మా ఆయన దగ్గరున్నదే ఇష్టమన్న అనసూయ: యాంకర్ పర్సనల్ మేటర్ లీక్ చేసి షాకిచ్చిన రోజా

ఆలస్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. గ్లామర్‌కు గ్లామర్.. టాలెంట్‌కు టాలెంట్ ఉన్న లేడీ కావడంతో వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలోనే టెలివిజన్ రంగంలోనే కాదు.. వెండితెరపైనా తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అనసూయ భరద్వాజ్ పర్సనల్ మేటర్‌ను లీక్ చేసింది జబర్ధస్త్ జడ్జ్ రోజా. అంతేకాదు, ఆమె అబద్ధం చెబుతుందని షాకింగ్ కామెంట్స్ కూడా చేసిందామె. ఆ వివరాలు మీకోసం!

జబర్ధస్త్‌తో అనసూయకు భారీ ఫాలోయింగ్

జబర్ధస్త్‌తో అనసూయకు భారీ ఫాలోయింగ్

కెరీర్ ఆరంభంలోనే చిన్న చిన్న పాత్రల్లో నటించింది అనసూయ. అయినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ న్యూస్ ఛానెల్‌లో ప్రమోటర్‌గా చేసింది. ఆ తర్వాత జబర్ధస్త్ అనే కామెడీ షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోని ఈ భామ.. మరెవరికీ సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్‌ను అందుకుంటూ బుల్లితెరపై తన మార్క్ చూపిస్తోంది.

సినిమా ఛాన్స్‌లు.. వాటిలో ఉత్తమ నటన

సినిమా ఛాన్స్‌లు.. వాటిలో ఉత్తమ నటన

బుల్లితెరపై బిజీ యాంకర్‌గా మారిపోయిన అనసూయ.. అప్పుడప్పుడూ సినిమాల్లోనూ నటించి మెప్పిస్తోంది. ఇప్పటికే 'సోగ్గాడే చిన్ని నాయన', 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. అలాగే, ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. మరీ ముఖ్యంగా క్షణం, రంగస్థలం, యాత్ర సినిమాల్లో ఆమె పాత్రలకు ప్రశంసలు దక్కాయి.

స్పైసీ రోల్.. ఐటం సాంగ్.. అనసూయ బిజీ

స్పైసీ రోల్.. ఐటం సాంగ్.. అనసూయ బిజీ

ప్రస్తుతం అనసూయ పలు షోలతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న 'రంగమార్తాండ'లో నటిస్తోంది. ఇందులో ఆమె స్పైసీ రోల్‌లో చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఐటం సాంగ్ కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, సునీల్ సినిమాలోనూ నటిస్తోందట.

 అనసూయ పర్సనల్ మేటర్ లీక్ చేసిన రోజా

అనసూయ పర్సనల్ మేటర్ లీక్ చేసిన రోజా

ఎన్ని షోలు.. సినిమాల్లో నటించినా.. జబర్ధస్త్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది అనసూయ. అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈ షోను మాత్రం మిస్ అవడం లేదు. ఈ క్రమంలోనే వచ్చే వారం జరిగే ఎపిసోడ్‌లో ఆమె స్పెషల్ అట్రాక్షన్ కానుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో జబర్ధస్త్ జడ్జ్ రోజా.. యాంకర్ అనసూయ భరద్వాజ్ పర్సనల్ మేటర్ లీక్ చేయడం హైలైట్ అవుతోంది.

మా అయన దగ్గరున్నదే ఇష్టమన్న యాంకర్

మా అయన దగ్గరున్నదే ఇష్టమన్న యాంకర్

ప్రోమోలో చూపించిన దాని ప్రకారం.. వచ్చే వారం అందరి స్కిట్లూ అదరగొట్టేలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా అదిరే అభి స్కిట్ ఆకట్టుకుంది. దీనికి కారణం స్కిట్‌లో భాగంగా అతడు.. 'నీకు అన్ని బుక్కుల్లోకెల్లా ఏ బుక్ అంటే ఇష్టం' అని అనసూయను ప్రశ్నించాడు. దీనికి ఆమె 'మా ఆయన కనిపించడం లేదు కానీ.. ఆయన చెక్ బుక్ అంటే చాలా ఇష్టం' అని సమాధానం ఇచ్చింది.

 మొత్తం ఆమె దగ్గరే ఉన్నాయంటూ షాకింగ్‌గా

మొత్తం ఆమె దగ్గరే ఉన్నాయంటూ షాకింగ్‌గా

ఆ తర్వాత 'ఇంత సంపాదిస్తుంది కానీ.. వాళ్ల ఆయన చెక్ బుక్ మీదనే కన్నేసింది' అంటూ జడ్జ్‌లు వైపు తిరిగి చెబుతాడు అదిరే అభి. దీనికి స్పందించిన రోజా 'అనసూయ చెప్పేది అబద్ధం. ఊరికే ప్రోమో కోసం అలా చెబుతోంది. మొత్త క్యాష్ ఆవిడ దగ్గరే ఉంటుంది' అంటూ అనసూయ గుట్టురట్టు చేసిందామె. దీంతో జబర్ధస్త్ వచ్చే వారానికి సంబంధించిన వీడియో వైరల్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X