For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగబాబు, రోజా మధ్య బండ్లగణేష్ చిచ్చు.. జబర్దస్త్ నుంచి తప్పుకో.. ఆవేశంలో ఫ్యాన్స్

  By Rajababu
  |
  జబర్దస్త్ నుంచి తప్పుకో..! | Filmibeat Telugu

  పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై సినీ నటి, ఎమ్మెల్యే రోజా స్పందించిన తీరు అటు రాజకీయ, సినీ, మీడియా వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. వారసత్వ రాజకీయాలను తప్పుపట్టిన పవన్‌పై రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై జరిగిన చర్చ సందర్భంగా బండ్ల గణేష్, రోజా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొన్నది. మారి మాటల యుద్దంలో చాలా దారుణమైన తిట్లు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాగబాబు, రోజా నిర్వహించే జబర్దస్త్ కామెడీషోపై ఎలాంటి ప్రభావం పడబోతుందనే తాజా చర్చ ఒకటి జరుగుతున్నది.

   రోజా ఏమన్నారంటే..

  రోజా ఏమన్నారంటే..

  వారసత్వం అనే విషయం రాజకీయాలకే ఎందుకు పరిమితం.. సినిమా పరిశ్రమకు కూడా వర్తించాలి? మెగాస్టార్ చిరంజీవి లేకపోతే పవన్ కల్యాణ్ గానీ, ఆయన ఇంట్లోని హీరోలను పెట్టి ఎవడు సినిమా తీస్తాడు.. వాళ్లను ఎవడు చూస్తాడు అని రోజా ధ్వజమెత్తింది.

   పవన్ ఎవడుపై మండిపాటు

  పవన్ ఎవడుపై మండిపాటు

  రోజా వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవల ఓ ప్రముఖ టెలివిజన్ చానెల్ నిర్మాత, పవన్ భక్తుడు బండ్ల గణేష్‌తో చర్చకార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ను ఎవడు అంటూ కామెంట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.

   జగన్‌కు రోజా మద్దతు

  జగన్‌కు రోజా మద్దతు

  బండ్ల గణేష్ వాఖ్యలకు సమాధానంగా రోజా మాట్లాడుతూ.. లోకేష్ మాదిరిగా ప్రజా మద్దతు లేకుండా వైఎస్ జగన్ గెలువలేదు. మహనేత వైఎస్ఆర్ వారసుడిగా ప్రవేశించిన జగన్.. 5 లక్షల పైగా ఓట్లతో గెలిచారు. గత ఎనిమిదేళ్లుగా జగన్ కష్టపడుతున్నాడు. అలాంటప్పడు జగన్‌పై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం తగదు అని రోజా అన్నారు.

   పళ్లు రాలుతాయి.. బండ్లకు రోజా వార్నింగ్

  పళ్లు రాలుతాయి.. బండ్లకు రోజా వార్నింగ్

  ఈ చర్చ సందర్భంగా రోజా ఐరన్ లెగ్ అని, రాజశేఖర్ రెడ్డిని పంపించారు అని బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలపై రోజా మండిపడింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు పక్కలు వేయడం లేదా అనగా గందరగోళంగా మారింది. అందుకు సమాధానంగా నిన్ను కూడా తీసుకెళ్తాను రా.. బండ్ల గణేష్ అనగా.. పళ్లు రాలుతాయ్ అని రోజా ఊగిపోయింది.

  రోజాకు బుద్ది చెప్పాలి

  రోజాకు బుద్ది చెప్పాలి

  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రోజా వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజాకు తగిన బుద్ధి చెప్పాలి అని పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ సోదరుడు నాగబాబు, రోజా పాల్గొనే జబర్దస్త్ కార్యక్రమం చర్చ జరుగుతున్నది.

   జబర్దస్త్‌పై బండ్ల ఎఫెక్ట్

  జబర్దస్త్‌పై బండ్ల ఎఫెక్ట్

  జబర్దస్త్ కార్యక్రమంలో ఆర్టిస్టులు వేసే జోకులకు రోజా, పవన్ కల్యాణ్ పడీపడీ నవ్వుకుంటారు. పవన్ కల్యాణ్‌పై రోజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రోజాతోపాటు కామెడీ షో న్యాయమూర్తిగా నాగబాబు ప్రశాంతంగా ఉండగలరా?.. పవన్‌ను వాడు అని సంబంధించిన రోజాతో వేదికపై సఖ్యతతో కూడా ఉంటారా అనేది ప్రశ్నగా మారింది.

   నాగబాబు తప్పుకోవాలి..

  నాగబాబు తప్పుకోవాలి..

  రోజా, బండ్ల గణేష్ వివాదంలోకి ఇప్పుడు నాగబాబును ఫ్యాన్స్‌ను లాగే ప్రయత్నం చేస్తున్నారు. పవన్‌, మెగా హీరోలపై వ్యక్తిగత దూషణలు చేసిన రోజాతో కలిసి జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనడం సరైంది కాదు అని అంటున్నారు. జబర్దస్త్ కామెడీ షో నుంచి రోజాను తొలగించాలి. లేదా ఈ కార్యక్రమం నుంచి నాగబాబు తప్పుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

  నాగబాబు నిర్ణయంపై

  నాగబాబు నిర్ణయంపై

  రోజా, బండ్ల గణేష్ వివాదం తీవ్రంగా మారిన నేపథ్యంలో నాగబాబు స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జనసేన, వైసీపీల మాటల యుద్ధం ఇంతటితో ఆగేది కాదు. కాబట్టి నాగబాబు ముందే మేల్కొనాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

  English summary
  Roja, Bandla Ganesh controversy hits Nagababu. Bandla Ganesh responded aggressively on Roja comments which on Pawan Kalyan. Apart from this, Roja is playing judge role with Nagababu in Jabardast show. So Pawan Fans are demanding Nagababu to withdrawn his role from comedy show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X