Bigg Boss Non Stop: షో ప్రారంభానికి ముందు బిగ్ షాక్.. చివరి నిమిషంలో తప్పుకున్న కంటెస్టెంట్
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం లేని పేరిది. అంతలా ఈ షో దాదాపు ఆరేళ్లుగా టెలివిజన్ రంగంలో సంచలనం అవుతోంది. అదే సమయంలో టీఆర్పీ రేటింగ్‌ను కూడా భారీ స్థాయిలో రాబడుతూ దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. దీంతో షో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓటీటీ వెర్షన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'ను మొదలు పెడుతున్నారు. ఇది శనివారమే (ఫిబ్రవరి 26) ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో యూనిట్‌కు బిగ్ షాక్ తగిలిందట. ఓ కంటెస్టెంట్ ఒకరోజు ముందే తప్పుకున్నాడని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ
మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్‌కు మాత్రమే భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో నిర్వహకులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను తీసుకొస్తున్నారు. దీనికి ‘బిగ్ బాస్ నాన్ స్టాప్' అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలకు మంచి స్పందన వచ్చింది. దీన్ని కూడా నాగార్జునే హోస్ట్ చేయబోతున్నాడు.

హాట్‌స్టార్ రోజంతా ప్రసారం
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను ఇప్పటికే హిందీ, తమిళంలో మొదలు పెట్టారు. ఆ రెండు చోట్లా దీనికి నెటిజన్ల నుంచి మంచి స్పందనే దక్కింది. దీంతో ఇప్పుడు తెలుగులోకి కూడా పరిచయం చేయబోతున్నారు. అయితే, దీన్ని టీవీలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే స్ట్రీమింగ్ చేస్తారని తెలిసిందే. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు అందులో ప్రసారం చేయబోతున్నారు.

ఓటీటీ వెర్షన్ పూర్తి వివరాలు
తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 26వ తేదీ, సాయంత్రం 6 గంటల నుంచి నుంచి ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించబోతున్నట్లు ఇటీవలే విడుదలైన ప్రోమోలో వెల్లడించారు. ఇది మొత్తం 85 రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక, ఇందులో 18 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీళ్ల ఎంపిక కోసం నిర్వహకులు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకున్నారని టాక్.

కంటెస్టెంట్లలో వాళ్లే ఎక్కువ
ఈ శనివారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ కోసం ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి కూడా చర్చలు సాగుతున్నాయి. ఇక, ఇందులో 18 మంది కంటెస్టెంట్లు పాల్గొనబోతుండగా.. అందులో చాలా మంది మాజీ కంటెస్టెంట్లే ఉండబోతున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లూ బయటకొచ్చాయి.

క్వారంటైన్.. ఫోన్ తీసుకుని
తెలుగు బుల్లితెరపై ఇన్ని రోజుల పాటు సందడి చేసిన బిగ్ బాస్.. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రాబోతుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ అనే పేరుతో రాబోతున్న మొదటి సీజన్ కోసం కొద్ది రోజుల క్రితమే కంటెస్టెంట్లను క్వారంటైన్‌కు పంపించారు. అలాగే, రెండు రోజుల క్రితమే వాళ్ల మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక, ఈరోజు పది గంటల నుంచి షూట్ మొదలవుతుంది.

బిగ్ బాస్ యూనిట్‌కు షాక్
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్వహకులు ఎన్నో భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. దీన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షో మొదలవడానికి ఒకరోజు ముందు నిర్వహకులకు భారీ షాక్ తగిలిందట. దీనికి కారణం ఓ కంటెస్టెంట్ తప్పుకోవడమే అని టాక్.
Recommended Video

తప్పుకున్ మేల్ కంటెస్టెంట్
బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చి అలరించిన రోల్ రైడాను ఓటీటీ వెర్షన్ కోసం నిర్వహకులు ఎంచుకున్నారట. అందుకు అనుగుణంగానే అతడు క్వారంటైన్‌కు కూడా వెళ్లాడట. అయితే, కాలికి సంబంధించిన ఏదో సమస్య కారణంగా రోల్ రైడా ప్రారంభానికి ఒకరోజు ముందే తప్పుకున్నాడని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు 17 మందితోనే షోను మొదలు పెడుతున్నారట.


Click it and Unblock the Notifications











