Rakesh Sujatha: యాంకర్‌తో కమెడియన్ పెళ్లి.. అలా సాగిన ప్రేమ, పెళ్లి వరకు ప్రయాణం!

కంటెంట్ కోసం జంటగా మారి రియల్ లైఫ్ భార్యాభర్తలుగా మారారు రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేష్. తెలంగాణ యాస మాట్లాడుతూ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకుంది జోర్దార్ సుజాత. వీరిద్దరి ప్రేమకు వేదికగా మారింది జబర్దస్త్ షో. అయితే జబర్దస్త్ షోలో వచ్చే పెయిర్స్, రొమాన్స్ అంతా స్క్రీన్ వరకే, టీఆర్పీ కోసమే అన్నట్లుగా మొన్నటివరకు ఉండేది. రాకేష్, సుజాత జంట కూడా అలాంటిదే అని అంతా భావించారు. కానీ ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన వీరిద్దరు తాజాగా పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

 బహిరంగంగా ప్రకటించడంతో..

బహిరంగంగా ప్రకటించడంతో..

సినిమాల్లో హీరో హీరోయిన్లు ఆన్ స్క్రీన్ రొమాన్స్, లవ్ ట్రాక్ లు సర్వసాధారణమే. ఇటీవల కాలంలో బుల్లితెరపై కూడా ఇలాంటి లవ్ ట్రాక్ లు ఎక్కువయ్యాయి. అందులో కొన్ని సూపర్ పాపులర్ కావడంతో వరుసగా అలాంటి జోడీలను దించుతూ షోలు నిర్వహిస్తున్నారు. రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత జంట కూడా అలాంటిదే అని అంతా అనుకున్నారు. కానీ ఒక షోలో వాళ్ల ప్రేమను బహిరంగంగా ప్రకటించడమే కాకుండా ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

సెలబ్రిటీలు, కమెడియన్లు..

సెలబ్రిటీలు, కమెడియన్లు..

రాకేష్-సుజాత ఎంగేజ్ మెంట్ కు బుల్లితెర నటీనటులు హాజరై సందడి చేశారు. ఇక తాజాగా వీళ్లిద్దరు పెళ్లి పీటలు ఎక్కి వివాహ బంధంతో భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత ఫిబ్రవరి 24 అంటే శుక్రవారం రోజున తిరుపతిలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడు అడుగులు వేశారు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు, పలువురు సినీ సెలబ్రిటీలు, కమెడియిన్లు హాజరైనట్లు తెలుస్తోంది.

టీమ్ లీడర్లుగా..

టీమ్ లీడర్లుగా..

ప్రస్తుతం రాకేష్-సుజాత పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు, ప్రేక్షకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే రాకేష్ ఫ్యామిలీ సుమారు 20 ఏళ్ల క్రిత హైదరాబాద్ కు వచ్చేసింది. ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన రాకేష్.. చాలా పోగ్రామ్స్, ఈవెంట్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత జబర్దస్త్ లో అవకాశం రాగా ధన్ రాజ్ టీమ్ లో ఒకడిగా చేశాడు. అనంతరం కిరాక్ ఆర్పీ టీమ్ లో చేరాడు. వీళ్లిద్దరు కలిసి టీమ్ లీడర్లుగా చేశారు.

 మనుషులను నమ్మేందుకు..

మనుషులను నమ్మేందుకు..

జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో.. రాకేష్ ఒక్కడే టీమ్ లీడ్ చేస్తూ వచ్చాడు. దీంతో రాకింగ్ రాకేష్ గా మారిపోయాడు. మొదట్లో చిన్న పిల్లలతో ఎక్కువగా స్కిట్స్ చేస్తూ వచ్చాడు రాకేష్. అవి బాగా పాపులర్ కావడంతో రాకేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే తాను మనుషులను నమ్మేందుకు, మాట్లాడేందుకు చాలా భయపడిపోతానని, అందుకే చిన్న పిల్లలతో స్కిట్స్ చేసేవాన్నని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాకింగ్ రాకేష్.

పరిచయం కాస్తా ప్రేమగా..

అనంతరం అందరిలానే స్కిట్స్ చేస్తూ వచ్చాడు రాకేష్. మరోవైపు న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది జోర్దార్ సుజాత. తర్వాత బిగ్ బాస్ నాలుగో సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చి మరికొంత ఫేమ్ సంపాదించుకుంది. అంతకుముందే రాకేష్ తో ఉన్న పరిచయం కారణంగా జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాకేష్ స్కిట్స్ లలో చేసింది సుజాత. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి పీటల వరకు వచ్చింది. స్నేహంగా మొదలైన రాకేష్, సుజాత ప్రయాణం పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలు, ఏడు అడుగులతో భార్యాభర్తలుగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X