Bigg Boss Telugu: సూర్య ఎలిమినేషన్‌పై డౌట్స్.. అసలు కారణం ఇదే.. సీక్రెట్‌ రూమ్‌‌లోకి పంపుతారా అంటే!

బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో స్పందనను సంపాదించుకుని.. దేశంలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను రాబడుతూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. టెలివిజన్ రంగంలో పెట్టుకున్న సరిహద్దులను చెరిపేసేలాంటి కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోందీ షో. ఫలితంగా సీజన్ల మీద సీజన్లను కూడా పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, ఇందులో 8వ వారం ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో దాని వెనుక అసలు కారణం ఏంటో మీరే చూడండి!

కంటెంట్ మార్చినా కథ మారలే

కంటెంట్ మార్చినా కథ మారలే

ఇండియాలోని చాలా భాషల్లో వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై మాత్రమే బిగ్ బాస్ షోకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. అందుకే నిర్వహకులు క్రమం తప్పకుండా సీజన్లను తీసుకుని వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆరో సీజన్‌ను నడిపిస్తున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను చూపించినా దీనికి ఆశించిన రీతిలో రేటింగ్ మాత్రం దక్కట్లేదు.

సూర్య స్పెషల్... గేమర్ అనేలా

సూర్య స్పెషల్... గేమర్ అనేలా

ఈ షోలో ఎక్కువగా హైలైట్ అయ్యేది కంటెస్టెంట్ల మధ్య ఏర్పడే లవ్ ట్రాకులే అని చెప్పుకోవచ్చు. వాళ్ల మధ్య లవ్ ఉన్న లేకున్నా.. నిర్వహకులు మాత్రం జోడీలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ప్రతి సీజన్‌లోనూ కనీసం ఒక్క జంటనైనా హైలైట్ చేస్తున్నారు. ఇలా ఈ సీజన్‌లో సూర్య ప్లేబాయ్‌లా మారి గుర్తింపు పొందాడు. అలాగే, గేమర్‌గానూ సత్తా చాటుకున్నాడు.

వాళ్లిద్దరితో కలిసి రచ్చ చేశాడు

వాళ్లిద్దరితో కలిసి రచ్చ చేశాడు

బిగ్ బాస్ హౌస్‌లో ఆర్జే సూర్య మొదట ఆరోహితో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించాడు. ఆమె బయటకు వెళ్లగానే ఈ కుర్రాడు ఇనాయా సుల్తానాతో జత కట్టాడు. ఆమె కూడా అతడికి బాగా కోపరేట్ చేస్తూ రెచ్చిపోతోంది. దీంతో ఇద్దరూ వీలైనంత ఎక్కువగా రొమాన్స్‌ను పండిస్తున్నారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ షోలో వీళ్లిద్దరూ జంటగా తెగ సందడి చేసేస్తూ మజా పంచుతున్నారు.

ఈ సారి ఆర్జే సూర్య ఎలిమినేట్

ఈ సారి ఆర్జే సూర్య ఎలిమినేట్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఎక్కువగా షాకింగ్ ఎలిమినేషన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. అందులో స్ట్రాంగ్, పేరున్న కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎనిమిదో వారానికి సంబంధించి కూడా ఊహించని ఎలిమినేషన్ జరిగింది. శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఆర్జే సూర్య ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.

బిగ్ బాస్ షోలో తొలిసారి ఇలా

బిగ్ బాస్ షోలో తొలిసారి ఇలా

సాధారణంగా బిగ్ బాస్ షోలో శని, ఆదివారాల్లో మాత్రమే హోస్ట్ సందడి చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం జరిగే ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ చూపిస్తారు. కానీ, తొలిసారి బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఎనిమిదో వారం శనివారం ఎపిసోడ్‌లోనే సూర్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అంతేకాదు, ఈ సారి ఎవరినీ సేఫ్ కూడా చేయలేదు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు.

ఎలిమినేషన్ రీజన్... డౌట్లతో

ఎలిమినేషన్ రీజన్... డౌట్లతో

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఆర్జే సూర్య ఒకడు. ఆరంభం నుంచీ ఆకట్టుకుంటోన్న అతడు.. ఎలిమినేట్ అవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, అతడు బయటకు వెళ్లిపోవడానికి మాత్రం హౌస్‌లో చేసే రొమాన్సే అని చెప్పొచ్చు. ఆ ట్రాకుల వల్ల అతడి ఆట గతి తప్పింది. దీంతో క్రమంగా గ్రాఫ్ పడిపోతూ ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు.

సీక్రెట్ రూమ్.. క్లారిటీ వచ్చింది

సీక్రెట్ రూమ్.. క్లారిటీ వచ్చింది

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో టాప్ 5లో ఉంటాడనుకున్న ఆర్జే సూర్య ఎలిమినేషన్ తర్వాత.. అతడిని సీక్రెట్ రూమ్‌లోకి పంపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆర్జే సూర్య నిజంగానే ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పటికే అతడు ఇంటికి కూడా చేరుకున్నాడు. కాబట్టి ఆదివారం ఎపిసోడ్‌లో సీక్రెట్ రూమ్, సర్‌ప్రైజ్‌లు వంటివి ఏమీ కనిపించవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X