For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RJ Surya Remuneration: 8 వారాలకే అన్ని లక్షలు.. సూర్య రెమ్యూనరేషన్ చూస్తే షాకే!

  |

  నేషనల్ వైడ్‌గా ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో మాత్రం అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని సరికొత్త హంగులతో చాలా కొత్తగా నడుపుతున్నారు. ఇక, ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ అనిపించుకున్న ఆర్జే సూర్య.. ఎనిమిదో వారంలోనే ఎలిమినేట్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో అతడు ఈ సీజన్ కోసం తీసుకున్న రెమ్యూనరేష్ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి!

  కంటెంట్ మారినా.. రేటింగ్ లేదు

  కంటెంట్ మారినా.. రేటింగ్ లేదు

  బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు వచ్చినా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంటుంది. అందుకే ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆరో సీజన్ కూడా మొదలై మరింత కొత్త కంటెంట్‌తో ఆసక్తికరంగా సాగుతోంది. కానీ, దీనికి ఆశించిన దానికంటే చాలా తక్కువగానే రేటింగ్ వస్తోంది. దీంతో బిగ్ బాస్ టీమ్‌కు షాక్ తగిలినట్లైంది.

  Bigg Boss Telugu 6: బాత్రూంలోనే ఆ కంటెస్టెంట్.. రిక్వెస్ట్ చేసినా వదలకుండా.. షాకిచ్చిన నాగార్జున

  అందరి దృష్టిలోనూ పడ్డ సూర్య

  అందరి దృష్టిలోనూ పడ్డ సూర్య

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంటరయ్యారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో ఎనలేని క్రేజ్‌ను దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే అందరి దృష్టిలో పడ్డారు. వారిలో ఫేమస్ ఆర్జే, మిమిక్రీ ఆర్టిస్టు అయిన సూర్య ఒకడు. ఆరంభంలోనే తనదైన టాలెంట్లతో మెప్పించిన అతడు.. టాప్ 5 కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందాడు.

  మంచి పేరుతో... పెరిగిన సపోర్ట్

  మంచి పేరుతో... పెరిగిన సపోర్ట్

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చినప్పటి నుంచే ఆర్జే తన మార్కు చూపించే ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొనేవాడు. అలాగే, పెద్దగా ఎవరితోనూ గొడవలు పడకుండా కామ్‌గా కనిపించేవాడు. దీంతో ఆర్జే సూర్యకు సౌమ్యుడిగా పేరు వచ్చింది. దీంతో ఆరంభంలోనే అతడికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో మద్దతు లభించింది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శృతి హాసన్: లోపలివి కనిపించేలా ఘోరంగా!

  లవ్ ట్రాకులతో లవర్ బాయ్‌గా

  లవ్ ట్రాకులతో లవర్ బాయ్‌గా

  ఆర్జే సూర్య బిగ్ బాస్ హౌస్‌లో మొదట ఆరోహితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించాడు. ఆమె బయటకు వెళ్లగానే ఈ కుర్రాడు ఇనాయా సుల్తానాతో జత కట్టాడు. ఆమె కూడా అతడికి బాగా కోపరేట్ చేస్తూ రెచ్చిపోయింది. దీంతో ఇద్దరూ వీలైనంత ఎక్కువగా రొమాన్స్‌ను పండించారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ షోలో వీళ్లిద్దరూ జంటగా తెగ సందడి చేసేస్తూ మజా పంచారు.

  8వ వారం ఆర్జే సూర్య బయటకు

  8వ వారం ఆర్జే సూర్య బయటకు

  బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఎక్కువగా షాకింగ్ ఎలిమినేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో స్ట్రాంగ్, పేరున్న కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎనిమిదో వారానికి సంబంధించి కూడా ఊహించని ఎలిమినేషన్ జరిగింది. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఆర్జే సూర్య ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున వెల్లడించాడు.

  బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు

  షాకిస్తోన్న సూర్య రెమ్యూనరేషన్

  షాకిస్తోన్న సూర్య రెమ్యూనరేషన్


  బిగ్ బాస్ హౌస్‌లో 8 వారాల పాటు ఉన్న ఆర్జే సూర్య ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా వచ్చిన అతడికి బాగానే ముట్టజెప్పి ఉంటారని అంతా అనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్ కోసం చలాకీ చంటి ఏకంగా రూ. 15.12 లక్షలు వరకూ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలిసింది.

  8 వారాలకే ఏకంగా అన్ని లక్షలు

  8 వారాలకే ఏకంగా అన్ని లక్షలు

  బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. ఆర్జే సూర్య బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం రోజుకు రూ. 27 వేల చొప్పున వారానికి రూ. 1.89 లక్షలు చార్జ్ చేశాడట. అలా ఎనిమిది వారాల పాటు ఉన్న అతడు రూ. 15.12 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. చాలా మంది కంటెస్టెంట్లతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువే అని పలువురు అంటున్నారు.

  English summary
  Bigg Boss Telugu Telugu 6th Season Running Successfully. RJ Surya Bags Huge Remuneration for This Season.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X