నిన్ను చూస్తే అల్లు అర్జున్‌కు పీలింగ్స్ చచ్చిపోతాయ్.. రోజాపై అనసూయ అలాంటి కామెంట్స్

మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజాకు .. జబర్దస్త్ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. జడ్జిగా రోజా.. యాంకర్‌గా అనసూయలు జబర్దస్త్ కార్యక్రమాన్ని బాగా రక్తి కట్టించారు. కొద్దిరోజులు గ్యాప్‌లో వీరిద్దరూ ఈ మెగా షోను విడిచి వెళ్లిపోవడంతో జబర్దస్త్‌లో మనుపటి టచ్ కనిపించడం లేదు. అలాంటిది వీరిద్దరూ తిరిగి ఓ ఛానెల్‌లో ప్రసారమవుతున్న కార్యక్రమంలో తిరిగి కలుసుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

జబర్దస్త్‌కు దూరమైన రోజా
సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలిగిన తర్వాత రాజకీయాల్లో అంతే దూకుడుగా వ్యవహరించి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు ఆర్కే రోజా. ఈ మధ్యలో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఆమె ఇంటింటికి చేరువయ్యారు. ఈ మెగా షోలో నాగబాబుతో కలిసి జడ్జిగా సందడి చేశారు రోజా. తన చిరునవ్వుతో, పంచ్‌లతో నవ్వులు పూయించారు. నాగబాబు మధ్యలో జబర్దస్త్‌ నుంచి తప్పుకున్నప్పటికీ తను మాత్రం కంటిన్యూ అయ్యారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రెండున్నర సంవత్సరాల తర్వాత పాత మంత్రుల స్థానంలో కొత్త మంత్రులను తీసుకున్నారు. ఆ సమయంలో రోజాకు కూడా కేబినెట్‌లో స్థానం కల్పించి మంత్రిని చేశారు జగన్.

RK Roja Fight with Anasuya Bharadwaj at Drama Juniors 8 latest Episode

ఎన్నికల్లో ఘోర ఓటమి
యువజన వ్యవహారాలు, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి రోజా హవా చూపించారు. మంత్రిగా ఉన్నప్పటికీ ప్రత్యర్ధులపై విరుచుకుపడటంలో మాత్రం ఆమె అదే దూకుడు చూపించారు. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో నగరి నుంచి హ్యాట్రిక్ విజయం సాధించాలని రోజా భావించారు. కానీ కూటమి ప్రభంజనంలో ఆమె ఆశలు అడియాసలు అయ్యాయి. దారుణ ఓటమితో పాటు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో చోటు చేసుకున్న అక్రమాల్లో రోజా పేరు వినిపించింది. దీంతో కొన్నాళ్లు రోజా బయట కనిపించలేదు. రాజకీయాల్లో పదవి లేకపోవడంతో పాటు సినీ పరిశ్రమలో ఆమెను పట్టించుకునేవారు లేకపోవడంతో తిరిగి బుల్లితెరపై బిజీ అవుదామని అనుకున్నారు రోజా.

ఆ ఛానెల్‌లో రోజా ఎంట్రీ
జబర్దస్త్‌‌లో పాత రోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమెకు అనుకూల పరిస్ధితులు కనిపించలేదు. దీంతో జీ తెలుగులో రోజా ఎంట్రీ ఇచ్చారు. దీనిలో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ ఈవెంట్‌లో ఆమె అడుగుపెట్టడంతో బుల్లితెర వర్గాలు షాక్ అయ్యాయి. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా, దర్శకుడు అనిల్ రావిపూడి జడ్జిగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో సినీనటి, మాజీ జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా భాగమయ్యారు. రోజా- అనసూయను ఒకే స్టేజ్ మీద చూసి చాలాకాలం కావడం పైగా అనిల్ రావిపూడి జడ్జి కావడంతో డ్రామా జూనియర్స్‌కు బాగానే హైప్ క్రియేట్ అయ్యింది.

నన్ను ఆంటీ అంటాడా
తాజాగా ప్రసారమైన ఎపిసోడ్‌లో అనసూయ- రొజాలు అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో నవ్వించారు. ముఖ్యంగా అత్తా కోడళ్లుగా వయసు గురించి గొడవ పడుతూ అదరగొట్టారు. అనసూయను ఆంటీ అంటే అస్సలు ఇష్టపడరన్న సంగతి తెలిసిందే. దీని చుట్టూనే ఎపిసోడ్ తిప్పారు మేకర్స్. ఓ కుర్రాడు తనను ఆంటీ అనడంతో కట్టేశానని అనసూయ చెబుతుంది. ఈ సమయంలో నేను కోడల్ని, అనసూయ అత్త అని రోజా చెప్పడంతో అంతా నవ్వుకుంటారు. నేను ఒప్పుకోను అని అనసూయ గోల చేస్తుంటే రంగస్థలం సినిమాలో నీ క్యారెక్టర్ ఏంటీ? అని రోజా ప్రశ్నిస్తుంది.

పీలింగ్స్ చచ్చేవి
దానికి రంగమ్మత్త అని అనసూయ ఆన్సర్ ఇస్తుంది. అత్తలా ఉన్నావు కాబట్టే సుకుమార్ గారు రంగమ్మత్త పాత్ర ఇచ్చారని ఆటపట్టిస్తుంది రోజా. అదే సుకుమార్ గారు నన్ను చూసుంటే శ్రీవల్లి క్యారెక్టర్ ఇచ్చేవారని చెబుతుంది రోజా. అప్పుడు అల్లు అర్జున్‌కు పీలింగ్స్ వచ్చేవో లేదో కానీ ఆడియన్స్‌కి మాత్రం నిన్ను చూస్తే పీలింగ్స్ చచ్చేవి అని అనసూయ కౌంటర్ వేసింది. ఎవరికి వయసెక్కువ అనేది ఫోటోలే చెబుతాయని అనసూయ- రోజా అనుకుంటారు. ముందుగా సూర్యకాంతంతో రోజా ఫోటోలు రావడంతో ఆమె షాక్ అవుతుంది.

గాంధీ గారితో అనసూయ
నా ఫోటోలు సరేగానీ.. నీ ఫోటోలు కూడా ఉన్నాయ్ అని చెప్పడంతో మహాత్మాగాంధీతో అనసూయ ఉన్న ఫోటోని చూపించడంతో రంగమ్మత్త షాక్ అవుతుంది. మీరు ఫ్రీడమ్ ఫైటర్ అని నాకు తెలియదంటూ సుడిగాలి సుధీర్ పంచ్ వేయడంతో అనసూయ అతనిని చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత పిల్లలను జనాభా లెక్కల ఆఫీసర్లుగా పంపించి ఇంట్లో వాళ్ల వివరాలు, వయసు వివరాలు కనుక్కోవడం నవ్వు తెప్పించింది. మరి అనసూయ- రోజాల వివాదం ఎలా ముగిసిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

More from Filmibeat

Read more about: rk roja anasuya bharadwaj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X