నటికి బిగ్‌బాస్ కంటెస్టెంట్ లవ్ ప్రపోజ్.. షాకింగ్ కండీషన్‌తో గర్ల్ ఫ్రెండ్ ట్విస్ట్

వైసీపీ ఫైర్ బ్రాండ్, నటి రోజా తిరిగి బుల్లితెరపై అడుపెట్టిన సంగతి తెలిసిందే. జీ తెలుగులో ప్రసారమవుతున్న ఫ్యామిలీ అసెంబ్లీ షోకు ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. బుల్లితెర సెలబ్రిటీలతో రోజా ఆడించే ఆటలు, పాటలు వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతివారం సరికొత్త థీమ్‌తో వస్తోన్న ఫ్యామిలీ అసెంబ్లీ షో.. ఈ వీక్ కూడా సరికొత్తగా రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు తాజాగా విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఈ వారం అత్తలు vs కోడళ్లు కాన్సెప్ట్‌తో కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రోమో స్టార్టింగ్‌లోనే బుల్లితెర అత్తాకోడళ్లు అందంగా ముస్తాబై ఎంట్రీ ఇచ్చారు. వీళ్ల ఎనర్జీ చూస్తుంటే వీళ్లే కోడళ్లలా ఉన్నారని రోజా కాంప్లిమెంట్ ఇచ్చింది. కిందపడి కొట్టుకుంటే ఫిట్స్.. అత్తలే ఇక్కడ గట్స్ అని భావన పంచ్ డైలాగ్ విసిరింది. ఇప్పటి వరకు మీరు తలదించుకునే కోడళ్లని మాత్రమే చూశారు.. బట్ మేమంతా తోడ కొట్టే కోడళ్లమని సౌందర్య రెడ్డి పంచ్ విసిరింది. అయితే మేం కూడా తగ్గేదే లేదని నట కుమారి పుష్ప రేంజ్‌లో సవాల్ విసిరింది.

RK Roja s Family Assembly Latest Promo Goes Viral with Hilarious Atta vs Kodallu Fun

ఆ వెంటనే ఇద్దరు చిన్నారులు అత్తా కోడళ్లుగా వచ్చి సందడి చేశారు. ఈ రోజు అత్తలే గొప్ప అనే విషయం నీకు గుర్తుండిపోయేలా చేస్తానని ఒక చిన్నారి అనగా.. ముసలోళ్లు కదా మీరు మరిచిపోకుండా ఉండండి చాలని కోడలిగా ఉన్న చిన్నారి పంచ్ విసిరింది. సముద్రంలో మొసళ్లకే భయపడం.. ఈ ముసలోళ్లకి ఎందుకు భయపడతామా? అంతంత మాత్రంగా ఉన్న అత్తలకే అంతుంటే అప్సరసల్లా ఉండే మాకు ఎంతుండాలి అంటూ సెటైర్లు వేయడంతో అంతా నవ్వేశారు.

ఇక సౌందర్య రెడ్డితో టేస్టీ తేజ చేసిన కామెడీ నవ్వించింది. సౌందర్యా.. లైఫ్ లాంగ్ నీ చేతిని మాత్రం వదలను, నీ చిటికెన వేలు ఇవ్వవా అంటూ ప్రపోజ్ చేశాడు తేజ. దానికి సౌందర్య రెడ్డి చిన్న కండీషన్ పెడుతుంది. ముందు నీ కాలి చిటికెన వేలిని పట్టుకో.. ఆ తర్వాత నీ చిటికెన వేలిని నేను పట్టుకుంటానని అంటుంది. దాంతో కిందకి వంగిన టేస్టీ తేజకు నడుము పట్టేసింది. ఆ వెంటనే నటి లాస్య దగ్గరికి వెళ్లి నువ్వంటే నాకిష్టం.. పెళ్లి చేసుకుందామా అని తేజ అడగ్గా ఆమెకు వాంతు వచ్చేస్తుంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కక్కొచ్చేసింది ఇక కళ్యాణమేనని తేజ వేసిన డైలాగ్‌తో నవ్వుకుంటారు.

ఆ తర్వాత అత్తలు, కోడళ్లు కలిసి టేస్టీ తేజ వీపుని విమానం మోత మోగించారు. ముందుగా నట కుమారి వచ్చి తన చేతికి ఉన్న ఉంగరాలను తీసేసి మరి దరువు వేయడంతో తేజ అల్లాడిపోయాడు. తర్వాత నేను అత్తలందరినీ తలచుకుని కొడతానని సునయన లాగిపెట్టి పీకుతుంది. ఈ దెబ్బకు తేజకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ వెంటనే సౌందర్య రెడ్డి వచ్చి నొప్పి లేకుండా కొడతానని వీపుని వాయించేస్తుంది. నెక్ట్స్ అత్తలకి, కోడళ్లకి రోజా ఓ టాస్క్ ఇస్తుంది.

మేం బరిలో దిగితే ఆట కాదు ఆడేది.. వేట అంటూ సునయన పవర్‌ఫుల్ డైలాగ్ చెబుతుంది. మాది విశాఖపట్నం ఇస్తారా కట్నం అంటూ నటకుమారి శివంగిలా దూసుకెళ్లింది. అయితే కోడళ్లంతా కలిసి నటకుమారి జుట్టు పట్టుకోవడంతో ఓడిపోయాను వదిలేయమని బతిమలాడుతుంది. ఎందుకు అలా ఓడిపోయావని రోజా అడగ్గా.. విగ్గు మేడం ఊడిపోతుందని అసలు విషయం చెప్పడంతో అంతా కడుపుబ్బా నవ్వుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మరి అత్తలు - కోడళ్లలో ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ శని, ఆదివారాలలో ప్రసారమయ్యే ఫ్యామిలీ అసెంబ్లీ కార్యక్రమం చూసేయాల్సిందే.

Read more about: rk roja tasty teja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X