3 నెలల్లో జైల్లోకి.. రోజాపై కిరాక్ ఆర్పీ దారుణంగా

గత కొన్నాళ్ల నుంచి ఏపీ వరకు సినిమాలు అలాగే రాజకీయాలు కూడా కలిపే హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమాకి చెందిన నటీనటులు రాజకీయాల్లోకి వెళ్లడమో కానీ లేదా అదే రాజకీయాల నుంచి కొందరు పరోక్షంగా సినీ సంబంధాలు పెట్టుకోవడమో ఇలా చాలా రకాలుగా అయితే ఏపీ వరకు మాత్రం సినీ మరియు రాజకీయ వ్యవస్థలో రసవత్తరమైన పరిస్థితులే కనిపిస్తూ వస్తున్నాయి.

కాగా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లో ఉన్న వారు కూడా అంతా ఓకే పార్టీకి సపోర్ట్ చేస్తున్న వారు లేరు. వెండితెరపై లేదా బుల్లితెరపై కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న చాలా మంది రాజకీయాలు పరంగా ఊహించని విరోధం ఏర్పరచుకున్నారు. కాగా వీరిలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇపుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నటి ఆర్కే రోజా సెల్వమణి అంటే ఒక్క ఏపీ లోనే కాదు తెలంగాణాలో కూడా బాగా తెలుసు.

roja will be in jail after 3 months kirrak rp made shocking comments

కాగా ఇలా ఏపీలో ఆమె వైఎస్సార్ పార్టీలో కొనసాగుతూ ఉండగా ఆమె తన తోటి హీరోలని అది కూడా టాలీవుడ్ లో బిగ్ స్టార్స్ ని సైతం ఊహించని కామెంట్స్ చేసింది. కాగా అందులో మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా పలు తప్పుడు ఆరోపణలు లేకపోలేవు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు ఇపుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా ఎప్పటికపుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చే రోజాకి తన దగ్గర కాంపౌండ్ నుంచే శత్రువు రావాల్సి వచ్చింది.

కాగా రోజా జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో న్యాయ నిర్ణేతగా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి అందులో కంటెస్టెంట్ గా వచ్చిన చిన్నపాటి కమెడియన్ ఆమె పాలిట మేకై కూర్చున్నాడని చెప్పడంలో సందేహం లేదు. కాగా ఆ నటుడే రామ్ ప్రసాద్ అలియాస్ కిర్రాక్ ఆర్పీ. కాగా గత ఎన్నికల సమయం నుంచే ఆర్పీ రోజాపై విరుచుకుపడ్డాడు.

ఆమెపై బాడీ షేమింగ్ చేస్తూ పలు రాజకీయ విమర్శలు చేసిన ఆర్పీ ఇపుడు మరోసారి రోజాపై చేసిన సంచలన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. కాగా ఆర్పీ ఇటీవల రోజా వెళ్లిన కుంభమేళా ఘటన కోసం మాట్లాడుతూ సెటైర్స్ వేసాడు. అసలు కుంభమేళా స్నానంలో ఎవరైనా నిండుగా మునిగితే ఈవిడ మాత్రం సగమే మునిగి ముఖాన్ని పైకే వదిలేసింది అని ఆమాత్రం దానికి అక్కడ వరకు వెళ్లడం ఎందుకు అంటూ సెటైర్స్ వేసాడు.

అలాగే దీనికి మించిన మరో షాకింగ్ స్టేట్మెంట్ కూడా తాను చేయడం జరిగింది. వితిన్ మూడు నెలల్లో రోజా ఊచలు లెక్కపెట్టబోతున్నావు రెడీగా ఉండు అంటూ మీడియాలో చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే రోజాతో పాటుగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలు వందల కోట్లు అవినీతి చేసారు అంటూ కూడా మరిన్ని సంచలన కామెంట్స్ చేయడం జరిగింది.

దీనితో ఇపుడు ఆర్పీ చేసిన స్టేట్మెంట్ ఊహించనిదిగా మారింది. మరి నిజంగానే ఆర్పీ చెప్పినట్టుగా రోజా మూడు నెలల్లో జైలుకి వెళ్తారో లేదో.. ఆర్పీ కామెంట్స్ పై ఏమన్నా కౌంటర్ ఇస్తారో లేదో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X