Jabardasthలోకి రోజా రీ ఎంట్రీ.. ఇక్కడ మానేసి అక్కడ అంటూ కృష్ణ భగవాన్ షాకింగ్ కామెంట్స్!

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి వినోదాన్ని పంచుతూ తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారిపోయింది. ఇక ఈ షోకి జడ్జీలుగా ఇంతకుముందు మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజా వ్యవహరిస్తూ ఉండేవారన్న విషయం తెలిసిందే. ఈ షో నుంచి నాగబాబు, రోజా తప్పుకోవడంతో.. ఇప్పుడు సీనియర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇంద్రజతోపాటు కమెడియన్, నటుడు కృష్ణ భగవాన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటినుంచో జబర్దస్త్ లోకి రోజా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారన్న వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా జబర్దస్త్ షోలో రోజా కనిపించి ఆశ్చర్యపరిచింది.

 ఏపీ రాజకీయాల్లో..

ఏపీ రాజకీయాల్లో..


తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకున్న వారిలో రోజా ఒకరు. అచ్చమైన తెలుగు అమ్మాయిగా ఆమె విభిన్నమైన తరహాలో ఎన్నో పాత్రలు చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె బిజీగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక జబర్దస్త్ షోలో కూడా ఆమె కొన్నాళ్లు జడ్జిగా కొనసాగి తప్పుకున్నారు.

ఫైర్ బ్రాండ్ గా స్పెషల్ ఇమేజ్..

ఫైర్ బ్రాండ్ గా స్పెషల్ ఇమేజ్..

ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న రోజా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నాయకురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అప్పుడప్పుడు ఆమె ప్రత్యర్థి రాజకీయ నాయకులపై కౌంటర్లు ఇచ్చే విధంగా మాట్లాడడం కూడా వైరల్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె ఫైర్ బ్రాండ్ అని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు.

స్పెషల్ ఈవెంట్స్ లలో..

స్పెషల్ ఈవెంట్స్ లలో..

ఇక రోజా, నాగబాబు తో పాటు జబర్దస్త్ చాలా కాలం పాటు జడ్జిగా కొనసాగిన విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే మరొకవైపు ఆమె జబర్దస్త్ షోలో కనిపిస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఈటీవీలో ప్రసారమయ్యే కొన్ని స్పెషల్ షోలలో కూడా ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేవారు. అంతేకాకుండా డాన్స్ మాస్టర్ లతో కలిసి డాన్స్ చేస్తూ కూడా ఎన్నో సందర్భాల్లో ఆకట్టుకున్నారు.

500వ స్పెషల్ ఎపిసోడ్..

500వ స్పెషల్ ఎపిసోడ్..

కొద్ది కాలం క్రితం ఆర్కే రోజా హఠాత్తుగా జబర్దస్త్ షో నుంచి కొన్నాళ్ల క్రితం తప్పుకోవడం అందరికీ షాక్ ను కలిగించింది. అయితే అంతకంటే ముందే నాగబాబు కూడా తప్పుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే జబర్దస్త్ లోకి రోజా రీ ఎంట్రీ ఇస్తుందని అనేక వార్తలు వినిపించిన క్రమంలో తాజాగా కామెడీ షోలో కనిపించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. జబర్దస్థ్ 500వ స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా రోజా ముఖ్య అతిథిగా హాజరైనట్లు తెలుస్తోంది.

మీ ఆవిడను అడగాలి..

మీ ఆవిడను అడగాలి..

ఇక స్కిట్ లో భాగంగా రాకేట్ రాఘవ తనదైన శైలీలో కామెడీని పండించాడు. స్కిట్ లో భాగంగా పక్కన నడుస్తున్న అమ్మాయిని నా సొంతం చేసుకోవాలంటే ఎలాగా అని రాకేట్ రాఘవ సిగ్గు పడుతూ అంటాడు. పక్కనున్న కమెడియన్ చెప్పేలోపే.. మీ ఆవిడను అడగాలి అని రోజా కూడా అంటుంది. ఇంతకుముందు కూడా స్టేజిపై కమెడియన్ల పంచ్ లు వేసేకంటే ముందే రోజా కౌంటర్లు వేసేది.

ఇక్కడ మానేసి అక్కడ..

ఇక్కడ మానేసి అక్కడ..

ఇప్పుడు ఆమె మళ్లీ వచ్చాక కూడా అది జరిగింది. ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ.. రోజా మేడమ్ మీ అందరి మీద కౌంటర్లు వేయడం.. అదే ఈ కౌంటర్లు ఇక్కడ మానేసి అక్కడ (రాజకీయాల్లో) వేస్తున్నారనుకోండి అని కృష్ణభగవాన్ షాకింగ్ గా అన్నారు. దీంతో రోజాతోపాటు మిగతా కమెడియన్స్ అంతా నవ్వేశారు. తర్వాత స్కిట్ లో భాగంగానే రోజాను తాగుబోతు రమేష్ అమ్మమ్మ అని పిలిచి కౌంటర్ వేశాడు. ఇక షో చివరిలో రోజాకు, రాకెట్ రాఘవకు సన్మానం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X