‘బిగ్ బాస్’ హౌస్‌లో దొంగలు.. కెప్టెన్ కావాలంటే ఇదే మార్గం.!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ప్రేక్షకాదరణను భారీ స్థాయిలో పొందుతోంది. దీనికి కారణం ఇంట్లో జరుగుతున్న సంఘటనలే.
ఎలిమినేషన్ కోసం నామినేట్ చేసే విధానం.. మధ్య మధ్యలో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు.. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్టులు.. ఏడుపులు.. రొమాన్స్.. అమ్మాయిల గ్లామర్ తదితర కారణాలతో ఈ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ షో కొత్త కొత్త షేడ్స్‌లో వెళుతోంది. దీంతో 'బిగ్ బాస్'పై అంచనాలు పెరిగిపోయాయి.

సోమవారం ఎపిసోడ్ రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. దీనికి కారణం ఎలిమినేషన్ ప్రక్రియే. ఒక్కొక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పిన బిగ్ బాస్.. తమకు ఇష్టం లేని ఇద్దరి కంటెస్టెంట్స్ పేరు చెప్పి వాళ్లకు నామినేషన్ స్టాంప్ గుద్దాలని స్టాంప్ ఇచ్చారు.
ఈ ప్రక్రియలో ఎక్కువ ఓట్లు వచ్చి తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఈవారం ఎలిమినేషన్‌లో నిలిచారు. అదే సమయంలో తమన్నా, పునర్నవి చేసిన హడావిడికి హౌస్‌మేట్స్‌తో సహా బిగ్ బాస్ కూడా షాక్‌కు గురయ్యాడు. ఈ ప్రక్రియ పూర్తవడంతో మిగిలిన దానిపై దృష్టి పెడుతున్నారు నిర్వహకులు.
ఇక, మంగళవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ కెప్టెన్సీ టాస్క్ కోసం దొంగా పోలీస్ ఆట ఆడాలని చెప్పాడు. ఇందులో భాగంగా హౌస్‌లోకి కొందరు కంటెస్టెంట్లు దొంగలుగా, మరికొందరు పోలీసులుగా.. మిగిలిన వారు ఇంటి సభ్యులుగానే ఉండాలని సూచించాడు. ఇందులో శ్రీముఖి, రవికృష్ణ, అషురెడ్డి దొంగలుగా కనిపిస్తున్నారు. అలాగే, బాబా భాస్కర్ పోలీసు గెటప్‌లో ఉన్నారు. మిగిలిన వారు ఇంటి సభ్యులుగానే కొనసాగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











