For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుమ షోలో సంచలన సంఘటన: నిజంగా తిట్టుకున్న జబర్ధస్త్ భామలు.. కెమెరాలు ఉన్నా కిందపడి మరీ!

  |

  గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో బుల్లితెరపై రకరకాల కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. దీంతో టాలెంట్ ఉన్న చాలా మంది వెలుగులోకి వస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు వీటి ద్వారా ఎన్నో అవకాశాలు దక్కుతున్నాయి. ఇలా ఈ మధ్య కాలంలో విపరీతంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో రోహిణి, జబర్ధస్త్ వర్ష పేర్లు ప్రముఖంగా చెప్పుకోవాలి.

  వీళ్లిద్దరూ జబర్ధస్త్ షోలో సందడి చేయడంతో పాటు ఎన్నో అవకాశాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సుమ కనకాల నిర్వహించే షోలో పాల్గొన్నారు. అయితే, అక్కడ ఊహించని విధంగా ఇద్దరూ నిజంగానే గొడవకు దిగారు. బుల్లితెరపై కలకలం రేపుతోన్న ఈ సంఘటన గురించిన పూర్తి వివరాలేంటో చూద్దాం పదండి!

  రోహిణి అప్పుడే మొదలు పెట్టేసింది

  రోహిణి అప్పుడే మొదలు పెట్టేసింది

  రోహిణి 19 ఏళ్ల వయసులో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఆరంభంలో నటించిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్‌తో మంచి గుర్తింపును అందుకుంది. దీని తర్వాత మరికొన్ని సీరియళ్లలోనూ నటించింది. ఆ సమయంలోనే 'బిగ్ బాస్' షోలోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌లో వింత ట్రాక్.. అతడిపై మనసు పడ్డ ప్రియాంక.. అందరి ముందే ఆ మాట!

  వర్ష కూడా అలా ఎంట్రీ ఇచ్చేసింది

  వర్ష కూడా అలా ఎంట్రీ ఇచ్చేసింది

  వర్ష కూడా బుల్లితెర నటిగానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయింది. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈమె.. చాలా కాలం పాటు తన అందచందాలతో అందరినీ అలరించింది. ఈ క్రమంలోనే సీరియల్ నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇలా ఈ బ్యూటీ 'ప్రేమ ఎంత మధురం' సహా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సీరియళ్లలో నటించి వరుస ఆఫర్లను అందుకుంటోంది.

  ఇద్దరూ అందులో భాగం అయ్యారు

  ఇద్దరూ అందులో భాగం అయ్యారు

  అటు రోహిణి, ఇటు వర్ష ఇద్దరూ బుల్లితెర హీరోయిన్లుగానే ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఒకవైపు సీరియళ్లలో నటిస్తూనే.. మరోవైపు జబర్ధస్త్‌ కామెడీ షోలో పర్మినెంట్ ఆర్టిస్టులుగా మారిపోయారు. ఇందులో వర్ష తన అందంతో పాటు పాత్రలతో మెప్పిస్తుండగా.. రోహిణి మాత్రం తనదైన శైలి కామెడీతో అలరిస్తోంది. తద్వారా ఇద్దరూ ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

  Bigg Boss Telugu 5: ఆమెను టార్గెట్ చేసిన అభిజీత్ ఫ్యాన్స్.. ఆ వీడియోలు షేర్ చేసి మరీ దారుణంగా!

  సుమ క్యాష్‌లో వాళ్లతో కలిసొచ్చారు

  సుమ క్యాష్‌లో వాళ్లతో కలిసొచ్చారు

  తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్న టాప్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేసే సూపర్ డూపర్ హిట్ షోలలో 'క్యాష్' ఒకటి. సెలెబ్రిటీలతో సాగే ఈ షోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో రోహిణి, జబర్ధస్త్ వర్ష, శ్రీసత్య, అంకిత, లహరి, స్రవంతి, ఐశ్వర్యలు పాల్గొని సందడి చేశారు.

  అదిరిపోయే పంచులతో షాకిచ్చారు

  అదిరిపోయే పంచులతో షాకిచ్చారు

  తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే ఈ ఎపిసోడ్ ఆద్యంతం సందడిగా సాగినట్లు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో జబర్ధస్త్ వర్ష ఓ షో కోసం బెగ్గర్ గెటప్ వేయగా.. దాన్ని సుమ పదే పదే గుర్తు చేసి ఏడిపించింది. అయితే, ఊహించని విధంగా రోహిణి మాత్రం సుమను తనదైన టైమింగ్‌తో పంచులు వేస్తూ ఓ రేంజ్‌లో ఆడుకుంది. దీంతో వీళ్లిద్దరూ మళ్లీ హైలైట్ అయ్యారు.

  Bigg Boss Telugu 5: హౌస్‌లో రెచ్చిపోయిన యాంకర్ రవి.. అతడి మాటలకు బోరున ఏడ్చేసిన కంటెస్టెంట్

  క్యాష్ చివర్లో తిట్టుకున్న రోహిణి, వర్ష

  క్యాష్ చివర్లో తిట్టుకున్న రోహిణి, వర్ష

  అప్పటి వరకూ ఎంతో సరదాగా సాగిన 'క్యాష్' షోలో సంచలన సంఘటన జరిగింది. దీనికి కారణం జబర్ధస్త్ వర్ష.. రోహిణిని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడమే. ఈ షోలో భాగంగా వర్ష 'అరేయ్ బండా.. రెడీ రా' అని అంది. దీంతో వెంటనే రోహిణి 'బండా అన్నావంటే ఎత్తి అవతల పడేస్తా. మాట్లాడితే బాడీ మీద కామెంట్ చేస్తావేంటి?' అంటూ సీరియస్‌గా గొడవకు దిగింది.

  Recommended Video

  Narappa Vs Asuran : Which One is best ? | Filmibeat Telugu
  కెమెరాలు ఉన్నా.. అలా చేయడంతో

  కెమెరాలు ఉన్నా.. అలా చేయడంతో

  వర్ష అన్న మాటకు రోహిణి అస్సలు తగ్గలేదు. ఆ సమయంలో 'నువ్వు సన్నగా ఉంటే అది నీ బాడీ తత్వం. నన్ను ఇలా అనొద్దు. అసలు వర్ష ఉంటే నేను రాకపోదును' అని అంది. అప్పుడు వర్ష ఏడ్చుకుంటూ 'సారీ.. రోహిణి ఉంటే నేనూ రాను' అని వెళ్లిపోయింది. ఆ సమయంలో రోహిణి 'అసలు నీ ముందు ఉండాలంటేనే చిరాకు' అని అంది. దీంతో వర్ష కింద పడి ఏడ్చేసింది. మధ్యలో సుమ ఆపినా ఆగకపోవడంతో ఆమె కూడా కోపంగా సెట్‌ను వదిలేసి వెళ్లిపోయింది.

  English summary
  Rohini, Jabardasth Varsha, Sri Sathya, Ankita, Lahari, Sravanthi and Aishwarya participated in Anchor Suma Cash Show Upcoming Episode. Rohini and Varsha Fighting In This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X