సుజాతో నా పెళ్లికి కారణం ఆ డైరెక్టర్ చేసిన మోసమే.. అసలు నిజం చెప్పేసిన రాకింగ్ రాకేష్!

బుల్లితెరపై ఒక షో కానీ పోగ్రామ్ కానీ హిట్ కొట్టాలంటే ఎక్కవగా ఉపయోగించే ట్రిక్.. లవ్ ట్రాక్. స్టేజీలపై వాళ్లిచ్చే పర్ఫామెన్స్ చూస్తే నిజంగా వాళ్లు లవ్ లో ఉన్నారనే చాలామంది అనుకుంటారు. కానీ అలా జరగదు. అయితే షోలలో లవర్స్ గా యాక్ట్ చేసిన వారిలో అతికొద్ది మంది మాత్రం నిజ జీవితంలో కూడా ప్రేమికులుగా మారతారు. అలాంటి జోడీల్లో రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ఒకటి. ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న వీరిద్దరూ తర్వలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

అయితే వీళ్లిద్దరికి ప్రేమ పునాది షోలో పడింది అనుకున్నారంత. కానీ ఒక డైరెక్టర్ చేసిన మోసం కారణంగానే తాను సుజాతను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందంటూ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు రాకింగ్ రాకేష్.

నిజం అనుకునే ప్రేక్షకులకు..1

నిజం అనుకునే ప్రేక్షకులకు..1

సినిమాల్లో హీరో హీరోయిన్లు ఆన్ స్క్రీన్ రొమాన్స్, లవ్ ట్రాక్ లు సర్వసాధారణమే. ఇటీవల కాలంలో బుల్లితెరపై కూడా ఇలాంటి లవ్ ట్రాక్ లు ఎక్కువయ్యాయి. అందులో కొన్ని సూపర్ పాపులర్ కావడంతో వరుసగా అలాంటి జోడీలను దించుతూ షోలు నిర్వహిస్తున్నారు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మొదట్లో ఇదంతా నిజం అనుకునే ప్రేక్షకులకు షో కోసమే అని తెలిసింది. అయితే రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత జంట మాత్రం రియల్ పెయిర్ గా మారి షాక్ ఇచ్చారు.

తనను పెళ్లి చేసుకునేందుకు..

తనను పెళ్లి చేసుకునేందుకు..

అయితే రాకింగ్ రాకేష్-సుజాత లవ్ ట్రాక్ ఫేక్, షో కోసం స్టంట్స్ అని విభిన్నరకాల కామెంట్స్ వస్తున్న సమయంలోనే వాళ్ల ప్రేమని బహిరంగంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. అంతేకాకుండా అటు రాకింగ్ రాకేష్ ఇంట్లో వాళ్లు, ఇటు జోర్దార్ సుజాత పెద్దవాళ్లు వారి వివాహానికి ఒప్పుకున్నారు. ఇటీవలే ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బుల్లితెర నటీనటులు అందరూ హాజరయ్యారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాకింగ్ రాకేష్ తెలిపాడు. ఈ క్రమంలోనే సుజాతను తాను పెళ్లి చేసుకోబోయేందుకు కారణం కూడా చెప్పుకొచ్చాడు రాకేష్.

నాగబాబు గారు కూడా..

నాగబాబు గారు కూడా..

రాకింగ్ రాకేష్ ఎంగేజ్ మెంట్ తర్వాత అదిరే అభి రాసిన పోస్ట్ గురించి మాట్లాడాడు రాకేష్. తన మనసుకు అనిపించింది రాశాడు, చాలా చక్కగా రాశాడు అని రాకింగ్ రాకేష్ అంటే.. అది పెద్ద కాంట్రవర్సీ అయిందట కదా అని యాంకర్ అన్నాడు. అవునా.. నాకు అదేం తెలీదు అని రాకేష్ చెప్పాడు. ఎంగేజ్ మెంట్ కు నాగబాబు గారు అందరూ వచ్చారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అందరూ వచ్చారని బదులిచ్చాడు రాకేష్.

ఆమె వర్కింగ్ స్టైల్ నచ్చేది..

ఆమె వర్కింగ్ స్టైల్ నచ్చేది..

మొత్తానికి పెళ్లి అయిపోతుంది.. ఇదంతా ఎలా జరిగింది అని యాంకర్ అడగ్గా.. "ఫస్ట్ మా డైరెక్టర్ శ్రీపాద గారికి దండం పెట్టాలి. మోసం చేశాడు బాగా. మోసమే చేశాడు. ఫస్ట్ నేను సుజాత మంచి ఫ్రెండ్స్. ఆమె వర్కింగ్ స్టైల్ నాకు నచ్చేది. ఆమె చాలా కష్టపడి వచ్చింది. ఆ అమ్మాయి హెచ్ఎమ్ టీవీలో చేస్తూ బిగ్ బాస్ చేసుకుని వచ్చి.. మా టీవీలో మళ్లీ కామెడీ షో ఒకటి చేసింది. ఆమె నా ఫ్రెండ్ కావడం వల్ల.. అన్నయ్య నీ ఫ్రెండ్ అంటున్నావ్. ఇద్దరు మంచిగా ఉంటారు. తీసుకొచ్చి పెట్టేయ్" అని అన్నారు అని రాకింగ్ రాకేష్ చెప్పాడు.

మా ఇద్దరి మధ్య అలా..

మా ఇద్దరి మధ్య అలా..

"ఏమైనా అనుకుంటారేమో అన్న అని నేను అంటే.. వర్క్ కోసం. ఏం కాదు అన్నారు. ఓకే డైరెక్టర్ గారూ మీకు నచ్చితే ఓసారి ఆడిషన్స్ చూడండి అని అంటే.. ఆడిషన్స్ ఎందుకు.. అక్కడ బ్రహ్మాండంగా చేస్తుంది తీసుకొచ్చి పెట్టేయ్ అన్నారు. ఫ్రెండ్ కాస్తా వర్క్ పార్టనర్ అయింది. ఇక వైఫ్ అండ్ హస్బండ్ క్యారెక్టర్స్ అన్నాకా మాట్లాడుకుంటాం కదా.. అప్పుడు మా డైరెక్టర్ మా ఇద్దరి మధ్య లవ్ సింబల్స్ వేశాడు. అది కాస్తా వర్కౌట్ అయ్యేసరికి అదే కాన్సెప్ట్ పట్టుకుని ముందుకు వెళ్లాం" అని రాకేష్ తెలిపాడు.

వర్కింగ్ పార్టనర్ కాస్తా..

వర్కింగ్ పార్టనర్ కాస్తా..

"అలా మా డైరెక్టర్ గారూ లవ్ సింబల్ వేశాడు. అలా కంటెంట్ కోసం లవర్స్ గా మారాము. అలా అలా వర్క్ జరుగుతూ మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. మేము ఇప్పటివరకు ఐ లవ్యూ కూడా చెప్పుకోలేదు. అలా వర్క్ పార్టనర్ కాస్తా.. నా బాధలు పంచుకుని.. బాధల దగ్గరి నుంచి మా కుటుంబాన్ని చూసుకుని.. మా అమ్మకు దగ్గరైపోయి.. ఆమె.. ఆ తల్లే ఒక్కొక్కరినీ ఒప్పించుకుంటూ వచ్చింది. నిజంగా దేవత అంతే.. మా ఇంట్లో అడుగు పెట్టిన దేవత. అట్లా నా వర్క్ పార్టనర్ ని కాస్తా మా డైరెక్టర్ గారూ నా లైఫ్ పార్టనర్ ని చేశాడు" అని రాకింగ్ రాకేష్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X