రోజాతో శేఖర్ మాస్టర్ రొమాంటిక్ స్టెప్స్.. కొత్త మూమెంట్ మేడం అంటూ ఆ ప్రయత్నం!! వీడియో వైరల్

ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే బుల్లితెరపై వినోదాల విందు పంచడంలో సత్తా చాటుతోంది రోజా. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బుల్లితెరకు రోజా దూరమవుతుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా రెట్టింపు హుషారుతో బుల్లితెర జోష్ కనబర్చుతోంది రోజా. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఓ వీడియో ప్రోమోలో రోజాతో శేఖర్ మాస్టర్ చేసిన రొమాన్స్ ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి పోతే..

 రోజా జబర్దస్తీ..

రోజా జబర్దస్తీ..

నాగబాబు లెఫ్ట్ అయినప్పటికీ జబర్దస్త్ వేదికపై జడ్జిగా తన పవర్ చూపిస్తోంది రోజా. కేవలం ఆమెనే హ్యాండిల్ చేస్తూ జబర్దస్త్ టీఆర్ఫీ రేటింగ్స్‌పై ఏ మాత్రం ప్రభావం పడకుండా జబర్దస్తీ చేస్తోంది. దీంతో పాటు బతుకు జట్కాబండి లాంటి రియాలిటీ షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

 పండగ సందర్భంగా ప్రత్యేకంగా..

పండగ సందర్భంగా ప్రత్యేకంగా..

బుల్లితెర షోస్ కి వస్తున్న ఆదరణ చూసి ప్రతీ పండగకు స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు టీవీ ఛానెల్ నిర్వాహకులు. ఈ ప్రోగ్రామ్స్‌కి ఎక్కువగా రోజా, రష్మీ, అనసూయ, సుడిగాలి సుధీర్, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది లాంటి వారిని పిలిచి పండగ సందడి చేస్తున్నారు.

 పండగ సర్.. పండగ అంతే

పండగ సర్.. పండగ అంతే

ఇందులో భాగంగానే ఈ ఉగాదికి ''పండగ సర్.. పండగ అంతే'' అనే ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. మార్చి 25న ఈ షో ప్రసారం కానుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేసి ఆసక్తిరేకెత్తించారు. ఈ ప్రోమో వీడియోలో రోజాతో శేఖర్ మాస్టర్ చేసిన రొమాన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

శేఖర్ మాస్టర్‌తో స్టెప్పులేసిన రోజా

శేఖర్ మాస్టర్‌తో స్టెప్పులేసిన రోజా

రోజా, శేఖర్ మాస్టర్ లతో పాటు శ్రీముఖి, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, హైపర్ ఆది, వర్షిణి అందరూ ఈ ''పండగ సర్.. పండగ అంతే'' ప్రోగ్రామ్ కి వచ్చారు. అయితే ఈ షోలో భాగంగా రోజా, శేఖర్ మాస్టర్ మాస్టర్ కలిసి అల.. వైకుంఠపురములో సినిమాలోని 'సామజవరగమన' పాటకు స్టెప్పులేసి స్పెషల్ కిక్కిచ్చారు.

Recommended Video

Senior Hero Challenges MLA Roja Husband || Filmibeat Telugu

కొత్త మూమెంట్ మేడం అంటూ ఆ ప్రయత్నం

ఇకపోతే ఇదే ప్రోమో వీడియోలో శేఖర్ మాస్టర్ రోజాను కౌగిలించుకునే ప్రయత్నం చేయడం మరింత ఆసక్తికరంగా అనిపించింది. ఆ ప్రయత్నం గమనించి ఏంటిది? అని రోజా ప్రశ్నిస్తే.. కొత్త మూమెంట్ మేడం అంటూ శేఖర్ మాస్టర్ బదులివ్వడం మరింత ఫన్నీగా ఉంది. మొత్తానికి ఈ షోలో ఇద్దరూ రొమాన్స్ చేస్తూనే డాన్స్‌తో కుమ్మేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X