నీ కోసం వెయిటింగ్.. ఎప్పుడొస్తావ్? అనసూయకు రాకింగ్ రాకేష్ లవ్లీ రిక్వెస్ట్
అనసూయ అంటే తెలుగు వారికి తెలియకుండా ఉండడు. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా, వెండితెరపై అద్భుతమైన నటిగా అనసూయ ఎంతో పాపులర్. ఆమెకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా కూడా నెట్టింట్లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంది. ఆమె కనిపించినా, వినిపించినా, మాట్లాడినా కూడా ఓ సెన్సేషన్ అవుతుంది. అలాంటి అనసూయ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేసింది. బుల్లితెరకు కాస్త దూరంగా ఉండేందుకు అనసూయ ట్రై చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో అనసూయతో రాకింగ్ రాకేష్ చేసిన కామెంట్లలోకి వెళితే..

బుల్లితెరపై అలా..
కెరీర్ ప్రారంభంలో న్యూస్ యాంకర్‌గా ఉన్న అనసూయ.. క్రమక్రమంగా జబర్దస్త్ షోతో అందరినీ ఆకట్టుకుంటూ టాప్ యాంకర్‌గా మారిపోయింది. జబర్దస్త్ ప్రారంభ రోజుల్లో అంతా కూడా అనసూయ అందానికి ఫిదా అవుతుండేవారు. ఆమె కోసమే అన్నట్టుగా ఆ షోను చూసేవారు. అలా కొద్ది వారాల్లోనే అనసూయ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

సినీ కెరీర్..
అనసూయ సినీ కెరీర్‌ను క్షణం అనే సినిమా మలుపు తిప్పేసింది. అందులో ఆమె కనిపించిన, నటించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తరువాత ఆమె రేంజ్‌ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేసింది రంగస్థలంలోని రంగమ్మత్త పాత్ర. ఆమె తప్పా ఇంకో నటి అంత అద్భుతంగా ఆ పాత్రను పోషించలేరన్నట్టుగా అనసూయ నటించేసింది. గొప్ప నటిగా అందరి చేత ప్రశంసలు అందుకుంది.

సినీ అవకాశాలు..
అనసూయకు ఇప్పుడు సినీ అవకాశాలు పెరిగాయి. స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్, లీడ్ కారెక్టర్స్, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ చేయడంలో అనసూయ ముందుంటోంది. అనసూయ కనిపిస్తే చాలు అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి మారిపోయింది. అనసూయ కోసం దర్శక నిర్మాతలు కూడా ఎంతగానే ఎదురుచూస్తుంటారు.

ఎదురుదెబ్బలు..
అనసూయకు ఈ మధ్య కాస్త ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆమె నటించిన దర్జా సినిమా అంతగా ఆడలేదు. ఆమె స్పెషల్ సాంగ్స్ చేసిన సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోతోన్నాయి. చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ చేసిన స్పెషల్ సాంగ్ వృథా అయింది. పుష్ప పార్ట్ 2లోనూ అనసూయకు అంత పేరు తీసుకురాలేకపోయింది. పైగా ట్రోలింగ్స్ ఎదురయ్యాయి. మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చినా కూడా అంతగా పేరు రాలేదు.
జబర్దస్త్ షోకు దూరం..
ఇక ఇప్పుడు అనసూయ తన ఫోకస్ మొత్తం కూడా సినిమాల మీదే పెట్టేసింది. అందుకే జబర్దస్త్ షోకు దూరంగా వెళ్లింది. అయితే తాజాగా శ్రావణ సందడి అనే ఈవెంట్‌లో అనసూయ కనిపించింది. అందులో రాకింగ్ రాకేష్ స్టేజ్ మీదే అనసూయను ఇలా అడిగేశాడు. అక్కా నువ్ ఎప్పుడొస్తావ్.. నీ కోసం నాలుగు పంచ్‌లు అలానే వెయిట్ చేస్తున్నాయ్.. అంటూ అడిగేశాడు రాకేష్. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చిరునవ్వులు చిందించింది అనసూయ.


Click it and Unblock the Notifications











