For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కొత్త మార్పులు కలిసివస్తాయా? : 'రచ్చబండ' దగ్గర రోజా , 'జబర్దస్త్' గా మంచు లక్ష్మి

  By Srikanya
  |

  హైదరాబాద్: ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగి, టీవి మీడియాలోకి సైతం వచ్చి జబర్దస్త్ షో తో స్టార్ గా తన సత్తా ఏంటో చూపించిన రోజా మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించబోతున్నారని సమాచారం.

  త్వరలో ఆమె జెమినీ టీవిలో రచ్చబండ టైటిల్ తో ఓ రియాల్టి షో పోగ్రామ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ పోగ్రామ్ లో కుటుంబాల్లో వచ్చే సమస్యలకు పెద్దరికంగా పరిష్కారం చూపటం, అవసరమనుకుంటే లీగల్ గా సాయిం చేయటం వంటివి చేస్తారని చెప్తున్నారు. అయితే జబర్దస్త్ చేస్తూనే ఈ పోగ్రాం చేస్తుందా లేక రెండు చేస్తుందా అనే విషయాలు టీవి మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

  ఇప్పటికే వేరే ఛానెల్ లో వస్తున్న బతుకు జట్కా బండి తరహా పోగ్రామ్ ఇది కావచ్చు అని భావిస్తున్నారు. రోజా సీన్ లోకి వస్తే టీఆర్పీలకు లోటు ఉండదని, ఆమె యాంకరింగ్ అద్బుతంగా ఉంటుందని, తన డైనమిక్ పర్శనాలిటితో ఇట్టే పోగ్రామ్ ని పైకి లేపుతుందని ఛానెల్ వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  ఇప్పటికే జబర్దస్త్ ..కామెడీ షోలో చేస్తున్న ఈమె ఈ కొత్త షో నిమిత్తం భారీగానే వసూలు చేస్తున్నరని వినికిడి. ఎంత ఇచ్చినా రోజా వంటి స్టార్ ఇమేజ్ ఉన్న యాంకర్ ముందు అది దిగదుడుపే అంటున్నారు. రోజా కూడా తన పొలిటికల్ కెరీర్ కు ఈ పోగ్రామ్ ఉపయోగపడే అవకాసం ఉందని భావిస్తున్నారట.

  మరో ప్రక్క రీసెంట్ గా నిన్న ప్రసారం అయిన 'జబర్దస్త్' షోలో రోజా స్థానంలో మంచు లక్ష్మి కనిపించింది. దీంతో 'జబర్దస్త్' షో నుండి రోజాను తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి రోజా తనకు వీలు కాక ఈ షోలో పాల్గొనలేక పోయారా? లేక బయట ప్రచారం జరుగుతున్నట్లు ఆమెను కావాలని తప్పించారా? అనేది చర్చనీయాంశం అయింది.

  పోగ్రామ్ టీఆర్పిలు సైతం తగ్గిన ఈ సమయంలో కొత్త నీరుతో ఈ పోగ్రామ్ ని పాతపడకుండా చేయాలని ఛానెల్ వారు , పోగ్రామ్ డిజైనర్ అయిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

  స్లైడ్ షోలో మిగతా విశేషాలు...

  మంచు లక్ష్మి జడ్జిగా

  మంచు లక్ష్మి జడ్జిగా

  మొన్నవారం ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షోలో మంచు లక్ష్మి జడ్జిగా కనిపించింది. రోజా ప్లేస్ లో ఆమె కనిపించి ఆశ్చర్యపరిచింది.

  జోష్

  జోష్

  రోజా ఎంత జోష్ తో పోగ్రామ్ రన్ చేసేవారో అంతకన్నా ఎక్కువ ఉషారుగా మంచు లక్ష్మి ఈ పోగ్రామ్ ని రన్ చేసి ఆశ్చర్యపరిచారు.

  సంచలనాలకు నాంది..

  సంచలనాలకు నాంది..

  తెలుగు బుల్లితెరపై ఈటీవీ ప్రవేశ పెట్టిన జబర్ధస్త్ కామెడీ షో ఇప్పటి వరకు ఎన్నో సంచలనాలు నాంది పలికింది.

  యాంకర్లకు డిమాండ్ , పేరు

  యాంకర్లకు డిమాండ్ , పేరు

  ఈ పోగ్రామ్ లో చేసిన యాంకర్లకు విపరీతమైన పేరు వచ్చింది.

  అనసూయకు..

  అనసూయకు..

  ముఖ్యంగా అనసూయకు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. హట్ హాట్ గా చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని యాంకరింగ్ స్టయిలే మార్చేసిన క్రెడిట్ అనసూయదే.

  సినిమా ఆఫర్స్ తో..

  సినిమా ఆఫర్స్ తో..

  జబర్ధస్త్ ప్రోగ్రామ్ తో ఈ హాట్ భామకు సినిమాల్లో కూడా మంచి చాన్సులు రావడం.. ఇతర టీవీషో ల్లో యాంకర్ గా చాన్సులు రావడంతో జబర్ధస్త్ కి బాయ్ చెప్పింది.

  రేష్మి వచ్చి...

  రేష్మి వచ్చి...

  తర్వాత ఈమె స్థానంలో రేష్మి వచ్చి అనసూయ లేని లోటు తీరుస్తుంది. ఆమె కూడా ఈ మధ్యకాలంలో పూర్తి బిజీ అయ్యింది.

  క్షణం

  క్షణం


  అనసూయ నటించిన క్షణం చిత్రం విజయవంతం అవటం,సోగ్గాడే చిన్ని నాయినా సూపర్ హిట్ అవటం ఆమెకు బాగా కలిసి వచ్చింది.

  రేష్మి

  రేష్మి

  గుంటూరు టాకీస్ చిత్రంలో ఓ రేంజిలో రెచ్చి పోయిన రేష్మి...ఆ తర్వాత వరస ఆఫర్స్ అందుకుంటోంది.

  టీమ్ కు సైతం..

  టీమ్ కు సైతం..

  ఇక ఇందులో నటించిన నటులకు కూడా మంచి చాన్సులు వచ్చాయి. కమిడయన్స్ వారికి సినిమా ఆపర్స్ వస్తున్నాయి.

  వండర్స్ వేణు

  వండర్స్ వేణు

  ఈ పోగ్రామ్ లో పూర్తి కామెడీ చేసే వేణు సినిమాల్లో కూడా పూర్తి బిజీ అన్న సంగతె తెలిసిందే.

  ధన్ రాజు

  ధన్ రాజు

  వరస పెట్టి సినిమాల్లో కనిపిస్తున్న ధన్ రాజు ఈ మధ్యకాలంలో హీరోగా కూడా చేయటం మనం గమనించవచ్చు.

  షకలక శంకర్

  షకలక శంకర్

  రీసెంట్ గా వచ్చిన చిత్రాలు అన్నిటిలోనూ షకలక శంకర్ ఉన్నారు.

  ఛమ్మక్ ఛంద్ర

  ఛమ్మక్ ఛంద్ర

  కాంట్రావర్శిలో ఇరుక్కున్న ఛమ్మక్ ఛంద్ర సైతం సినిమాల్లో అడపాదడపా కనిపిస్తూనే ఉన్నారు.

  టీమ్ అంతా..

  టీమ్ అంతా..

  అలాగే జబర్దస్ద్ లో కనిపించే మెయిన్ కమిడయన్స్ హీరోలుగా సినిమా ఒకటి ప్రారంభమవుతోంది.

  మంచు లక్ష్మి వస్తుందా

  మంచు లక్ష్మి వస్తుందా

  రోజా తప్పుకుంటున్నట్లు..ఆమె స్థానంలోకి మంచు లక్ష్మి వస్తున్నట్లు రూమర్లు సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్నాయి.

  రోజా నిర్ణయం

  రోజా నిర్ణయం

  రోజా ఒకవైపు రాజకీయాలు మరోవైపు అప్పుడప్పుడు సినిమాలతో ఈ ప్రోగ్రామ్‌కి టైం కెటాయించడం కష్టమవుతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

  English summary
  Actress Roja is now geared up for her brand new reality show titled at Rachabandaa that is going to be telecasted on Gemini TV soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X