దీప్తి సునైనాతో వన్ సైడ్ లవ్, కౌశల్ చేసిన పనికి కోపమొచ్చింది: రోల్ రైడా
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు 2 నుండి గతవారం బయటకు వచ్చిన రోల్ రైడా..... ఎక్కువకాలం పాటు బిగ్ బాస్ ఇంట్లో ప్రేక్షకుల మద్దతుతో కొనసాగిన కంటెస్టెంటుగా పేరు తెచ్చుకున్నాడు. మరో వారం రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 2 ముగుస్తుంది అనే సమయంలో రోల్ రైడా ఎలిమినేట్ అయ్యారు. బాస్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయిన ఈ రాపర్... పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా దీప్తి సునైనతో జరిగిన లవర్ టాస్క్ గురించి, అమిత్‌తో తన అనుబంధం గురించి, కౌశల్ గురించి వెల్లడించారు.

దీప్తి సునైనతో వన్ సైడ్ లవ్
లవర్స్ టాస్క్ వచ్చినపుడు దీప్తి సునైనాతో బాగా ప్లే చేసినట్లు ఉన్నారు అని యాంకర్ ప్రశ్నించగా... దానికి రోల్ రైడా స్పందిస్తూ అది వన్ సైడ్ లవ్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఆ సమయంలో ఆమె వైపు నుండి లవ్ కనిపించలేదు అని తెలిపారు.

బ్రో కాదు... బ్రదర్ ఇన్ లా అనాలని చెప్పాను
లవర్స్ టాస్కులో భాగంగా నేను లెటర్స్ రాయాలి. దానికి ఆమె రియాక్ట్ అవుతూ.... ఇట్స్ ఓకే బ్రో అనేది. అపుడు నేను వెంటనే రియాక్ట్ అవుతూ ‘బ్రో అనొద్దమ్మా... బ్రదర్ ఇన్ లా అనాలి' అంటూ కవర్ చేశాను... అని రోల్ రైడా గుర్తు చేసుకున్నారు.

నాకు ఫీల్ రాదు బ్రో అనేసింది
లవర్స్ టాస్క్ సమయంలోనే.... బయటకు వెళ్లి సాంగ్ వేసుకోవాల్సి ఉంటుంది. రాత్రి పూట సునైనాను లేపి బయటకు వెళదామని అడిగితే.... ఆమె మళ్లీ ‘ఇపుడు నాకు ఫీల్ రాదు బ్రో' అనేసింది. అలా అనడం కూడా వన్ కైండ్ ఆఫ్ ఫన్. చూసే జనాలకు కూడా ఫన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ టాస్కులో చివరకు నాది వన్ సైడ్ లవ్ అయిపోయింది. ఆ టాస్క్ చాలా సరదాగా సాగింది అని రోల్ రైడా గుర్తు చేసుకున్నారు.

అలా చేయడం నాకు కూడా కోపం తెప్పించింది
మీకు, అమిత్‌కు మంచి బాండింగ్ ఉంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కామెడీ టైమింగ్ సూపర్‌గా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య కూడా కౌశల్ చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడు కదా అని యాంకర్ ప్రశ్నించగా... ఆ విషయంలో నాకు కూడా కోపం వచ్చిందని రోల్ రౌడా అన్నారు.

నీకేంటి ప్రాబ్లం అని వెంటనే అనేశాను
మనం ఫ్రెండ్స్ అయినపుడు మాట మాట అనుకుంటాం. అది మనం డిస్ట్రబ్ అవ్వనంత వరకు ఓకే. కౌశల్ వచ్చి మీరు అట్లా అనుకోవద్దు... నాకు బాధ అనిపించింది అంటే నాకు కోపం వచ్చింది. నేను వాడిని ఒరేయ్ అంటా, బే అంటా.. ఇంకేదైనా అంటాను. అది వాడు(అమిత్) తీసుకోకుంటే నువ్వు అలా ఎందుకన్నావ్ అని క్వశ్చన్ చేయవచ్చు. కానీ మా ఇద్దరికీ ఏ సమస్యల లేనపుడు మీరెందుకు అనవసరంగా కల్పించకుంటున్నారని వెంటనే అనడం జరిగింది.

కౌశల్ అలా అనడం తప్పు
స్నేహితులుగా మన ఇద్దరికీ ప్రాబ్లం అవ్వడం లేదు, మూడో వ్యక్తికి కూడా ప్రాబ్లం క్రియేట్ అవ్వడం లేదన్నపుడు మనం ఏం చేసినా ఓకే. ఈ విషయంలో మన ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఉండాలి. కౌనీ కౌశల్ అలా అనడం తప్పు అనిపించి వెంటనే చెప్పేశాను... అను రోల్ రౌడా గుర్తు చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











