twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమ కాదంటూనే ఓపెన్ అయిపోయాడు.. రోహిణిపై రాకింగ్ రాకేష్ కామెంట్స్

    |

    జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ పేరు ఏదైనా కామెడీ స్కిట్లు మాత్రం అవే. అక్కడా ట్రాకులు,ఇక్కడా ట్రాకులు ఉండాల్సిందే. రహస్య బంధాలుండాల్సిందే. లేకపోతే కొత్తగా క్రియేట్ చేస్తుంటారు కూడా. అలా తాజాగా రోజా మరో కొత్త జంటను తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుంది. ఇప్పటికే ఇమాన్యుయేల్ వర్ష జంట బాగానే క్లిక్ అయింది. ఈ ఇద్దరి మీదే జబర్దస్త్ టీం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుంది. అయితే తాజాగా రోజా మరో జంటను బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టుంది.

    రాకింగ్ రాకేష్ అలా..

    రాకింగ్ రాకేష్ అలా..

    మొదటి నుంచి కూడా రాకింగ్ రాకేష్ చిన్న పిల్లలతో స్కిట్లు వేస్తూ వచ్చాడు. వారి వల్లే స్కిట్లు హిట్ అవుతూ వచ్చేవి. రాకేష్ టీం లీడర్‌గా ఉన్నాడు కానీ టీం బాధ్యతను మాత్రం దీవెన, యోదలు మోసేవారని కామెంట్లు వచ్చేవి. వాటిపైనా సెటైరికల్‌గా ఎన్నో స్కిట్లు వేశాడు. పిల్లలు లేకపోతే తాను లేనని చెప్పే స్కిట్లు ఎన్నో రాకేష్ వేశాడు.

     వారు లేకుండానే..

    వారు లేకుండానే..

    గత కొన్ని రోజులుగా రాకేష్ స్కిట్లలో పిల్లలు కనిపించడం లేదు. కరోనా కారణంగా వారిని షూటింగ్‌లకు దూరంగా ఉంచినట్టు కనిపిస్తోంది. అయినా కూడా రాకేష్ తన దైన శైలిలో స్కిట్లతో దూసుకుపోతోన్నాడు. మధ్యలో వర్ష, ఇమాన్యుయేల్, రోహిణిలను బాగా వాడి స్కిట్లు వేశాడు.

    ప్రస్తుతం రోహిణితో..

    ప్రస్తుతం రోహిణితో..

    కానీ ఇప్పుడు రాకేష్ మాత్రం కేవలం రోహిణితో కలిసి స్కిట్లు వేస్తున్నాడు. ఫ్రస్ట్రేట్‌డ్ భార్య, ఆమె చేతిలో దెబ్బలు తినే భర్త, ప్రేయసి ప్రేమికుడు వంటి కాన్సెప్ట్‌లతో స్కిట్లు వేస్తున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఓ స్కిట్ వేసిన రోహిణి, రాకేష్‌లను రోజా నిలదీసింది.

     అలాంటి స్కిట్లు..

    అలాంటి స్కిట్లు..

    తాజాగా రోహిణి రాకేష్ బిచ్చగాళ్లుగా నటిస్తూ ఓ స్కిట్ వేశారు. అందులో ఇద్దరూ ప్రేమికులుగా నటించారు. అయితే చివర్లో రోహిణిని కాకుండా రాకేష్ వేరే వాళ్లతో సరసాలు ఆడుతుంటాడు. కోపం వచ్చిన రోహిణి.. రాకేష్‌ను ఎత్తుకెళ్తుంది. అయితే ఇదే విషయంపై రోజా ప్రశ్నించింది.

    ప్రేమ కాదు..

    ప్రేమ కాదు..

    ఈ ప్రేమ నిజమేనా? కేవలం స్కిట్ కోసమేనా? అని రోజా అడిగింది. దానికి రాకేష్ స్పందిస్తూ.. ప్రేమ కాదు కానీ మేడమ్.. రోహిణి నాకు చాలా విషయాల్లో సపోర్ట్ చేసింది.. తాను ఉంటే నాకు ధైర్యంగా ఉంటుందని రోహిణిపై తన అభిప్రాయాన్ని చెప్పేశాడు.

    English summary
    Roja Comments On rakesh and Rohini In Extra Jabardasth,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X