అతిథిగా రావడం ఎందుకు.. పరువు పోగొట్టుకోవడమెందుకు.. యాంకర్ రవికి షాక్!
యాంకర్ రవి బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాడు. స్టార్ మా మ్యూజిక్‌లో లాస్యతో కలిసి చేసిన దగ్గరి నుంచి నేటి వరకు యాంకరింగ్ రవి దూసుకుపోతూ వస్తున్నాడు. ఎవరితో యాంకరింగ్ చేసినా సరే కెమిస్ట్రీ మాత్రం బాగానే వర్కౌట్ అవుతూనే ఉంటుంది. అందుకే రవి పక్కన ఎంత మంది వచ్చి వెళ్లినా అతను మాత్రం అలాగే ఉన్నాడు. రవి పక్కన లాస్య, శ్రీముఖి, వర్షిణి, విష్ణు ప్రియ, భాను శ్రీ ఇలా అందరూ బాగానే సెట్ అయ్యారు.

తాజాగా మరో కొత్త షో..
ఈ మధ్యే యాంకర్ రవి కొత్త యాంకర్ వింధ్యతో కలిసి నువ్వు రెడీ నేను రెడీ అనే షోలో హోస్ట్ చేస్తున్నారు. భార్యాభర్తలను గెస్ట్‌లుగా తీసుకొచ్చి వారితో ఆటాడించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. అయితే ఈ షో అనుకున్నట్టే బాగానే క్లిక్ అయింది. తాజాగా రవి జబర్దస్త్ షోలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చాడు.

దువ్వాడ రవిగా..
మామూలుగా జబర్దస్త్ వేదిక మీద రవి అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. అయితే ఈ సారి రాకింగ్ రాకేష్ స్కిట్‌లో దువ్వాడ జగన్నాథం టైప్.. దువ్వాడ రవిగా ఓ పాత్రను ట్రై చేశాడు. ఎంట్రీ గ్రాండ్‌గానే ఇచ్చాడు. కానీ అంతలోనే రష్మీ వేసిన పంచ్‌కు అంతా తుస్సుమంది. దువ్వాడ దువ్వాడ రవి అంటూ ఎక్స్ ట్రాలు చేస్తుండగా.. అవును నువ్ దువ్వేవాడివే కదా అంటూ రష్మీ కౌంటర్ వేసింది.
మరో పంచ్..
ఇక స్టేజ్ మీదున్న కుర్చీని చూపిస్తూ.. సుబ్బరావు ఇంట్లో శుభకార్యం.. గంగారావు ఇంట్లో చావు కార్యం కూడా చేసింది.. అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఇక్కడికి వచ్చింది అంటూ రవి డైలాగ్ విసిరాడు. స్కిట్‌లో కంటెస్టెంట్ అయిన రోహిణి ఓ కౌంటర్ వేసింది. అవునను కొంత మంది అక్కడా ఇక్కడా తిరిగి ఇక్కడికే వస్తారు అని అనడంతో అందరూ షాక్ అయ్యారు.

పటాస్‌ను వీడి అదిరింది..
రోహిణి అలా అన్న మాటలో ఎంతో అర్థం ఉంది. మల్లెమాలలోని పటాస్‌ను వదిలి అదిరింది షోలోకి వెళ్లావ్.. మళ్లీ అక్కడి నుంచి ఇక్కడకు వచ్చావ్ అన్నట్టుగా ఆమె వేసిన సెటైర్ బాగానే పేలింది. ఇలా అతిథిగా రావడం ఎందుకు ఆ గతాన్ని తవ్వుకుని పరుపు పోగొట్టుకోవడం ఎందుకు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదిరిందిలో రవి పొజిషన్ బాగానే ఉందిగా అంటూ కామెంట్లు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











