సుడిగాలి సుధీర్‌పై లేడీ ఆర్టిస్ట్ వివాదాస్పద కామెంట్స్: బేవార్స్ అంటూ అతి దారుణంగా!
తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూ.. అప్పటికీ ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా హవాను చూపిస్తోంది జబర్ధస్త్. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే స్టార్లుగా మారారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే అడుగు పెట్టిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే తన సత్తాను నిరూపించుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు.
ఇక, అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఇలా కొంత కాలంగా షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ లేడీ ఆర్టిస్టు సుధీర్‌పై వివాదాస్పద కామెంట్లు చేసింది. ఆ సంగతులు మీకోసం!

ఆ టాలెంట్... జబర్ధస్త్ ఎంట్రీ
సుధీర్ మొదట మ్యాజిక్‌లు చేసుకుంటూ తన ప్రయాణాన్ని మొదలెట్టాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఛానెళ్లలో మ్యాజిక్ షోలు చేశాడు. అలాంటి సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడడంతో అందులోకి ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అలా పరిచయం అయినా తన టాలెంట్లను చూపించుకున్నాడు. దీంతో షో నిర్వహకులు సుధీర్‌కు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ అందించారు.

రష్మీతో ట్రాకుతో ఫుల్ ఫేమస్
కామెడీ, డ్యాన్స్, మ్యాజిక్స్, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు సుధీర్. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో ఓ రేంజ్‌లో పాపులర్ అయ్యాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ లవర్సే అని అంతా అనుకుంటున్నారు.

అక్కడ కూడా సత్తా చాటుతూ
సుదీర్ఘ కాలంగా సుధీర్ బుల్లితెరపై తిరుగులేని ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించాడు. అలాగే హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' అనే సినిమాలు చేశాడు. ఇక, ఇప్పుడు సుధీర్ హీరోగా 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' అనే చిత్రాలను చేస్తున్నాడు.

మళ్లీ యాంకర్‌గా మారాడుగా
సుడిగాలి సుధీర్ కొన్నేళ్ల క్రితం 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారిన విషయం తెలిసిందే. హోస్టుగానూ తన మార్క్‌ను చూపించి ఆకట్టుకున్నాడు. కానీ, ఆ షోతో యాంకరింగ్‌ను ఆపేశాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో మరోసారి యాంకర్‌గా ఎంట్రీ మారాడు. అందులో తనదైన స్టైల్‌లో హోస్టింగ్ చేస్తున్నాడు.

పుష్ప గెటప్‌తో సుధీర్ రచ్చ
సుడిగాలి సుధీర్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌లో ఓ రేంజ్‌లో సందడి చేస్తుంటాడన్న విషయం తెలిసిందే. వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో అతడు 'పుష్ప' మూవీ స్ఫూఫ్ చేశాడు. ఇందులో సుధీర్ పుష్పరాజ్ గెటప్ వేసుకున్నాడు. అలాగే, రాంప్రసాద్ కేశవ పాత్రను, గెటప్ శ్రీను విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను చేశారు. ఈ ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
సుధీర్‌ను బేవార్స్ అనడంతో
తాజాగా వచ్చిన ప్రోమోలో సుడిగాలి సుధీర్ చేసిన రోల్ హైలైట్ అవుతోంది. ఇందులో అతడు కాలు మీద కాలేసుకుని కూర్చుండగా.. కేశవ పాత్రలో ఉన్న రాంప్రసాద్.. రష్మీ ముందు ఎందుకలా కూర్చున్నావ్ అని అడుగుతాడు. దీనికి సుధీర్ ఓ పంచ్ వేస్తాడు. ఆ తర్వాత శ్రీవల్లి కోసం డబ్బులిచ్చి మాట్లాడమంటాడు. అప్పుడు రోజా అతడిని బేవార్స్ అని అనడంతో షాకయ్యారంతా.

లేడీ ఆర్టిస్టు కూడా అలా అని
రాంప్రసాద్ వేయి రూపాయలు ఇవ్వగానే శ్రీవల్లి.. సుధీర్‌ను చూడడానికి వస్తుంది. అప్పుడతను 'ఏ పిల్లా.. నచ్చినానా' అని అడుగుతాడు. అప్పుడామె 'నీ మూతి నచ్చినావ్.. వాడు వేయి రూపాయలు ఇస్తే వచ్చినా' అంటుంది. దీనికి రోజా 'వాడిని చూసి బేవార్స్ అనుకుంటివా' అని ఆమెను అడుగుతుంది. దీనికామె 'చూడ్డానికి అలాగే ఉన్నాడు' అంటూ చెప్పి షాకిచ్చింది.


Click it and Unblock the Notifications











