For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ కమెడియన్‌పై రోజా షాకింగ్ కామెంట్స్: అతడికి ఈగో ఎక్కువ.. ఛీ అంటూ ఉమ్మేసి మరీ ఘోర అవమానం

  |

  ఆర్కే రోజా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈమె దాదాపు నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో చెరగని ముద్రను వేసుకుంది. అదే సమయంలో బుల్లితెరపైనా సందడి చేస్తూ హవాను చూపిస్తోంది. తద్వారా అక్కడా ఇక్కడా ఉంటూ ఎనలేని ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇక, ఈ మధ్య సర్జరీ చేయించుకోవడం వల్ల అన్నింటికీ దూరమైన రోజా.. తాజాగా జబర్ధస్త్‌లో కనిపించారు. ఈ సందర్భంగా ఓ కమెడియన్‌పై షాకింగ్ కామెంట్స్ చేయగా.. మరొకరిపై ఛీ అంటూ ఉమ్మేసి మరీ అవమానించింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  సుదీర్ఘ ప్రయాణం.. రెండో ఇన్నింగ్స్

  సుదీర్ఘ ప్రయాణం.. రెండో ఇన్నింగ్స్


  దాదాపు నలభై ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రోజా. ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. చాలా తక్కువ సయమంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయారు. అప్పటి నుంచి వెండితెరపై వెలుగులు చిందుతూ దూసుకెళ్తున్నారు. హీరోయిన్‌గా గ్యాప్ తీసుకున్న రోజా.. కొన్నేళ్ల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అప్పటి నుంచి అన్ని రకాల పాత్రలు చేస్తున్నారు.

  బుల్లితెరపైనా జబర్ధస్త్‌గా ఆమె కెరీర్

  బుల్లితెరపైనా జబర్ధస్త్‌గా ఆమె కెరీర్

  వెండితెరపై చాలా కాలం హవాను చూపించిన రోజా.. బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘మోడ్రన్ మహాలక్ష్ములు' అనే గేమ్ షోతో హోస్టుగా పరిచయం అయిన ఆమె... ఫేమస్ కామెడీ షో ‘జబర్ధస్త్'తో క్రేజ్ దక్కించుకున్నారు. మధ్యలో ఎన్నో షోలను హోస్ట్ చేసిన ఆమె... ఏడేళ్లుగా జబర్ధస్త్‌కు జడ్జ్‌గా కొనసాగుతూనే ఉన్నారు. తద్వారా ఈ షో సక్సెస్‌లో భాగం అయ్యారు.

  పాలిటిక్స్‌లోనూ సత్తా చాటిన రోజా

  పాలిటిక్స్‌లోనూ సత్తా చాటిన రోజా


  సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న సమయంలోనే రోజా రాజకీయాల్లోకీ కూడా ఎంటర్ అయ్యారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఈ హీరోయిన్.. కొన్నేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన నియోజకవర్గ అభివృద్ధి చూసుకుంటూనే.. కెరీర్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నారు.

  రోజాకు సర్జరీ.. అన్నింటికీ దూరంగా

  రోజాకు సర్జరీ.. అన్నింటికీ దూరంగా


  ఓ వైపు గ్లామర్ ఫీల్డులో బిజీగా ఉంటూనే.. మరోవైపు రాజకీయాల్లో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు రోజా. దీంతో ఆమె తీరక లేని షెడ్యూల్‌ను గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఆమెకు ఓ సర్జరీ జరిగింది. దీంతో రాజకీయాలతో పాటు షోలకు బ్రేకిచ్చారామె. వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న రోజా.. ఇంటి నుంచి ఎన్నో వ్యవహారాలు చూస్తున్నారు.

  జబర్ధస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చేసిన జడ్జ్

  జబర్ధస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చేసిన జడ్జ్


  సర్జరీ కారణంగా చాలా రోజుల పాటు బ్రేక్ తీసుకున్న రోజా.. సుదీర్ఘ విరామం తర్వాత జబర్ధస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఆమెనే ఎక్కువగా హైలైట్ చేశారు. స్కిట్ జరుగుతోన్న మధ్యలో కంటెస్టెంట్లపై పంచులు పేలుస్తూ అదిరిపోయే కమ్‌బ్యాక్ అయ్యారు. ఇక, ఈ ప్రోమోలో ఎక్కువగా ఆమె కనిపించారు. దీనిపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

  అతడికి ఈగో ఎక్కువ అంటూ షాక్


  ఈ ప్రోమోలో రోజా తరచూ ఎవరో ఒకరిపై పంచులు వేస్తూ కనిపించారు. మొదటిగా అదిరే అభి టీమ్‌లో పని చేసే రాముపై ‘నువ్వు హౌలావి. మీ ఇంట్లో అద్దం లేదా' అంటూ గాలి తీసేశారు. ఆ తర్వాత చలాకీ చంటీని ఉద్దేశించి ‘ఆయనకు ఈగో ఎక్కువ' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలా వాళ్ల స్కిట్లో తరచూ పంచులు వేశారు. అలాగే చంటిని కొట్టమని టీమ్‌మేట్స్‌ను ఉసిగొల్పారు.

  Anchor Anasuya జబర్దస్త్ క్రేజ్.. చేతినిండా ప్రెస్టీజియస్ సినిమాలు | #HBDAnasuya | Filmibeat Telugu
  ఛీ అంటూ ఉమ్మేసి మరీ ఘోరంగా

  ఛీ అంటూ ఉమ్మేసి మరీ ఘోరంగా


  అలాగే, పదే పదే ఎవరో ఒకరి గాలి తీస్తూ వచ్చారు రోజా. ఈ క్రమంలోనే అలిగే ఫ్యామిలీ అంటూ ఓ స్కిట్ చేశాడు బాబు. ఆ సమయంలో తాను అలుగుతున్నట్లు బిక్కముఖం పెట్టి పక్కకు వెళ్లాడు. అప్పుడు పక్కనే ఉన్న పంచ్ ప్రసాద్.. ‘ఏం చేస్తున్నావ్ రా. ముఖంలో అస్సలు అర్థం కావట్లేదు' అంటూ కామెంట్ చేశాడు. దీంతో రోజా ఛీ థూ అంటూ అతడిని ఘోరంగా అవమానించారు.

  English summary
  Film actress R. K. Roja Reentry to Jabardasth Comedy Show. In Promo.. She Shocking Comments on Chalaki Chanti And Jabardasth Babu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X