రోజాపై జగన్ ఎఫెక్ట్.. ప్రవర్తనలో సడెన్‌ చేంజ్! అనసూయతో అలా..?

Recommended Video

Is YS Jagan The Reason Behind Change In Roja's Behaviour?

కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్.. ఫ్యామిలీ అంతా కూర్చొని మస్త్ జబర్దస్త్‌గా ఎంజాయ్ చేసే బుల్లితెర ట్రీట్ ఇది. అంతేకాదు ఈ షో ప్రసారం చేస్తున్న టీవీ ఛానెల్ వారికి అంతులేని టీఆర్పీ రేటింగ్ తెచ్చిన ఏకైక షో కూడా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. యాంకర్ అనసూయ అందాల విందులు, న్యాయనిర్ణేతలు నాగబాబు, రోజా నవ్వులు.. అదేవిధంగా స్కిట్లు చేసేవారి వేషాలు అన్నీ ఈ షోలో దేనికవి ప్రత్యేకమే. ముఖ్యంగా తనదైన డైలాగులతో, ఇంట్రో డాన్సులతో ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టడంలో రోజా ఎప్పుడూ ముందే. అయితే సడెన్‌గా ఈ మధ్యకాలంలో రోజా ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇంతకీ ఆ మార్పు ఏంటి? వివరాలు చూస్తే..

డౌట్ వచ్చింది కానీ.. తప్పుకోలేదు

డౌట్ వచ్చింది కానీ.. తప్పుకోలేదు

ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైందో అప్పటి నుంచి రోజాపై అనుమానాలు మొదలయ్యాయి. రోజా గెలిస్తే ఇక జబర్దస్త్ షోలో కనిపించదని అంతా అనుకున్నారు. కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎమ్మెల్యేగా గెలిచాక కూడా జ‌బ‌ర్ద‌స్త్ తెరపై వాలిపోయింది రోజా. ఎన్నికల సందర్బంగా కొంత గ్యాప్ మాత్రమే తీసుకొని మరోసారి బుల్లితెర ఆడియన్స్ చెంత చేరింది.

గతంలో ఇంట్రో చిందులతో కిక్

గతంలో ఇంట్రో చిందులతో కిక్

వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలవకముందు జబర్దస్త్ కామెడీ షో ప్రారంభంలోనే అనసూయతో కలిసి ఇంట్రో సాంగ్‌లో చిందులతో కిక్కిచ్చేది రోజా. యాంకర్లు అనసూయ, రష్మీలకు ధీటుగా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు ముందుగా వచ్చే బీట్ సాంగ్స్‌కి డాన్సులు వేసేది. ముందుగా వచ్చే ఈ బీట్ సాంగ్ తోనే ప్రేక్షకుల్లో జబర్దస్త్ పట్ల ఆసక్తి నెలకొనేది. కానీ ఆసక్తి ఇప్పుడు కొరవడిందని చెప్పుకోవాలి.

ఏపీఐఐసీ చైర్మన్ సీట్‌లో రోజా.. ప్రవర్తనలో మార్పు

ఏపీఐఐసీ చైర్మన్ సీట్‌లో రోజా.. ప్రవర్తనలో మార్పు

గత ఎన్నికల్లో గెలిచిన రోజాకు మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని భావించారంతా. కానీ అందుకు భిన్నంగా రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబట్టాడు ముఖ్యమంత్రి జగన్. ఈ పదవి కూడా క్యాబినేట్ ర్యాంకుతో సమానమైనదే. ఇదే జబర్దస్త్ షోలో ఆమె ప్రవర్తనలో మార్పు తెచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

పరోక్షంగా జగన్ కారణమయ్యాడు

పరోక్షంగా జగన్ కారణమయ్యాడు

ప్రస్తుతం ఏపీఐఐసీ చైర్మన్ హోదాలో ఉన్న రోజా.. జబర్ధస్త్ ప్రోగ్రామ్ చేస్తోంది కానీ ఇది వరకటిలా జబర్ధస్త్‌లో వచ్చే ఇంట్రో సాంగ్స్‌కి యాంకర్స్‌తో కలిసి చిందులేయడం మానేసింది. ఇదే అంశాన్ని పసిగట్టి రోజా ప్రవర్తనలో మార్పు వచ్చిందని, క్యాబినేట్ ర్యాంకుతో సమానంగా ఉన్న పదవిలో ఉండటం కారణం గానే ఇలా చేస్తోందని అంటున్నారు జనం. అయితే రోజాలో వచ్చిన ఈ మార్పుకు పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ కారణమయ్యాడు అని జనంలో వినిపిస్తున్న లాజిక్ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X