twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్యం ధరలపై 'జబర్దస్త్'లో కమెడియన్ పంచ్.. సీరియస్ అయిన రోజా..

    |

    టెలివిజన్ షోలలో రారాజుగా కొనసాగుతున్న జబర్దస్త్ షోపై అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ రావడం సహజమే. ఎన్నోసార్లు షోకి సంబంధించిన వివాదాలు కోర్టు మెట్ల వరకు వెళ్లాయి. ఇకపోతే అప్పుడప్పుడు పంచ్ ల కారణంగా జడ్జ్ లకు కోపాలు కూడా వస్తుంటాయి. ఇటీవల ఆంద్రప్రదేశ్ మద్యం ధరలపై ఒక కమెడియన్ వేసిన పంచ్ ఎమ్మెల్యే రోజాకు కాస్త అసహనం తెప్పించింది. ఆమె డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

    '

    Recommended Video

    Bandla Ganesh Reacted & Commented On MLA Roja Cooking Video
    మార్పులు చేయక తప్పలేదు..

    మార్పులు చేయక తప్పలేదు..

    లాక్ డౌన్ అనంతరం ఎప్పటిలానే కొన్ని రియాలిటీ షోలు స్టార్ట్ అయ్యాయి. జబర్దస్త్ షో ఆగిపోయిందన్న వార్తలకు కౌంటర్ ఇచ్చే విధంగా మళ్ళీ మొదలుపెట్టారు. అయితే ఈ సారి కొన్ని మార్పులు చేయక తప్పలేదు. కొంతమంది కమెడియన్స్ సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సుధీర్, హైపర్ ఆదిల టీమ్స్ తో మంచి రేటింగ్ ని అందుకుంటున్నాయి రెండు జబర్దస్త్ షోలు.

    మద్యం ధరలపై పంచ్..

    మద్యం ధరలపై పంచ్..

    ఇకపోతే ఇటీవల ఒక కమెడియన్ ఆంద్రప్రదేశ్ మధ్య ధరలు పెరగడంపై స్కిట్ లో భాగంగా ఒక పంచ్ వేయడం రోజాకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ కమెడియన్ మరెవరో కాదు. ముక్కు అవినాష్. స్కిట్ లో భాగంగా లాక్ డౌన్ లో ఒక ఫుల్ బాటిల్ ని తాను రూ.9000లకు కొన్నట్లు పంచ్ వేయగా రోజా స్కిట్ మధ్యలోనే కౌంటర్ ఇచ్చారు.

    రోజా సీరియస్..

    రోజా సీరియస్..

    ఎవడు కొనమన్నాడు అంటూ స్టేజ్ పైనే కౌంటర్ ఇచ్చిన రోజా షో తరువాత కూడా అవినాష్ కి కాస్త క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పంచ్ లు వేసే ముందు కొంచెం ఆలోచించి వేయండి అంటూ అవినాష్ తో పాటు మిగతా వారికి కూడా రోజా హెచ్చరిక జారీ చేసినట్లు టాక్ వస్తోంది.

    వివాదాలు కొత్తేమి కాదు..

    వివాదాలు కొత్తేమి కాదు..

    జబర్దస్త్ లో వివాదాలు రేగడం కొత్తేమి కాదు. గతంలో చాలా సార్లు నాగబాబు కూడా కమెడియన్స్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇక ఆయన కొన్ని విబేధాలు కారణంగా షోకి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోజాకు నాగబాబుకి విబేధాలు కూడా వచ్చినట్లు అప్పట్లో రూమర్స్ గట్టిగానే వచ్చాయి. నాగబాబు జడ్జ్ గా తప్పుకోవడంతో సింగర్ మనో రెగ్యులర్ జడ్జ్ గా కొనసాగుతున్నారు.

    రెమ్యునరేషన్ పై ఎఫెక్ట్..

    రెమ్యునరేషన్ పై ఎఫెక్ట్..

    లాక్ డౌన్ కారణంగా జబర్దస్త్ పేమెంట్స్ లో కూడా తేడాలు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో సాలీడ్ రెమ్యునరేషన్స్ అందుకున్న టీమ్ లీడర్స్ కి కూడా ఈ సారి కోతలు తప్పడం లేదట. ఇక యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ లకు కూడా రెమ్యునరేషన్ కాస్త తగ్గించినట్లు టాక్ వస్తోంది. మళ్ళీ పరిస్థితులు చక్కబడిన తరువాత ఎప్పటిలానే పేమెంట్స్ అందుతాయని షో నిర్వాహకులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

    English summary
    Roja serious on jabardasth comedian comments Jabardast, one of the top comedy shows in the history of Telugu television, has been shut down due to lockdown. At one point, however, the talk came about as the show was no longer on the television screen. The talk also came down to the fact that the organizers were discontinuing the show as the rating went down. That suspense is on screen today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X