పబ్లిక్‌గా రోజాతో మిస్‌బిహేవ్... టాప్ సెలబ్రిటీకి ఇచ్చిపడేసిన వైసీపీ ఫైర్‌బ్రాండ్

ఆర్కే రోజా అలియాస్ రోజా సెల్వమణి. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన ఆమె రాజకీయాల్లోనూ సక్సెస్ అయ్యారు. అంతేకాదు.. మేల్ డామినేషన్ ఉండే పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దూకుడు రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచారు రోజా. ఏపీలో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన హవా చూపించిన రోజా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎలాంటి గాడ్ ఫాదర్ లేకపోయినా... తన కృషి, పట్టుదల, ప్రతిభతో చిత్ర పరిశ్రమలో అగ్రనటిగా ఎదిగారు. దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమించిన ఆమె దాదాపు పదేళ్ల పాటు నిరీక్షించి పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడారు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపించారు రోజా. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు మహిళ అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు. 2009లో టీడీపీ అభ్యర్ధిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోజా.. తర్వాతి కాలంలో తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.

RK Roj and Sekhar Master Fun Fight in Zee Telugu Ugadi Special Show Promo Goes Viral

వైఎస్ జగన్ సారథ్యంలో ప్రతిపక్షంలో ఉండగా ప్రజా పోరాటాలు చేసి మరింత రాటు దేలారు. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు రోజా. ఆ తర్వాత 2019 ఏపీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.. ఆ సమయంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమెను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు జగన్. అనంతర కాలంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రోజాకు అవకాశం కల్పించారు. అయితే 2024 ఎన్నికల్లో రోజా ఓటమి పాలవ్వడంతో కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. తిరిగి జనంలోకి వచ్చి ప్రజా సమస్యల పరిష్కారంలో దూసుకెళ్తున్నారు.

రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి దగ్గరగానే ఉంటున్నారు. సినిమాలలో నటించికపోయినా బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటున్నారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మార్చి 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జీ తెలుగు ప్రత్యక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ షోలో రోజా సందడి చేశారు. అయితే అనుకోకుండా ఆమెకు ఓ సెలబ్రిటీతో గొడవ జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు విడుదల చేసింది.

ప్రోమో స్టార్టింగ్‌లో రోజా, శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రీలీల, హీరో నిఖిల్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్‌, కెమెరామెన్ సెంథిల్ కుమార్‌లు సందడి చేశారు. ఈ షోకు యాంకర్ రవి హోస్ట్‌గా వ్యవహరించారు. ఉగాదికి వస్తున్నాం.. సందడి తెస్తున్నామంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో రవి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత బుల్లితెర సెలబ్రిటీల డ్యాన్స్, ఇతర స్కిట్లపై హింట్ ఇచ్చారు. అనంతరం కొత్త అవకాయతో కలిపిన అన్నాన్ని రోజా.. అందరికీ తినిపించారు. ఆపై శేఖర్ మాస్టర్‌తో కలిసి రోజా మాస్ స్టెప్పులతో అలరించారు. అయితే ప్రోమో చివరిలో విషెస్ కోసం శేఖర్ మాస్టర్ - రోజా గొడవ పడతారు. నేను విషెస్ చెబుతానంటే.. నేను చెబుతానంటూ కొట్టుకుంటారు. ఇంతలో రోజాను శేఖర్ మాస్టర్ చేయి పట్టుకుని వెనక్కి లాగడంతో ఆమె సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రోజాకి, శేఖర్ మాస్టర్‌కి పంచాయతీ తీరిందా? వీరిద్దరి గొడవని ఎవరు కూల్ చేశారు? ప్రేక్షకుల కోసం ఎలాంటి సరదాలు సిద్ధం చేశారు? తెలియాలంటే మార్చి 19వ తేదీన ఉదయం 10 గంటలకు ఉగాదికి వస్తున్నాం సందడి తేస్తున్నాం కార్యక్రమం చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: sekhar master sreeleela rk roja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X