రణరంగంలా రోజా ఫ్యామిలీ షో... మాజీ మంత్రి ముందే ఆ నటిని అలా ఈడ్చుకొచ్చి..
Photo Courtesy: Zee Cinemalu
మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా సినిమాలు, రాజకీయాలలో తన హవా చాటుకున్నారు. అలాగే బుల్లితెరపైనా తనకు తిరుగులేదని చాటి చెప్పారు. ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షోకు కొన్నేళ్లపాటు నాగబాబుతో కలిసి జడ్జిగా వ్యవహరించారు రోజా. తన పంచ్‌లతో పాటు గ్లామర్‌తో ఈ మెగా షో ప్లస్‌గా మారడంతో పాటు జబర్దస్త్ టాప్ షోలో నిలబడటానికి తన వంతు పాత్ర పోషించారు. అయితే తర్వాతి కాలంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రిగా రోజాకు అవకాశం దక్కింద. దీంతో అనివార్య పరిస్థితుల్లో జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు.
మంత్రిగా తన వాహ సాగించిన రోజాకు 2024 ఎన్నికలు షాకిచ్చాయి. నగరి నుంచి హ్యాట్రిక్ కొట్టాలన్న ఆమె ఆశలు గల్లంతయ్యాయి. ఆ ఎన్నికల్లో తను ఓడిపోవడంతో పాటు వైసీపీ కూడా దారుణ పరాజయాన్ని మూటకట్టుకోవడంతో రోజా కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. సినిమాల్లో అవకాశాల కోసం గట్టిగానే ట్రై చేశారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో తన పరిచయాలను వాడినప్పటికీ ఆమెకు ఫలితం కనిపించలేదు. తనను ఆదరించిన బుల్లితెరపైనా ట్రై చేసినా అక్కడా నిరాశే ఎదురైంది. ఈ దశలో జీ తెలుగులో కొన్ని షోలలో అప్పుడప్పుడు మెరిశారు.

Photo Courtesy: Zee Cinemalu
ఈ క్రమంలో జీ తెలుగు ఛానెల్.. ఇటీవల ది ఫ్యామిలీ అసెంబ్లీ షోను లాంచ్ చేసింది. ఈ ఏప్రిల్ 19న ఈ షో అధికారికంగా ప్రారంభమైంది. ప్రతి శనివారం, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతోంది. సినిమా, బుల్లితెరకు చెందిన సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. రోజా తనదైన శైలిలో అలవోకగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతివారం సరికొత్త థీమ్‌తో ఫ్యామిలీ అసెంబ్లీ షో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ వారం అత్తా కోడళ్ల కాన్సెప్ట్‌తో కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఈ వారం ఎపిసోడ్‌కు సంబంధించి పలు ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రోమోను పరిశీలిస్తే..
బుల్లితెర అత్తా కోడళ్లు స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చి మాస్ డైలాగులతో ఆకట్టుకోవడంతో పాటు తాడోపేడో తేల్చుకుంటామని తొడగొట్టి మరి సవాల్ చేశారు. చిన్నారులు అత్తా కోడళ్ల గెటప్‌లో వచ్చి చేసిన అల్లరి అందరినీ కడుపుబ్బా నవ్వించింది. మరోవైపు.. బుల్లితెర నటి సౌందర్య రెడ్డితో టేస్టీ తేజ పులిహోర కార్యక్రమం మొదలుపెట్టాడు. జీవితంలో నీ చేయి వదిలిపెట్టనంటూ ఆమెకు ప్రపోజ్ చేశాడు. నా చిటికెన వేలు నీకు ఇవ్వాలంటే ఓ కండీషన్ అని చెప్పిన సౌందర్య రెడ్డి.. అతనిని కాలివేలు తాకాలని చెప్పింది. దానిని ఓకే చెప్పిన టేస్టీ తేజ వొంగగానే నడుం పట్టేయడంతో అంతా నవ్వేశారు.
తర్వాత అత్తలు, కోడళ్లు ఒకరి తర్వాత ఒకరొచ్చి తేజ వీపుని మోతమోగించారు. నటకుమారి, సునయన, సౌందర్య రెడ్డి దెబ్బలకి వాచిపోయింది. ఆ వెంటనే అత్తా కోడళ్లకి కబడ్డీ పోటీ పెట్టారు రోజా. దాంతో ఎవరూ తగ్గేదే లేదంటూ తలపడ్డారు. ఈ క్రమంలో కూతకి వెళ్లిన నటకుమారి.. మాది విశాఖపట్నం ఇస్తారా కట్నం అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఆడుకుంది. కోడళ్లను ఔట్ చేసే క్రమంలో వారంతా నటకుమారిని రౌండప్ చేసి జుట్టు పట్టుకుని పక్కకి తీసుకొచ్చారు. నేను ఔట్.. ఔట్.. జుట్టు అంటూ ఏడ్చేసింది నటకుమారి. ఎందుకు అలా ఓడిపోయావని రోజా అడగ్గా.. అది విగ్గు మేడం ఊడిపోతుందని అలా చేశానని నటకుమారి చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు. మరి ఈ వారం ఫ్యామిలీ అసెంబ్లీలో అత్తలు కోడళ్లలో ఎవరు గెలిచారో తెలియాలంటే శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్‌ని చూసేయాల్సిందే.


Click it and Unblock the Notifications


