాడ బేబక్క ఇంటిని వీడగా.. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన సెకండ్ కంటెస్టెంట్‌గా శేఖర్ నిలిచాడు. ఇంతకాలం తన పంచ్‌లు, జోక్స్‌తో నవ్వించిన భాషా వెళ్లిపోతుండటంతో ఇంటి సభ్యులు ఎమోషనల్ అయ్యారు. బిగ్‌బాస్‌ను వీడిన తర్వాత శేఖర్ భాషా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఓటింగ్ పరంగా శేఖర్ భాషా ఈ వారం చాలా సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఈ వారం చివరి నుంచి లీస్ట్‌లో ఉన్న ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలి, ఎవరు బయటికెళ్లాలి అన్నది కంటెస్టెంట్సే డిసైడ్ చేస్తారని చెబుతారు నాగార్జున. ఆదిత్య ఓం, శేఖర్ భాషాలను నిలబెట్టి.. హౌస్‌లో ఉండాలని అనుకుంటున్న వ్యక్తి మెడలో పూలదండలు వేయాలని చెప్పారు. మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. సీత మినహా మిగిలిన 10 మంది ఆదిత్య మెడలో దండేశారు. హౌస్‌మెట్స్ నిర్ణయం మేరకు శేఖర్ భాషాను ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు నాగార్జున.

బిగ్‌బాస్ హౌస్‌ను వీడి వచ్చిన వారు తొలి నుంచి ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ అర్జున్ అంబటి ఈ సీజన్‌కు ఇంటర్వ్యూలు చేసే అవకాశం దక్కించుకున్నాడు. తొలి వారం బేబక్కను ఇంటర్వ్యూ చేయగా.. ఈసారి శేఖర్ వంతు వచ్చింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ బజ్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు శేఖర్. మీకు పెళ్లి కాకుండా సింగిల్‌గా ఉండి వుంటే హౌస్‌లో ఎలా ఉండేవారని అడుగుతాడు అర్జున్.. దానికి పనిచేసే చోట పనిచేయకూడదని అంటాడు శేఖర్.
హౌస్‌లో ఉన్న వాళ్ల గురించి ఒక్క ముక్కలో చెప్పాలని అడుగుతాడు అర్జున్. ముందుగా మీ ఎనిమి కానీ ఎనిమి సోనియా అంటే.. సోనియా అంటే నిద్రపోనియా అని ఆన్సర్ ఇస్తాడు శేఖర్. పృథ్వీ గురించి అడగ్గా.. చాలా మందికి కన్నడం రాదు కదా పెళ్లి చేసుకుంటే ఎవరికైనా వచ్చేస్తుంది.. ఎలా అంటే కనడం , పిల్లల్ని కనడం వస్తుందని ఫన్నీగా ఆన్సర్ ఇస్తాడు. హౌస్‌లో ఆదిత్య ఓంను గుడ్డిగా నమ్మారని అర్జున్ ప్రశ్నిస్తాడు.. ఆది ఓ సేఫ్ గేమ్ ఆడాలని అనుకున్నారని, తను నన్ను నామినేట్ చేస్తాడని అనుకోలేదన్నాడు.
హౌస్‌లో నేను విలన్ అవ్వలేదని , హీరోగానే బయటికొచ్చానని చెబుతాడు. మణికంఠ తండ్రి చావు, తల్లి చావులను అడ్డం పెట్టుకుని గేమ్‌లో లాభం పొందాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు శేఖర్. నేను చెప్పిందే నడవాలనే మెంటాలిటి ఉందని , చిన్న దానిని పెద్దది చేసి అవతలి వాళ్ల క్యారెక్టర్‌ని బ్యాడ్ చేయాలని అనుకుంటుందని ఓ షాకింగ్ న్యూస్ చెబుతాడు.. అయితే యష్మిని ఉద్దేశించే శేఖర్ భాషా ఆ మాటలు అన్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా శేఖర్‌కు ఓ సర్‌ప్రైజ్ ఇస్తాడు అర్జున్. అతని కొడుకు ఫోటోని ఫ్రేమ్‌గా చేసి చూపించడంతో శేఖర్ భాషా బాగా ఎమోషనల్ అవుతాడు . నా బిగ్‌బాస్ ట్రోఫీ అంటూ ఆ ఫ్రేమ్‌ని ఎత్తి చూపిస్తాడు. మరి శేఖర్ భాషా పంచుకున్న సంగతులు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











