నలుగురితో జబర్ధస్త్ కమెడియన్ ఎఫైర్.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రాకెట్ రాఘవ లీక్స్
తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్నింటికే ప్రేక్షకులు జై కొట్టి సక్సెస్ చేస్తున్నారు. అలాంటి వాటిలో జబర్ధస్త్ షో ఒకటి. కామెడీ ప్రధానంగా సాగే ఈ కార్యక్రమం సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో ప్రభావాన్ని చూపిస్తోంది. దీనివల్ల చాలా మంది కుర్రాళ్లు యమా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో బుల్లెట్ భాస్కర్ ఒకడు. చాలా కాలంగా తనదైన హాస్యంతో మెప్పిస్తోన్న అతడు.. వరుస ఆఫర్లతో దూసుకుళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బుల్లెట్ భాస్కర్‌పై రాకెట్ రాఘవ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీరే చూడండి!
జబర్ధస్త్ యమ సక్సెస్
ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో షోలు వస్తున్నా 'జబర్ధస్త్' మాత్రమే భారీ రెస్పాన్స్‌ను అందుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో నిర్వహకులు ఎప్పటికప్పుడు మరింత కొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నారు. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్, రాకెట్ రాఘవ, ఇమాన్యూయేల్, నూకరాజు వంటి వాళ్లు బాగా హైలైట్ అవుతున్నారు.

కొత్త కాన్సెప్టుతోనే షో
జబర్ధస్త్ మొదలైన కొత్తలో గురువారం మాత్రమే ప్రసారం అయ్యేది. తర్వాత 'ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' పేరుతో దీన్ని శుక్రవారం కూడా ప్రసారం చేసేవారు. ఇలా చాలా కాలం పాటు ఈ రెండు ఎపిసోడ్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఇందులో మార్పులు చేసి 'జబర్ధస్త్' షోను శుక్రవారం, శనివారం ప్రసారం చేస్తున్నారు. అంతేకాదు, గతంలో కంటే కొత్త కాన్సెప్టుతో తీసుకు వచ్చారు.
బుల్లెట్‌లతో భాస్కర్
'జబర్ధస్త్' షోలో ప్రస్తుతం ఉన్న బెస్ట్ కమెడియన్లలో బుల్లెట్ భాస్కర్ ఒకడు అన్న విషయం అందరికీ తెలిసిందే. జనాలను నవ్వించడం కోసం ఎంతో శ్రమించే అతడు.. ఎప్పటికప్పుడు ఫన్‌ను పంచేలా స్కిట్లు రూపొందించుకుంటున్నాడు. ముఖ్యంగా ఫైమాతో కలిసి తనదైన రీతిలో సందడి చేస్తున్నాడు. దీంతో బుల్లెట్ భాస్కర్ స్కిట్లకు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది.

రాకెట్ రాఘవతో ఢీ
గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు జబర్ధస్త్ షోలో శుక్రవారం ఒక టీమ్, శనివారం ఒక టీమ్‌లా ఏర్పడి స్కిట్లు చేస్తున్నారు. ఇందులో ముందుగా టీమ్ లీడర్లు కొంత డబ్బును బెట్టింగ్‌లా పెట్టుకుని స్కిట్లు చేస్తున్నారు. అందులో గెలిచిన టీమ్ ఆ ధనాన్ని సొంతం చేసుకుంటోంది. ఇందులో తరచూ బుల్లెట్ భాస్కర్‌తో రాకెట్ రాఘవ గొడవ పడుతూ కామెడీని పంచుతున్నాడు.
కొంపల్లో దూరడం
ఎప్పటి నుంచో బుల్లెట్ భాస్కర్‌కు ఎఫైర్లు ఉన్నాయని చాలా మంది కమెడియన్లు పంచులు వేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జబర్ధస్త్ షోలో రాకెట్ రాఘవ అతడితో గొడవ పడుతూ 'ఆయన నాలుగు కొంపల్లో దూరతాడు కానీ కంటెంట్‌లో దూరడు' అని పరువు తీసేశాడు. దీంతో బుల్లెట్ భాస్కర్ 'నీకెందుకయ్యా అవన్నీ. పోనీలే అని వయసులో పెద్దోడివి అని రెస్పెక్ట్ ఇస్తుంటే. నాకు వారం వారం డబ్బు పోయినా బాధ లేదు. నీవల్ల అందరి ముందు పరువు పోతుంది' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











