రెచ్చిపోయిన రోజా.. దుమ్ములేపిన శేఖర్ మాస్టర్.. ఈసారి మరింత ఘాటుగా!!
బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లు ఏ రేంజ్‌లో ఉంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దసరా దీపావళి సంక్రాంతి ఇలా ప్రతీ పండుగకు బుల్లితెర దద్దరిల్లిపోతోంది. అన్ని చానెళ్లు తమ తమ శైలిలో స్పెషల్ ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు. దసరా ఈవెంట్ల పోటీ ఏ రేంజ్‌లో జరిగిందో అందరికీ తెలిసిందే. జెమినీ, ఈటీవీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని చానెళ్లు పోటీ పడ్డాయి. ప్రోమోలతో దుమ్ములేపారు. ఈవెంట్లపై హైప్ పెంచారు. మొత్తానికి హిట్టు చేసుకున్నారు. ఇక ఇప్పుడు దీపావళి ఈవెంట్ వంతు వచ్చింది.

కనకమహాలక్ష్మీ..
దీపావళి అంటే అందరికీ ముందుగా.. లక్ష్మీ పూజ గుర్తుకు వస్తుంది. అందుకే ఈటీవీలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం కలిసి కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా అనే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. అందులో రోజా, శేఖర్ మాస్టర్, శ్రీముఖి, సోనూ సూద్, అనూప్ రూబెన్స్ ఇలా ఎంతో మంది సందడి చేయబోతోన్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.

పులిహోర కలిపేశాడు..
ఆ మధ్య రిలీజ్ చేసిన ప్రోమోలో శేఖర్ మాస్టర్ రోజా కామెడీ టైమింగ్ వైరల్ అయింది. మీ దృష్టిలో అదృష్టం అంటే ఏంటి అని శ్రీముఖి శేఖర్ మాస్టర్‌ను అడిగింది. రోజా గారు నా ముందు ఉండటమే అదృష్టం అంటూ పులిహోర కలిపేందుకు ప్రయత్నించాడు. దసరా ఈవెంట్‌లో సంగీతతో ఏ రేంజ్ పులిహోర కలిపాడే అందరం చూశాం. ఈ ఈవెంట్‌లో రోజాతో ఇంకో లెవెల్‌లో కానిచ్చేస్తున్నాడు.

తాజాగా అలా..
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శేఖర్ మాస్టర్ రోజా కలిసి దుమ్ములేపారు. మామూలుగానే ఈ ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. ఇద్దరూ ఎంతో స్టైలీష్, గ్రేస్‌తో కూడిన స్టెప్పులు వేస్తుంటారు. బుల్లితెరపై ఈ ఇద్దరూ వేసే స్టెప్పులకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా ఈవెంట్‌లోనూ ఇద్దరూ స్టేజ్‌పై దుమ్ములేపారు.
ఉట్టి మీద కూడు..
ఉట్టి మీద కూడు అంటూ ఇద్దరూ అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ ఇద్దరి కెమిస్ట్రీ అందరూ షాక్ అయ్యారు. అదిరిపోయే పర్పామెన్స్ ఇచ్చారంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ప్రోమోలోనే ఈ ఇద్దరి పర్ఫామెన్న్ కన్నుల విందుగా ఉంటే పూర్తి ఎపిసోడ్‌లో ఈ ఇద్దరూ ఇంకెంత రచ్చ చేశారో మరి.


Click it and Unblock the Notifications











