For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Roja Vs Indraja : మాటల యుద్ధం, ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటూ ఒకరికొకరు సీరియస్ వార్నింగ్!

  |

  బుల్లితెర మీద జబర్దస్త్ ప్రోగ్రాంకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి జడ్జీలుగా నాగబాబు, రోజా వ్యవహరిస్తూ ఉండేవారు. అయితే వీరిద్దరిలో ఎవరికైనా ఇతర పనిలు లాంటివి పడినా ఇతర కారణాలతో షోకు హాజరు కాకపోయినా అప్పటికి అందుబాటులో ఉన్న ఎవరో ఒకరిని తీసుకువచ్చి షో నడిపిస్తూ ఉండేవారు.

  అయితే మరో జడ్జిగా ఎక్కువ కాలం పాటు ఉన్నది మాత్రం ఇంద్రజ అని చెప్పక తప్పదు.. రోజా శాస్త్ర చికిత్స చేసుకుని ఇంట్లో ఉండగా ఇంద్రజ రోజా స్థానంలో కూర్చుని షో కొన్నాళ్ల పాటు నడిపారు. ఆ తర్వాత రోజా వచ్చాక ఇంద్రజ మళ్ళీ సైలెంట్ అయి పోయారు. అయితే వీరిద్దరి మధ్య తాజాగా ఒక షోలో వాగ్వాదం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఇంద్రజ ఎంట్రీ

  ఇంద్రజ ఎంట్రీ

  కొన్నాళ్ళ క్రితం జబర్దస్త్ జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా శస్త్ర చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ కాగా ఆమె స్థానంలో ఇంద్రజ షోని కొన్నాళ్లపాటు నడిపారు.. అయితే రోజా వచ్చాక కూడా ఇంద్రజ జడ్జి గా ఉంటేనే బాగుంటుందని కింద కామెంట్లు వచ్చిపడ్డాయి. ఇంద్రజ కూడా తనదైన వ్యక్తిత్వం తో షోల కంటెస్టెంట్ లతో పాటు ఆడియన్స్ ని కూడా మెప్పించింది. అయితే రోజంతా కూడా వదులు కోలేని పరిస్థితి మల్లెమాల సంస్థది. దీంతో మధ్యే మార్గంగా రోజాను మళ్లీ జబర్దస్త్ కు తీసుకువచ్చి ఇంద్రజను శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి జడ్జిగా పెట్టారు.

  వినాయక చవితి స్పెషల్

  వినాయక చవితి స్పెషల్

  అందులో జడ్జిమెంట్లు ఏమీ ఇవ్వాల్సిన పని ఉండదు గానీ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక డ్రామా కంపెనీ కి ఆమె ఓనర్ అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అందులో సుదీర్ అలాగే జబర్దస్త్ బ్యాచ్ అంతా ఇది ఏదైనా పండుగ వచ్చింది అంటే ఆ పండుగ స్పెషల్ ఈవెంట్ లో చేయడం మల్లెమాల సంస్థకు ఈటీవీకి పరిపాటి కాబట్టి రాబోతున్న వినాయక చవితి సందర్భంగా ఊరిలో వినాయకుడు అనే ఒక స్పెషల్ ప్రోగ్రాం ప్లాన్ చేశారు. ఇందులో రెండు టీంలు గణేశుడి లడ్డూ వేలం పాటలో పాల్గొంటూ ఉంటాయి. అందులో ఒక టీం కి రోజా నాయకత్వం వహిస్తూ ఉంటే మరో టీంకి ఇంద్రజ నాయకత్వం వహిస్తున్నారు.

  సీరియస్ గా ఒకరినొకరు

  సీరియస్ గా ఒకరినొకరు

  ఇక ఈ షో లో లడ్డు వేలం పాట గురించి మాట్లాడుతూ రోజా గారు లడ్డూ వేలం పాట అంటే జబర్దస్త్ లో జడ్జిమెంట్ ఇవ్వడం అనుకున్నారా అని వెటకారంగా రోజాని ఇంద్రజ ప్రశ్నిస్తుంది. రోజా కూడా ఎక్కడా తగ్గకుండా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిమెంట్ ఇవ్వడం అనుకుంటున్నారా ? అంటూ సూటిగానే ప్రశ్నిస్తుంది. ఇదంతా సీరియస్ గా ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు అనుకునే సమయానికి మళ్లీ నవ్వుతూ కామెడీ అన్నట్లు చూపించారు. మళ్లీ ఇంద్రజ రోజా గారు మీరు ఈ లడ్డూను కొనగలరా ? అని ప్రశ్నిస్తే ఎంతైనా కొంటాను ఎంత ఇచ్చి అయినా కొంటాను అని రోజా సమాధానం చెబుతుంది.

  ఎక్కువగా మాట్లాడుతున్నారు

  ఎక్కువగా మాట్లాడుతున్నారు

  దానికి వెటకారంగా అబ్బా శుభలగ్నం లో జగపతి బాబు గారిని కొన్నట్టు అనుకోకండి, ఇది లడ్డూ అని ఇంద్రజ అంటుంది. దానికి రోజా నన్ను చూసి ఏడవకురా అంటూ కామెంట్ చేస్తుంది, ఎక్కువగా మాట్లాడుతున్నారు అంటూ పేర్కొన్న ఇంద్రజ అతివేగం, ప్రమాదకరం చూసుకోండి అంటూ చెప్పుకొస్తోంది. ఈ వ్యవహారం శ్రుతి మించినట్లు కనిపించడంతో హైపర్ ఆది రంగంలోకి దిగి కామెడీలు చేయమంటే ఆటో వెనుక ఉండే కొటేషన్స్ చెబుతున్నారు ఏంటండీ ఇది అంటూ అక్కడ వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు.

  Recommended Video

  Sudigali Sudheer పై Nagababu కోపం గా ఉన్నారా? నెటిజన్ కి షాకింగ్ రిప్లై
  పిల్లికళ్ళ పాప

  పిల్లికళ్ళ పాప

  ఇక ఆ తర్వాత ఇంద్రజతో ఒక అదిరే సాంగ్ కి డాన్స్ కూడా వేయించి ఆసక్తికరంగా ప్రోగ్రాంను మార్చారు. పిల్లి కళ్ళ పాప ఇంద్రజ ఈజ్ బ్యాక్ అంటూ నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అంటూ ఆమె హీరోయిన్ గా నటించిన యమలీల సినిమా నుంచి ఒక సాంగ్ తీసుకురాగా మోడ్రన్ డ్రెస్ లో కూడా ఇంద్రజ డాన్స్ ఇరగదీసింది అని చెప్పాలి.

  దానికి రోజా కూడా ఇంప్రెస్ అయి బలే డాన్స్ చేశారు, అదరగొట్టేసారు అసలు అంటూ ఉన్నట్టు ఈ ప్రోమోలో చూపించారు ఇక ప్రోమో చివర్లో చాలా ఉన్నాయి ఇంకా దాచాం లోపల అంటూ బాలకృష్ణ డైలాగ్ కూడా పెట్టడం ఈ షో మీద ఆసక్తి పెంచేస్తోంది అని చెప్పచ్చు. మరి చూడాలి ఈ మేరకు ఈ షో ఆకట్టుకొబోతోంది అనేది.

  English summary
  Roja war of words with Indraja in Oorilo Vinayakudu special event for etv.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X