వైసీపీలో రోజాకు కీలక పదవి..! ఇక జబర్దస్త్‌కి టైమేది..?

Recommended Video

Roja To Quit Comedy Show Soon ? || Filmibeat Telugu

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో.. ఫ్యామిలీ అంతా కూర్చొని మస్త్ జబర్దస్త్‌గా ఎంజాయ్ చేసే బుల్లితెర ట్రీట్ ఇది. అంతేకాదు ఈ షో ప్రసారం చేస్తున్న టీవీ ఛానెల్ వారికి అంతులేని టీఆర్పీ రేటింగ్ తెచ్చిన ఏకైక షో కూడా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. యాంకర్ అనసూయ అందాల విందులు, న్యాయనిర్ణేతలు నాగబాబు, రోజా నవ్వులు, స్కిట్లు చేసేవారి వేషాలు అన్నీ ఈ షోలో దేనికవి ప్రత్యేకమే. ముఖ్యంగా తనదైన డైలాగులతో ఆడియన్స్‌ని గిలిగింతలు పెట్టడంలో రోజా ఎప్పుడూ ముందే.

 రోజా లేనిదే పాపులారిటీ లేదు

రోజా లేనిదే పాపులారిటీ లేదు

ఒక దశలో రోజా లేనిదే ఈ జబర్దస్త్ షోకి ఇంత పాపులారిటీ లేదు అని టాక్ నడిచింది. అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలైందో అప్పటి నుంచి రోజా పై అనుమానాలు మొదలయ్యాయి. రోజా గెలిస్తే ఇక జబర్దస్త్ నుంచి రోజా బయటకు వచ్చేస్తుందని ఆడియన్స్ బెంగ పెట్టుకున్నారు.

రోజాతో పాటు జగన్ కూడా

రోజాతో పాటు జగన్ కూడా

అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజాతో గెలుపుతో పాటు ఆమె నాయకుడు వైఎస్ జగన్ కూడా విక్టరీ సాధించాడు. దీంతో ఇన్నాళ్లు ఇటు రాజకీయాల్ని, అటు జబర్దస్త్ ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన రోజా ఇక జబర్దస్త్‌కి సెలవు ప్రకటించనుంది అనే టాక్ జోరుగా నడిచింది.

 ఇంకా కొన్ని రోజులైనా..?

ఇంకా కొన్ని రోజులైనా..?

అయితే ఎన్నికల్లో విజయం సాధించాక కూడా రోజా జబర్దస్త్ తెరపై కనిపించి షాకిచ్చింది. ఎప్పటిలాగే తన చిరునవ్వులతో బుల్లితెర ఆడియన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ లోగా జగన్ మంత్రి వర్గ విస్తరణకు సమయం దగ్గర పడటం, ఆమెకు కీలక పదవి దక్కే అవకాశం ఉండటంతో ఇంకా కొన్ని రోజులే జబర్దస్త్ షోలో రోజా కనిపిస్తుందనే టాక్ బాగా వినిపిస్తోంది.

రోజాకి స్పీకర్ పదవి!

రోజాకి స్పీకర్ పదవి!

ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రోజాకి పొలిటికల్‌గా పెద్ద పదవి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జగన్ కేబినెట్‌లో ఆమెకు మంత్రి పదవి దక్కడం ఖాయం, అది మిస్ అయితే స్పీకర్ పదవి ఖాయం అంటున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు. ఇదే జరిగితే రాజకీయ ఒడిలో బిజీగా ఉండాల్సిన పరిస్థితి రోజాది. కాబట్టి ఆమె మరికొద్ది రోజుల్లోనే జబర్దస్త్ వదిలి పెట్టనుందని అంటున్నారు.

నిజమే అనిపిస్తోంది.. మరి జబర్దస్త్ సంగతేంటో!

నిజమే అనిపిస్తోంది.. మరి జబర్దస్త్ సంగతేంటో!

ఒకవేళ రోజా గనక మంత్రి పదవి స్వీకరిస్తే ఆమె ప్రజాసేవకే అంకితం కాక తప్పదు. అది మిస్ అయి స్పీకర్‌గా ఉన్నా అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో షూటింగ్‌కి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉన్న ఈ నాలుగు రోజులే జబర్దస్త్ రోజాను చూసి ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత ఆమె బుల్లితెర విన్యాసాలు చూడటం కష్టమే. మరి ఈమె తర్వాత జబర్దస్త్ న్యాయనిర్ణేతగా ఇంకెవరు వస్తారో! చూడాలి.

More from Filmibeat

Read more about: jabardasth roja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X