For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను ఆ ప్రాబ్లంతో బాధ పడుతున్నా.. చెప్తే హర్ట్ అవుతారని ఆలోచించా: రోజా షాకింగ్ కామెంట్స్

  |

  తెలుగు బుల్లితెరపై పదుల సంఖ్యలో కార్యక్రమాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే జనరంజకంగా సాగుతూ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందనను దక్కించుకుంటున్నాయి. అలాంటి వాటిలో ప్రముఖ ఛానెల్‌లో రన్ అవుతోన్న కామెడీ షో జబర్ధస్త్ పేరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం దాదాపు ఎనిమిదేళ్లుగా ఇది విజయవంతంగా ప్రసారం అవడమే. ఇక, ఈ షోలో జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న రోజా కూడా సక్సెస్‌లో భాగం అయ్యారనడంలో ఏమాత్రం సందేహం లేదు.

  అంతలా ఆమె దీన్ని నడిపిస్తున్నారు. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆమె ఒంటి చేత్తో షోను సక్సెస్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోజా తన ప్రాబ్లం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన సంగతులేంటో మీరూ చూడండి!

  వాళ్లందరికీ ప్లస్ అయిన జబర్ధస్త్ షో

  వాళ్లందరికీ ప్లస్ అయిన జబర్ధస్త్ షో

  దాదాపుగా ఎనిమిదేళ్లుగా జబర్ధస్త్ షో తెలుగులో నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతోంది. దీనికి పోటీగా ఎన్నో కామెడీ ప్రోగ్రామ్‌లు వచ్చినప్పటికీ అవన్నీ దీని తాకిడిని తట్టుకోలేక మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఫలితంగా బుల్లితెరపై జబర్ధస్త్ హవా కంటిన్యూ అవుతోంది.

  ఇక, ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వారిలో చాలా మంది ప్రస్తుతం బిగ్ సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు. వీళ్లే ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటూ బుల్లితెరపై హవాను చూపిస్తున్నారు. తద్వారా ఈ షో ఖ్యాతి అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

  Pushpa Fight Video: అల్లు అర్జున్ ‘పుష్ప' ఫైట్ వీడియో లీక్.. కేసు పెట్టిన కాసేపటికే ఇంకోటి బయటకు!

  షో వల్ల రోజాకు కూడా.. స్వయంగా

  షో వల్ల రోజాకు కూడా.. స్వయంగా

  జబర్ధస్త్ షో వల్ల ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మాత్రమే కాదు.. ఇందులో జడ్జ్‌లుగా పని చేస్తున్న వాళ్లు కూడా లాభపడ్డారు. అలాగే, యాంకర్లు రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్ భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ షో ద్వారా సీనియర్ హీరోయిన్ రోజాకు ఇది బాగా ప్లస్ అయింది. సినిమాల్లో వచ్చిన గ్యాప్‌ను పూడ్చేందుకు ఈ షో ఉపయోగపడింది. అంతెందుకు ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందడానికి కూడా జబర్ధస్త్ సహకరించిందని అప్పట్లో రోజానే స్వయంగా వెల్లడించారు. దీని బట్టి ఆమెపై షో ప్రభావం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు.

  ఈ మధ్య పంచుల వర్షం.. భయంతో

  ఈ మధ్య పంచుల వర్షం.. భయంతో

  చాలా కాలంగా జబర్ధస్త్‌ జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సీనియర్ హీరోయిన్ రోజా.. అనారోగ్య కారణాలతో కొన్ని ఎపిసోడ్లకు అందుబాటులో లేరు. తిరిగి షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తరచూ తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.

  ఇందులో భాగంగానే స్కిట్లు జరుగుతోన్న సమయంలో ముందుగానే పంచులను లీక్ చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో ఆమె ఎక్కువగా స్కిట్లలో దూరి మరీ ఇప్పటి వరకూ వంట పట్టించుకున్న పంచులను వదులుతున్నారు. దీంతో తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు.

  Indian Idol 12 Shanmukhapriya: షణ్ముఖప్రియుకు ఊహించని ఆఫర్లు.. ఓడిపోయినా ఆ రికార్డు సొంతం

  సందడిగా సాగనున్న వచ్చ ఎపిసోడ్

  సందడిగా సాగనున్న వచ్చ ఎపిసోడ్

  వచ్చే గురువారం జరగనున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రెండు రోజుల క్రితం విడుదలైంది. అన్ని వారాలతో పోలిస్తే ఈ సారి ఇది మరింత సందడిగా సాగబోతుంది. మరీ ముఖ్యంగా జబర్ధస్త్ మేనేజర్లను అనుకరిస్తూ హైపర్ ఆది చేసిన స్కిట్ అదుర్స్ అనిపించేలా ఉంది. అలాగే, సింగం గెటప్‌లో చలాకీ చంటీ, నారప్పలా రాకేట్ రాఘవ, చైనా వాళ్లలా తాగుబోతు రమేష్‌లు కనిపించి ఎంతో నవ్వులు పూయించారు. దీనికితోడు జడ్జ్‌లు, యాంకర్ అనసూయ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఫలితంగా ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  భార్యకు మెసేజ్ చేస్తే కొడుకు జవాబు

  భార్యకు మెసేజ్ చేస్తే కొడుకు జవాబు

  స్కిట్‌లో భాగంగా తన కొడుకు పాత్రను చేస్తున్న కుర్రాడితో అభి ‘ఏం చదువుతున్నావ్ నాన్న ఫోన్‌లో' అని అడుగుతాడు. దీనికి ఆ బుడ్డోడు ‘ఫోన్‌లో రీల్స్ చేస్తున్నా నాన్న' అని సమాధానం చెబుతాడు. ఇదంతా ఏదో చదువు అనుకున్న అభి ‘కొత్త సబ్జెక్ట్ వచ్చినట్లుంది. ఏం చదువుతున్నావ్ నాన్న రీల్స్‌లో' అని ప్రశ్నిస్తాడు. దీనికి ఆ చిన్నారి ఈ మధ్య బాగా ఫేమస్ అయిన ‘జానే మేరి జానే మన్' అనే పాటను ఆలపిస్తాడు. ఆ తర్వాత తన భార్యకు మెసేజ్ చేయగా.. దానికి ఆమె కాకుండా ఆ పిల్లోడే రిప్లై ఇస్తాడు. మొత్తానికి ఈ స్కిట్ చాలా ఫన్నీగా సాగిపోయింది.

  బాత్‌టబ్‌లో తడిసిన అందాలతో అనన్య నాగళ్ల రచ్చ: తెలుగు పిల్లను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు!

  అదిరిపోయే మెసేజ్ ఇచ్చిన అదిరే అభి

  అదిరిపోయే మెసేజ్ ఇచ్చిన అదిరే అభి

  స్కిట్ అయిన తర్వాత అభి ‘మన చేతిలో ఫోన్ ఉంటే వాట్సాప్‌లో స్టేటస్ పెట్టడానికి టైమ్ ఉంటుంది. యూట్యూబ్‌లో కామెంట్లు పెట్టడానికి టైమ్ ఉంటుంది. అమ్మా తిన్నావా? నాన్నా తిన్నవా? అని అడగడానికి మాత్రం టైమ్ ఉండదు. పిల్లల విషయానికి వస్తే.. ఆడించి, చందమామ కథలు చెప్పి గోరు ముద్దలు తినిపించే టైమ్ పోయింది మేడం. చేతిలో ట్యాబో, ఫోనో పెట్టేసి మా బాధ్యత అయిపోయింది అని అనుకుంటున్నారు. జీవితంలో ఫోన్ ఉండడం ఓకే... కానీ ఫోనే జీవితం అనుకుంటే మాత్రం' అంటూ దండం పెట్టేశాడు. దీంతో అందరూ అతడిని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లం అంటూ

  మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లం అంటూ

  అదిరే అభి స్కిట్ ప్రారంభించిన సమయంలో ‘అందరికీ గమనిక.. ఫోన్‌లో స్కిట్ చూడండి.. స్కిట్ జరిగేటప్పుడు ఫోన్ చూడకండి' అంటూ చెప్పాడు. అప్పుడు రోజా ‘ఇదేదో నాకే చెప్పినట్లు అనిపిస్తుంది' అంటూ కామెంట్ చేసింది. అదే సమయంలో అనసూయ కూడా తన ఫోన్ తీసి మరీ చూసుకోవడం కనిపించింది. ఇక, ఫోన్ వాడకం గురించి స్కిట్ జరుగుతోన్న సమయంలో రోజా ‘మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లం ఉంది' అని ఫ్యామిలీ మేటర్ రివీల్ చేశారు. అనంతరం ఓ టీమ్ లీడర్‌ను ఉద్దేశించి ‘నాకూ అనిపించింది.. చెప్తే హర్ట్ అవుతారని అనలేదు' అని చెప్పారామె.

  English summary
  Senior Heroine Roja Shocking Comments on Family Problem in Jabardasth Show. This Promo Video Gone Viral in Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X