జబర్ధస్త్‌కు రోజా గుడ్‌బై: షో నిర్వహకులు పెట్టిన కొత్త కండీషన్ వల్లే ఈ నిర్ణయం.!

By Manoj

తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న షోలలో ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ ఒకటి. కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణ పొందుతోన్న ఈ షో.. దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రసారం అవుతోంది. 2013 నుంచి ఇప్పటి వరకు టాప్ రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ షోకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగలబోతుందని ఓ న్యూస్ లీకైంది. షో ప్రారంభం నుంచీ జడ్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న రోజా.. జబర్ధస్త్ నుంచి తప్పుకున్నారనేదే ఆ వార్త సారాంశం. వివరాల్లోకి వెళితే.....

ఒక్కరు కాదు... ఇద్దరు కాదు.. వందల మంది

ఒక్కరు కాదు... ఇద్దరు కాదు.. వందల మంది


సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై సందడి చేస్తోంది జబర్ధస్త్ కామెడీ షో. ప్రారంభంలో వారంలో ఒక్కరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో.. రెస్పాన్స్ అధికంగా ఉండడంతో రెండు రోజులకు చేరింది. ఈ షో అంతగా పాపులర్ అయిపోయింది. మరోవైపు, జబర్ధస్త్ వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, రైటర్లు వెలుగులోకి రావడంతో పాటు క్రేజ్‌ను కూడా సంపాదించుకున్నారు.

వాళ్లిద్దరూ.. వీళ్లిద్దరూ.. ఊహించని పాపులారిటీ

వాళ్లిద్దరూ.. వీళ్లిద్దరూ.. ఊహించని పాపులారిటీ

జబర్ధస్త్ వల్ల టాలెంట్ ఉన్న ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. అదే సమయంలో దీని వల్లే సీనియర్ హీరోయిన్ రోజా.. మెగా బ్రదర్ నాగబాబు గతం కంటే ఎక్కువ పేరును సంపాదించుకున్నారు. వాళ్ల వాళ్ల కెరీర్‌కు ఈ షో బాగా ఉపయోగపడింది. అలాగే, యాంకర్లు అనసూయ, రష్మీ గౌతమ్‌కు కూడా ఊహించని రీతిలో పాపులారిటీ వచ్చింది.

జబర్ధస్త్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన మెగా బ్రదర్

జబర్ధస్త్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చిన మెగా బ్రదర్

ఏడేళ్ల పాటు విజయవంతంగా ప్రసారం అవుతూ నెంబర్ వన్ కామెడీ షో అనిపించుకుంటోంది జబర్ధస్త్. ఇలాంటి తరుణంగా కొద్ది రోజుల క్రితం ఆ షో జడ్జ్ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు పని చేసిన ఆయన.. వ్యక్తిగత కారణాలతో జబర్ధస్త్‌ను వీడారు. ఆయనతో పాటు కొందరు టీమ్ లీడర్లు సైతం షో నుంచి తప్పుకున్నారు.

లోటు కనిపించకుండా.. ఒంటి చేత్తో నడుపుతోంది

లోటు కనిపించకుండా.. ఒంటి చేత్తో నడుపుతోంది


నాగబాబు జబర్ధస్త్‌ను వీడిన తర్వాత.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై పెద్ద చర్చే జరిగింది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఆయన సీటులోకి ఎవరూ రాలేదు. మరో జడ్జ్ రోజానే ఒంటి చేత్తో షోను నడుపుతోంది. మధ్య మధ్యలో కొందరు సినీ ప్రముఖులను గెస్టులుగా తీసుకొచ్చి మేనేజ్ చేస్తోంది జబర్ధస్త్ యూనిట్.

జబర్ధస్త్‌లో కొత్త నిబంధన.. వాళ్లపై ఎక్కువ ప్రభావం

జబర్ధస్త్‌లో కొత్త నిబంధన.. వాళ్లపై ఎక్కువ ప్రభావం

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పిరియడ్ నడుస్తోంది. దీంతో షూటింగులు బంద్ అయ్యాయి. ఈ కారణంగా జబర్ధస్త్ షో ప్రసారం కూడా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు జబర్ధస్త్ యూనిట్ రెమ్యూనరేషన్‌లు తగ్గించిందని తెలుస్తోంది. ఈ ప్రభావం హైపర్ ఆది, సుడిగాలి సుధీర్‌ టీమ్‌లపై ఎక్కువగా ఉందని టాక్.

Recommended Video

Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
జబర్ధస్త్‌కు రోజా గుడ్‌బై.. అసలు కారణం ఇదేనట

జబర్ధస్త్‌కు రోజా గుడ్‌బై.. అసలు కారణం ఇదేనట

నాగబాబు తప్పుకోవడం.. కరోనా ప్రభావం వంటి కారణాలతో జబర్ధస్త్ యూనిట్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఇలాంటి తరుణంలో షో నుంచి రోజా కూడా తప్పుకున్నారని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. లాక్‌డౌన్ నష్టాలను భరించేందుకు రెమ్యూనరేషన్లు తగ్గించాలని షో నిర్వహకులు డిసైడ్ అవడం కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X